నిజ జీవితంలో ఒక సందర్భం:
|
|
Inner Stability అంతర్గత స్థిరత్వం | |
| దురాశ భార్య : మీరు తినకపోతే నాకెలా తినబుద్ది అవుతుందండి, నాకు కూడా తినాలని లేదులే... |
|
| అవగాహన భార్య : పోన్లెండి అక్కడే అన్నీ పెట్టాను, ఆకలయినప్పుడు తినండి. |
|
| సమృద్ధి భార్య : ఏవండీ.. ఎలా ఉండే వారు.. ఎలా అయిపోతున్నారో చూడండి.. సరిగ్గా టైం కి ఇంత తిండి తినచ్చుగా... |
|
| అంగీకారం భార్య : అరే... ఒంట్లో ఎలా ఉందీ... |
|
| కోపం భార్య : నా ఇష్టం వచ్చింది చేస్తా... నోర్మూసుకుని తినండి... |
|
| దురాశ భార్య : నేను వండింది అంతా బాగుందంటారు... పేరెట్టేది మీరే!... |
|
| భయం భార్య : ఎక్కడ తినొస్తున్నారో ... ఏమిటో... |
|
Outer Equilibrium బాహ్య సమతుల్యత |
|
| 4. Realising true Potential : (Happened Through me) భార్య : బాగా అలసిపోయినట్లున్నారు.. కలిపి ముద్దలు పెట్టేస్తా.. కాస్త లేచి తినెయ్యండి... |
|
| 3. Transforming Response :(Happened As Me) భార్య : పోనీ ఉప్మా చెయ్యమంటారా.. జీడిపప్పు కాస్త వేసి.. నాక్కూడా తినాలనుందనుకోండి.... |
|
| 2. Reforming Response (Done by me) భార్య : పోనీ ఎలా వండితే నచ్చుతుందో చెప్పచ్చు కదా |
|
| 1. Destroying Response (Done to me) భార్య : వడ్డించాక తినను అంటే ఎలా?. వండింది ఎవరి మొహాన కొట్టమంటారు? |
|
నీవు ఇప్పటికే ఉన్నావు కనుక;
ఇదీ అదీ అనే ఛాయిస్సే లేదు;
నీకు వేరే మార్గమంటూ లేదు
చూస్తూ ఉంట్ చాలు. "
సమస్యలు: ఉమి :- ఓహో! అది నిజంగా గొప్ప సమస్య. అనగానే అందరూ గట్టిగా నవ్వేశారు. మెదడు పరిస్థితే అంత! అది సమస్యలను సృష్టించడానికే ఉంది. అప్పుడు ఆ సమస్యలకు సమాధానాలు చెపుతుంది. చెప్పి ఏమంటుందో తెలుసా! చూడు ఎంతబాగా చేశానో! భలే అంటుంది. సమస్యలంటూ ఏమీ లేవు. అన్నది సత్యం. ఒక్క సమస్య కూడా లేదు. ఉండేవి కేవలం వాస్తవాలు. సమస్యలు కావు. ఈ క్షణంలో అవి కేవలం ఊహ మాత్రమే. ఇది జరగవచ్చు. అది జరగవచ్చు. నేను ఇలా చేస్తే అలా జరగవచ్చు. అన్నీ ఆలోచనలు మాత్రమే. అది ఇప్పుడు జరగక పోతే సమస్య కాదు. కానీ నువ్వు ఇప్పుడే ఇక్కడే ఒక రాతి మీద కూర్చుని ఉన్నావు అనుకుందాం. అది సమస్య కాదు. అది వాస్తవం. రాయిని నీ కింద నుంచి తొలగించు. అప్పుడు ఆ బాధను నువ్వు అనుభవించు. నీకేం కావాలనుకుంటున్నావో దాన్ని గురించి ఒక సారి ఆలోచించు. కానీ అది కాదు సమస్య. రెడ్డి సామా : ఎవరైనా తుపాకీ తెచ్చి నా తలకి పెడితే అది కూడా సమస్య కాదా? ఉమి : - అది ఎప్పటికీ జరుగుతూనే ఉన్నది. బుద్ధుడు తన శిష్యులను ఆ శవాలను తగులబెట్టే ఘాట్ దగ్గరికి ఎప్పుడూ పంపించేవాడు. అక్కడికి ఎప్పుడూ ఆ శవాలు వస్తుంటాయి కదా! అక్కడే కూర్చుని ఆ వచ్చే శవాలని చూస్తుండాలి. శవాలు వస్తాయి. వాటిని తగులబెడతారు. బూడిదని నదిలో కలుపుతారు. ఇవన్నీ వాస్తవాలు. ఈ ప్రపంచంలో చాలా వస్తువులు పుడతాయి. చనిపోతాయి. ఉమి : - లేదు. అందరూ నవ్వుతారు. 