జైహో



రెడ్డి సామ

వ్యవస్థాపక అధ్యక్షులు

WitnessingWorks.com

"జైహో" విధానం మరియు "సాక్షీభూత ప్రతిస్పందనా చికిత్స విధానం" అభివృద్దిలో ఆర్. రెడ్డి సామ సాధనమై నిలిచారు. భారతదేశంలో 25 సంవత్సరాలు గడిపిన పిమ్మట వీరు అమెరికాలో 25 సంవత్సరాలకు పైగా ఉన్నారు. ఇటీవల "జైహో విధానం" పేరిట వ్యక్తులు, జట్లు, చిన్న పెద్ద సమూహాల మధ్య సామరస్య జీవనం, విలువల నడుమ సమతుల్యం సాధించే సమర్ధవంతమైన విధానాన్ని రెడ్డి అభివృద్ది చేసారు. SAMA సంయోజిత సారాంశపు నివేదిక. ఈయన అభివృద్ది చేసిన SAMA సంయోజిత నివేదికల్లో వైరుధ్యాలకు స్వస్థి పలికే మూడు విధానాలు ఉంటాయి. అవి "జైహో విధానం" ద్వారా నా మార్గం, నీ మార్గం, మన మార్గం. వీరు ఇల్లినాయిస్‍లోని షికాగోలో 40 సంవత్సరాలుగా భార్య కళ, కూతురు పద్మజ, కొడుకు ప్రదీప్, ముగ్గురు మనుమలు ఫిలిప్ .జూ (ఆనంద్), నాథన్ (ధర్మ) మరియు టెడ్దీ(ఆకాశ్) లతో నివసిస్తున్నారు.


పద్మజ ఆర్. ఐర్లాండ్

సహ వ్యవస్థాపకురాల

WitnessingWorks.com



పద్మజ ఆర్. "సాక్షీభూత ప్రతిస్పందనా చికిత్స విధానం" మరియు తన స్వంత "పద్మాస్ మార్గం" అభివృద్ధిలో సాధనంగా నిలిచారు. సూక్ష్మగ్రాహ్యత, సృజనాత్మకత కలిగిన పద్మజ వృత్తి రీత్యా మానసిక నిపుణురాలు. ఇల్లు లేనివారి కోసం పనిచేసే "హోమ్‍లెస్ ప్రివెన్షన్ కో ఆర్డినేటర్" ఉద్యోగం ఆమెకు ఇష్టమైన వృత్తి. "జీవించు-జీవించనివ్వు" అన్నది ఆమె జీవన తత్వం. ఈమెకు తన కుటుంబం, పిల్లలు ఫిలిప్ జూనియర్, నాటెన్‍లంటే ఎంతో ప్రేమ.



ప్రపంచ సామరస్యం

గత 30 సంవత్సరాలనుండి రెడ్డి సామా ఒక ఆధ్యాత్మిక ఉపన్యాసకులు. ధ్యానంలో లోతులకు వెళ్ళిన ఈయన అందులో ఎంతో సాధన చేసారు. తన జీవితంలో గత 7 సంవత్సరాలుగా ఎదుర్కొంటున్న సరికొత్త సవాళ్ళు, స్వయంసాక్షిగా నిలిచే ధ్యానం పై ఆయన చేసిన ప్రయోగాలు "జైహో విధానం" గా రూపు దిద్దుకున్నాయి. ఈ విధానంలో తాను కనుగొన్న విషయాలను, మనిషి తన వ్యక్తిగత బాధలనుండి విముక్తుడవ్వటమే కాక విశ్వసామరస్యానికి తోడ్పడే స్థాయికి ఎదగడానికి అవసరమయ్యే చక్కటి విధానాలను www.witnessingworks.com వెబ్‍సైట్లో పొందుపరిచారు. ప్రపంచ సామరస్యపు ప్రాజెక్టు ని సుసాధ్యం చేయడమే వీరి లక్ష్యం.
సర్టిఫైడ్ CTT కన్‍సల్టెంటుగా ఉన్న రెడ్డి సామా తద్వారా ప్రపంచ వ్యాప్తంగా ఉన్న 4000 మంది CTT కన్‍సల్టెంట్లని నెట్‍వర్క్ చేయడం ద్వారా ప్రపంచ సామరస్యపు ప్రాజెక్టుని వ్యక్తులకు నేరుగా, చిన్న పెద్ద సమూహాలకు చేరువ చేయాలన్నది లక్ష్యంగా పని చేస్తున్నారు. పరస్పర ఉత్తేజంతో చక్కగా అమలు పరిస్తే ఈ విధానాల ద్వారా 2020 నాటికి ప్రపంచంలో చెప్పుకోదగిన స్థాయిలో చక్కటి సామరస్యం ఏర్పడుతుంది.




విజన్ (విస్తృత దృష్టి):వ్యక్తిగత అజ్ఞానం, బాధలతో సతమతమవుతున్న వ్యక్తులను ఒక జ్ఞానవంతమైన, పరమానందభరిత సమూహంగా మార్చడం.