18. Purpose: రెడ్డి సామా : అప్పుడు మరి జీవితం యొక్క లక్ష్యం, ఉద్దేశ్యం ఏమిటంటారు? ఉమి : - జీవితానికి ఒక ఉద్దేశ్యమంటూ లేనేలేదు. అది జరుగుతుంది. ఉద్దేశ్యం కావలసింది మెదడుకు. మెదడుకు ఇది అలా ఉండాలి, అది అలా ఉండాలి ఒక గమ్యం ఉండాలి, ఉద్దేశ్యం ఉండాలన్న భావం ఉంది. నేను ఎక్కడికో వెళుతున్నాను. అంటే మనసు అక్కడ ఏదో చేయడానికి ప్రయత్నిస్తోంది. అంతే. కానీ చివరికి ఒక ఉద్దేశ్యం అంటూ ఏమీ లేదు. ఉమి : - అందరికీ మంచి చేస్తానంటారా? మీ మనసులో అది ఎలా జరగాలన్నది ఒక ఆలోచనగా జరగాలి. అందరికీ మంచి అంటే ఏమిటి అన్న ఆలోచన ముందు మీకు కలగాలి. మీరు అక్కడ ఒక భావాన్ని ఒక ఒపీనియన్ ని కలగజేసుకోవాలి. ఒక్కొక్కరూ ఆరకంగా కలగజేసుకుంటే కొన్ని కోట్ల వేరు వేరు భావాలు అక్కడికి చేరుకుంటాయి. అన్నీ మరి అందరికీ మంచే అని అంటాయి. ఇక అక్కడ యుద్దం మొదలవుతుంది. ఈ పద్ధతి పనికిరాదు. అది పనిచేయదు కూడా.
14.రెడ్డి సామా : అయ్యా! నా సమస్య ఏమిటంటే, నేను ఉన్నాను అని నాఅ తెలివి చెపుతుంది. కానీ నిజంగా నేను లేను. అప్పుడది పెద్ద సమస్యగా మారుతుంది.
ఉమి : - అది కూడా సమస్య కాదు. అది కూడా ఒక వాస్తవం.
ఓ అందరూ నవ్వుతారు.
రెడ్డి సామా : అది కూడా సమస్య కాదా!
ఉమి : - లేదు! లేదు! చావు అన్నది ఒక వాస్తవం.
16. DEATH
రెడ్డి సామా : చావు అన్నది సమస్య కాదా?! ఓరి దేవుడా! అందరూ నవ్వుతారు.
రెడ్డి సామా : అంటే సమస్యే లేదన్నమాట.
17. IDENTITY
రెడ్డి సామా : నాకొక సమస్య ఉంది.
అందరూ నవ్వుతారు. నిజానికి సమస్య ఏమిటంటే సమస్య ఉందని నేను అనుకుంటున్నాను. ఎందుకు? ఎందుకంటే నా సెల్ఫ్ ఇమేజ్ ను కాపాడుకోవాలి. నేను మంచి ఇంజనీర్ ని.. అదనీ, ఇదనీ వీటన్నిటినీ కాపాడుకోవాలి. ఇవన్నీ కలిసి సమస్యలను సృష్టిస్తున్నాయి. నేను ఈ సెల్ఫ్ ఇమేజ్ ని వదిలేస్తే చాలు. అప్పుడే సమస్యలు ఉండవు.
ఉమి : - అదంతా గుర్తింపు అన్న దాని మీద ఆధారపడి ఉంటుంది. గుర్తింపు అనే దానికి బహుపార్శ్వాలుంటాయి. ఒక ముఖం కాదు. ఒక పార్శ్వం లో భర్త, మరో వైపు మంచి ఇంజనీరు. మూడో వైపు మనిషి.. తర్వాత ఇంకోటి..ఇంకోటి..వయసు..గతము,..నేను చేసిన పనులు..నా సంబంధాలు...ప్రజలు నా గురించి ఏమనుకుంటున్నారు? నేను నా గురించి ఏమనుకుంటాను. ఇవన్నీ పార్శ్వాలలోకి వస్తాయి. ఇవన్నీ గుర్తింపుకు సంబంధించిన పార్శ్వాలు.
కానీ ఇవన్నీ కేవలం మెదడు పుట్టించినవి మాత్రమే. అవి వాస్తవానికి అక్కడ లేవు. అది మెదడు సృష్టించిన విషయం కనుక. ఏ క్షణానైనా నాశనం కావచ్చు. కనుక దాన్ని ఎప్పటికీ కాపాడుతూ ఉండాలి. ఎప్పటికీ దాన్ని ఎత్తుకుని ఉండాలి. ఎప్పటికీ తిరిగి దాని గురించే ఆలోచిస్తూ ప్రతి క్షణం దాన్ని గురించే పట్టించుకుంటూ ఉండాలి. ఈ పార్శ్వాలన్నింటి గురించి ఎవరెమన్నా? ఏరకమైన దాడి చేసినా వాటి నుంచి నువ్వు దాన్ని కాపాడాలి. ఇదంతా కలిసి విపరీతమైన ఒత్తిడి మొదలవుతుంది. జీవితమంతా ఈ గుర్తింపును కాపాడుకోవడానికి మాత్రమే నీవు గడుపుతావు. ఇక నీవు మరణించిన తర్వాత ఏమౌతుంది.? అంతా పోతుంది. అది ఎప్పుడూ లేనే లేదు గతంలో. అదంతా మెదడు సృష్టించిన విషయం మాత్రమే. నీవు వాటిల్లో ఏమీ కావు. అవన్నీ కేవలం ఆలోచనలు మాత్రమే.
19. DOING GOOD
రెడ్డి సామా : అంటే అందరికీ మంచి చేయడం అన్న ఉద్దేశ్యం కూడా అవసరం లేదంటారా?
20. MIND
రెడ్డి సామా : అంటే ఏమి చేయకుండా, ఏ ఉద్దేశమూ లేకుండా పడి ఉండే మనిషిగా ఉండాలంటారా? నాకది ఇష్టం లేదు. నాకదిష్టం లేదని నా మెదడు అంటున్నది.
ఉమి : - నిజమే! మెదడుకు ఈ పద్ధతి అసలు నచ్చదు. మెదడుకు ఉద్దేశ్యాలు కావాలి. మెదడుకు గుర్తింపు కావాలి. మెదడుకు అందరూ ఔన్ అనడం కావాలి. అందరూ పొగడాలి. అది కూడా అందరూ ఒప్పుకున్న ఒక పద్ధతిలో తనకు నమ్మకం కలిగిన ఒక పద్ధతిలోనే జరగాలి. మెదడుకు కావలసింది ఈ రకమైనదే.
21. IDENTIFICATION
రెడ్డి సామా : అయితే ఈ రకరకాల పాత్రలు నిర్వహించే జీవితం అనే ఆటను నేను ఆనందంగా స్వీకరిస్తున్నాననుకోండి. భర్తగా, ఇంజనీర్ గా, రకరకాలుగా నాటకమాడడం నాకు బాగుందనుకోండి అందులో తప్పేముంది.
ఉమి : - ఇక్కడ ఒచ్చిన బాధంతా నువ్వు అందులో ఒకడివైపోవడమే. అది నువ్వేం చేస్తున్నావని కాదు. నువ్వు ఏం చేయకూడదో అని కాదు. నువ్వు అందులో నేను కూడా ఒక భాగము అనుకున్న మరుక్షణం నీకు బాధ మొదలవుతుంది.ఒక జెన్ గురువును నీకు జ్ఞానోదయం కాకముందు నీవు ఏం చేసేవాడివి అని ఎందరో అడిగారట. నేను నీళ్ళు మోసేవాడిని, నేను కట్టేలు కొట్టేవాడిని అని ఆయన జవాబిచ్చాడు. మరి జ్ఞానోదయం కలిగిన తర్వాత నీవేం చేస్తున్నావని అడిగారు. నీళ్ళు పోస్తున్నారు. కట్టెలు కొడుతున్నాను. అయితే ఇప్పుడాయనకు చేస్తున్న పనితో అందులోనుంచి వచ్చే ఫలితం తో బంధనాలు లేవు. అక్కడ తాను అన్న గుర్తింపు లేదు. ఇక దానితో పాటు మరేదైనా వచ్చి పరిస్థితిని పూర్తిగా మారుస్తున్నదంటే సరే అంగీకారమే.