మిషన్ (కృషి గమ్యం):బేధాలు ఉన్నప్పటికీ మనుషులంతా ఒకటే అన్న ఏకత్వభావాన్ని ప్రజల్లో మేల్కొలపడం


వేల్యూస్ (విలువలు):అతి ముఖ్యమైన ఏడు విలువలు: 1) జీవశక్తి 2) సమగ్ర వ్యక్తిత్వం 3) ఇచ్చిపుచ్చుకునే తత్వం 4) వ్యవహారాల్లో పారదర్శకత 5) నిజమైన అవగాహన 6) తనలోని అవగాహనను సాక్షిగా (మూడవ మనిషిగా) దర్శించగలగడం 7) ఏకత్వభావన (మనుషులంతా ఒకటేనన్న భావన)


గోల్స్ (లక్ష్యాలు):వ్యక్తుల మధ్య, భార్యాభర్తల మధ్య, కుటుంబాల్లో, సమూహాల్లో, సంఘాల్లో, సంస్థల్లో విబేధాలను పరిష్కరించే ఉపకరణాలను(టూల్స్) తయారుచేయడం


జైహో విధానం - మహోన్నత విజయాలకి అతి సులువైన మార్గం


మెదడు వద్దంటుంది మనస్సు పోనీలే అంటుంది. నువ్వేమీ అనకు. సాక్షిగా గమనిస్తూ ఉండు. ఉన్నట్టుండి నోలో ఒక అవగాహన ఏర్పడటం తెలుస్తుంది. అంతే! నీ జీవితం అసాధారణంగా మారిపోతుందిక.


భారత దేశంలో 25 సంవత్సరాలు గడిపి మరో 25 సంవత్సరాలు అమెరికాలో గడిపారు సామ రామి రెడ్డి. ఇటు భారతీయ విలువలు, ఆధ్యాత్మికత అటు పాశ్చాత్య విధానాలను లోతుగా అధ్యయనం చేసిన పిమ్మట ‘జయహో’ పేరిట ఒక చక్కటి జీవన విధానానికి రూపకల్పన చేసారు. వ్యక్తికి, సమాజానికి, ప్రపంచానికి మధ్య విలువలతో కూడిన సామరస్యం సాధించేందుకు ఎంతో ప్రభావవంతమైన సూత్రాలు ఇందులో ఇమిడి ఉన్నాయి. ఇంతే కాక ఇవి ఆచరణకు అత్యంత సులభంగా ఉండటం విశేష. కుల, మత, వర్ణ, వర్గ, ప్రాంత, భాషలకు అతీతంగా ఎవరైనా పాటించడానికి అనువుగా ఉంటుంది. ఈ ‘జయహో’ - జీవన మంత్రం.


సంతోషంగా ఉంటూ విజయాలని సాధించడమే మనిషి లక్ష్యం కావాలి. ఆనందాన్ని విజయానికి పణంగా పెట్టినప్పుడు ఎంత సాధించినా మనశ్శాంతి ఉండదు. సంతృప్తి కూడా లభించదు. మనిషి అంతర్గతంగా ఎదుగుతూ సమాంతరంగా సమాజంలో అభివృద్ధి సాధించాలి. ఈ క్రమంలో ప్రపంచం కూడా సుఖ శాంతులతో వర్ధుల్లుతుంది. ప్రజలు ఆ వ్యక్తిని మహాత్ముడిగా కొలుస్తారు. ఇలాంటి మహోన్నత పరిపూర్ణ జీవనానికి పూర్తి అర్హత మీకుంది. ప్రపంచంలో గొప్ప విషయాలు అత్ సామాన్యంగా ఉంటాయి. అతి సామాన్యమైన విషయాలు అత్యంత గొప్పవై ఉంటాయి. SIMPLE THINGS ARE GREAT, GREAT THINGS ARE SIMPLE. సంతోషానికి ప్రతిరూపంగా జీవిస్తూ చేపట్టిన ప్రతి పనిలోనూ విజేతగా నిలవడానికి అత్యంత సులభమైన మార్గాలని అందిస్తుంది ‘జయహో’. ఇవి అతి సామాన్యమైనవి, అసాధారణ ప్రభావాన్ని చూపేవి.


ఇందులో వ్యక్తులను విడిగా, సమూహాలకు, సంస్థలకు సామూహికంగా శిక్షణా కార్యక్రమాలు ఉంటాయి. విజయం ఒక మజిలీ కాదు. ఒక నిరంతర ప్రక్రియ. ఎప్పటికప్పుడు విజయాలను సాధిస్తూ అసాధారణ అభివృద్ధివైపు దూసుకెళ్ళేలా ‘జయహో’ మార్చేస్తుంది మిమ్మల్ని.




Copyright © 2010 - 2020 jaihomanthra.com