22.MIND
రెడ్డి సామా : అంటే! నాకు ఏం తోస్తున్నదంటే, పనులు చేయడానికి ఒక సరిఐన దారి ఉంది. వాటికి ఒక తప్పుడు దారి కూడా ఉంది. అంటే బంధనాలు ఉండి పనిచేయడం, బంధనాలు లేకుండా పనిచేయడం ఇదంతా జీవితమనే ఆట.
ఉమి : - నీవు బంధనాలు లేకుండా ఒక పని చేస్తున్నావంటే ఇంకా బంధనాలు ఉన్నట్లే లెక్క. నాకు బంధనాలు లేవు. అని నువ్వు చెప్పగలుగుతున్నావంటే బంధనం ఉంటే తప్ప ఎలా చెప్పగలుగుతావు? మెదడు పని తీరు ఈ రకంగా ఉంటుంది. అందులో ఎప్పుడూ రెండు ప్రతికూల వాదాలు ఉంటాయి. అవి రెండూ కలిసి ఉంటాయి. కొన్ని విషయాలను నీవు మెచ్చుకోలేవు. అదే సమయంలో మరికొన్ని విషయాలను ఇష్టం లేవు అని కూడా అనలేవు. ఇష్టం ఉండడం, ఇష్టం లేకపోవడం ఒకే చోట ఉంటాయి. అది మెదడు నిర్మాణానికి సంబంధించిన విషయం కాదు. మెదడు నిర్మాణమే ఆ రకమైనది.
రెడ్డి సామా : 5 నిమిషాల క్రితం ఏమీ సమస్యలు లేవని చాలా ప్రశాంతంగా నా మనసు. కానీ ఇప్పుడది చాలా గజిబిబగిగా ఐపోయింది. నేనేదో ఎక్కడో తప్పిపోయిన భావన నాకు కలుగుతుంది.
ఉమి : - నీకు సమస్యలంటూ లేవు. అసలు సమస్యలే లేవు. కేవలం మెదడులో మాత్రమే అవినిండుకున్నాయి. 5 నిమిషాల క్రితానికి ఇప్పటికీ జరిగిన తేడా ఏమిటంటే మెదడు ప్రవేశించింది. ఈ పరిస్థితిని సమస్యగా మార్చడం ఎట్లా? అన్న విషయాన్ని తేల్చేసు కుంది.
రెడ్డి సామా : నేనిక్కడ నుంచి వెళ్ళేలోగా నా మెదడుని ఇక్కడ వదిలేసి వెళ్ళడం ఎలాగో చెప్పగలరా? అందులో నాకు సాయం చేయగలరా?
ఉమి : - విషయమేమిటంటె మీరు ఇక్కడ నుండి గేటు దాటి బయటకి వెళ్ళిన మరుక్షణం...
రెడ్డి సామా : అదే కావలసింది.
ఉమి : - రామకృష్ణ ఒక విషయం చెప్పేవారు. ఆయన గంగానది పక్క ప్రాంతంలో జీవించేవారు. చాలామంది ప్రజలు గంగానది దగ్గరకి వస్తారు. స్నానాలు చేస్తారు. తమ మెదడును అక్కడ మెదడును క్షాళనం చేసుకుని, వదిలేసుకుని పోతున్నాం అనుకుంటారు. మేము ఈ నదిలో స్నానం చేసి మమ్మల్ని మేము క్షాళనం చేసుకున్నాం. గంగ మమ్మల్ని క్షాళనం చేసింది అంటూ ఉంటే ఈయన పడీ పడీ నవ్వేవాడట. ఆ పక్కన చెట్లున్నాయి చూశారా? మీరు స్నానానికి వెళ్ళేముందు మెదడులు ఎగిరి చెట్లమీదికెగురుతాయి. అప్పుడు మీకు మెదడు లేని భావం కలుగుతుంది. వెళ్ళి స్నానం చేస్తారు. మీరు గంగలోనుంచి బయటకి వచ్చిన మరుక్షణం మీ మెదడులు శరీకంలోకి దూకుతాయి
35. SIMIPLICITY
రెడ్డి సామా : చూస్తే, ఇది చాలా సులభంగా కనిపిస్తున్నది. కానీ చాలా కష్టం గా కూడా ఉంది.
ఉమి : - ఏమీ లేదు.. ఇదంతా చాలా తేలిక. కానీ సులభం మాత్రం కాదు.
36. MIND
రెడ్డి సామా : చూస్తూంటే మీకు నవ్వు వస్తోందని అర్ధమవుతోంది. అంతేనంటారా?
ఉమి : - నేను కాదు మీరు నవ్వుతున్నారు.
రెడ్డి సామా : మళ్ళీ మళ్ళీ ఇవే అర్ధం లేని ఆటలు.. వాటి నుంచి నేర్చుకున్నదేమీ లేదు.
ఉమి : - నాకు అందులో బాధలు కనిపిస్తున్నాయి. బాధలు కనిపించినప్పుడు గురువు చేయగలిగిందల్లా ఒక మాట చెపుతాను. అదిగో విందు. నీకు ఆకలిగా ఉంది. వెళ్ళి తిందాం పద! చాలామంది ఏమంటారు..లేదు..లేదు..నా రాలేను. నాకిప్పుడు టైం లెదు. నేను తర్వాత వస్తాను. ఇప్పుడు కాదు అంటారు. విందేమో ఇప్పుడు. గురువు యొక్క సహభావన, ప్రేమ అన్నది ఇలా ఉంటుంది. ఆయన దేన్నయినా చేయకుండా ఉండగలరు. అతను వేచి ఉండగలడు. నీకేదైనా ఇవ్వగలడు. చాలా తక్కువ మందికి మాత్రమే ఇది అర్ధమవుతుంది. ఈ బాధలన్నీ అనవసరం. గుర్తుంచుకో! అవసరం అన్నది ఒక్క వస్తువు కూడా లేదు. ప్రశాంతంగా బ్రతకడం అన్నది నీ జన్మ హక్కు.
నార్టన్ ఒక మిత్రుడు.. అతను బాగా చదువుకున్నవాడు. పధకాలు వేయడం గురించి అతను బాగా నేర్చుకున్నాడు. పధకాలు వేయకుంటే ఏం జరుగుతుందీ అన్న భయాన్ని కూడా ఆయనకి బాగా నేర్పించారు. ఇక మెదడు తన పాత్రను నిర్వహిస్తూ అన్ని విషయాలను ఇలా జరుగుతాయి అని ముందు చూపిస్తుంది. మెదడుకు ఉండే ఆనందాలలో ఒకటి.. ఇదిగో ఇలా జరుగుతుందని ముందు చెప్పడం. ఈ గొప్ప ఆనందం గురించి ప్రణాళికలు వేయడంలో గొప్ప ఆనందాన్ని పొందేవాడతను. కానీ అనుకున్నది జరగకపోతే ఓహో అదెట్లా అది మెదడు థియరీ! అతడు ప్రణాళిక అనే ఒక మత్తు మందును తీసుకున్నాడు. దానితో కుప్పకూలిపోయాడు. మెదడు అంటే అది.
44. PROBLEMS
ఉమి : - ఇంజనీరింగ్ అంటే అంతేకదా మరి.
47. PROBLEM
రెడ్డి సామా : సరిగా చెప్పారు.! ఇంజనీరింగ్ అంటే సమస్యలను పరిష్కరించడమే. ఓ మై గాడ్!
ఉమి : - అతనికి కావలసినన్ని సమస్యలని తీసుకొచ్చి ఇవ్వండి. మనమేమో ఇక్కడ సమస్యలనే స్థంభాలని తప్పించుకోవాలనుకుంటున్నాము.
రెడ్డి సామా : ఈ సమస్యకు జవాబు అందేటట్టు ఉంది. కానీ ఇంకొక సమస్య ఉంది. దానికి మాత్రం అసాధ్యమనిపిస్తున్నది.
ఉమి : - అన్ని సమస్యలకు సమాధానం దొరుకుతుంది. సమాధానం లేని సమస్య ఏదుంది?
రెడ్డి సామా : జ్ఞానోదయం!! జ్ఞానోదయాన్ని పొందడం.!! అది నాకు మాత్రమే!
ఉమి : - అది అసలు సమస్యే కాదు! దాన్ని సమస్యగా మార్చడమన్నది అసలు సమస్య.
49. EGO
రెడ్డి సామా : సమస్యలుగా మార్చడం నాకు బాగా వచ్చు.
ఉమి : - కానీ, సమస్య లేదు. అంగీకరించే పరిస్థితిలోకి ఉండు. చూడు “అవును” అనేది అహాన్ని తగ్గిస్తుంది. అహం అన్నది “లేదు” అనే దాని మీద ఆధారపడి పెరుగుతుంది. తాత్త్వికమైన చర్చల్లో అన్నీ లేదు అనే. అవన్నీ నర్మగర్భంగా జరుగుతాయి. ప్రతీదాన్ని కాదనడమే.
కానీ ఔను, ఔను అని విస్తృతమైన మనసుతో ఉంటే అక్కడ నీ ఇగో చనిపోతుంది.
MEDITATION
-------
ఉమి : - మీ కళ్ళు మూసుకోండి. మీకొక చిన్న సంగీతం వినిపిస్తాను. ఆ సంగీతాన్ని మీ శరీరం లోని కణకణంలోనూ ప్రవహించనివ్వండి. ప్రతి క్షణం సంగీతం ఐపోయేదాక దాన్ని అలా ప్రవహించనివ్వండి. ఆ తర్వాత కొంత సేపు నిశ్శబ్దం ఉంటుంది. ఆ నిశ్శబ్దంలో మీ శ్వాసను అనుభవించండి. దాన్ని బాగా గమనించండి. అప్పటివరకు కళ్ళు మూసుకునే ఉండండి. చివరలో గంట మోగే దాకా అలాగే ఉండండి.
Awareness:
A Small Story: (0:35:45)
రెండు వారాల తర్వాత :
ఉమి : - మీకు కనక ఇంజనీరైతే అది తెలిసి చెయ్యండి. అది మీ ఇంజనీరింగ్ ని సర్వ నాశనం చెయ్యచ్చు. లేదా దానిని మార్చవచ్చు. ఎవరికి తెలుసు? నేను ఇంజనీర్ ని కాదు కదా! అందులో ఏం జరుగుతుందో నాకు తెలీదు! ఆ లెక్కలవీ నేను నేర్చుకోలేదు. అయినాసరే బాధ లేదు. కానీ, ఏ క్షణానైనా నీ జీవితం అంతం కావచ్చు. అది 70 ఏళ్ళు, 80 ఏళ్ళు, 90 ఏళ్ళే కానవసరం లేదు. ఇవాళే అంతం కావచ్చు. నీ జీవితం అంతటితో ముగుస్తుంది. మనమందరం మృత్యువుతో ఇప్పుడు కూడా కలిసి జీవిస్తున్నాము. నీ జీవితం లో ముఖ్యమైన విషయాలు అనుకుంటున్నవన్నీ నీవు మరణించగానే ఏమయిపోతాయి? ఇదంతా ఏమిటి అని అడుగుతావేమో! అవును! నేను నా జీవితంలో శక్తినంతా ధారపోసి ఇది చేయాలనీ, అది చేయాలనీ ఎన్నో కష్టాలు పడ్డా. చూడు ఇప్పుడేమో నేనిక వెళ్ళిపోతున్నాను. శరీరం వెళ్ళిపోతోంది. ఇందులో మరిక ఏం మిగిలింది? ఇందులో ఒక గమ్యం, ఉద్దేశ్యం లేకపోతే ఈ జీవితానికి అర్ధం లేదు. ఒక్కొక్క క్షణము పూర్తిగా దానికదిగా బతకడమంటె అర్ధం లేదు. అంటాను.
28. FAMILY
రెడ్డి సామా : కుటుంబంలోని సభ్యుల బాధ్యత గురించి ఆలోచించడమూ, సంఘంలోని మనుషుల గురించి ఆలోచించడము అర్ధం లేని పనులు అంటున్నారు.అంటే మెదడు దృష్టితో నన్నమాట.
ఉమి : - నీ మనుగడలో అది భాగం అని నీవు నమ్మినంతకాలం అది అవసరం.చూడు నువ్వొక చిన్న పిల్లవాడిగా ఉన్నప్పుడు మనుగడ, బతకడం అంటే ఏమిటోనీకు తెలీదు. కానీ త్వరలోనే ఆ మనుగడకు కావలసినవన్నీ సిద్ధం చేసుకోవడం నేర్చుకుంటావు.
సూఫీలు తొమ్మిది మార్గాలుంటాయి అంటారు. పెద్దవాళ్ళని అనుకరించి నేర్చుకుంటావో, పెద్దవాళ్ళను వ్యతిరేకిస్తావో, పెద్దవాళ్ళను అనుసరిస్తావో... అదిచేస్తావో.. ఇది చేస్తావో వగైరా.. వగైరా..
ఈ రకంగా నీవు ఒక పద్ధతిని తయారు చేసుకుంటావు. ఇలా జరుగుతున్నప్పుడు నీ మనుగడకు నీకుటుంబం చాలా అవసరం అన్న గట్టినమ్మకం ఏర్పడుతుంది. కనుక అది చాలా ముఖ్యమైనదిగా మారుతుంది.
అయితే మార్మికవాదులు మాత్రం ఏమన్నారు? కుటుంబాన్ని వదిలేసెయ్ అన్నారు. ఏసుక్రీస్తు కూడా కుటుంబాన్ని వదిలేసెయ్ అన్నారు. కుటుంబం ఏం చేస్తుంది? నీ నమ్మకాలలోని పద్ధతులను మళ్ళీ మళ్ళీ అది గట్టిపరుస్తూ ఉంటుంది. ముందుకు సాగుతుంది. ఆ తరువాత నీవు ఎవరు అన్న నమ్మకాన్ని అది నీకు కలిగిస్తుంది. నీవిక అదే నీ గుర్తింపు అనుకుంటావు. ఇక జ్ఞానోదయం అన్నది నీ చుట్టు ఒక నిర్మాణం, నీకొక గుర్తింపు ఉన్నంతకాలం వీలుకాదు. నీ చుట్టూ ప్రజలు ఉండి ఆ నిర్మాణాన్ని ఎప్పటికప్పుడు గట్టి పరుస్తూ ఉంటే వాళ్ళు నీ జ్ఞానోదయాన్ని అడ్డుకుంటారు అని అర్ధం.
ఇతరులు అడిన ప్రశ్నలు:
Age:
29. డెల్ఫీ : - కనుకనే భారత దేశంలో ఆడవాళ్ళూ, మగవాళ్ళూ ఒక వయసు వచ్చిన తర్వాత ఇంటినుంచి వెళ్ళి గుహలలోకి పోయి తమ గుర్తింపు గురించి పట్టించుకోకుండా మరేదో వెతుకుతూంటారు.
ఉమి : - ఆ పని చేయడానికి ఒక వయసంటూ లేదు. కావాలంటే ఇప్పుడే చెయ్యొచ్చు.
30. డెల్ఫీ : - కానీ వాళ్ళు దీనికి కొన్ని స్థాయిలను ఏర్పాటు చేశారు. ముందు విద్యార్ధిగా ఉండాలి, తర్వాత గృహస్థు గా ఉండాలి అని ఈ రకంగా వాటిని ఆశ్రమ ధర్మాలుగా చేస్తూ వెళ్తున్నారు.
ఉమి : - ఇది సమాజాన్ని నిలబెట్టడానికి చేసిన ఒక విధానం. నీకు ఒక వయసు వచ్చిన తర్వాత, నీ అవసరం సమాజానికి ఉండదు. అప్పుడు నువ్వు వెళ్ళిపోవచ్చు. కానీ బుద్ధుడి సంగతి చూశావా! ఆయన ఒక వయసు వచ్చే దాకా ఆగలేదు. ఆయన తన కుటుంబాన్ని వదిలేసినప్పుడు చాలా చిన్న వయసువాడు.
రామకృష్ణుడు, రమణ మహర్షి కూడా ఒక వయసు వచ్చేదాకా ఆగలేదు.
31. FAMILY
రెడ్డి సామా : అంటే కుటుంబ సభ్యుల పట్ల, సమాజం పట్ల బాధ్యతాయుతమైన భావన అర్ధరహితమంటారా? అంటే మెదడుపరంగా!!
ఉమి : - నీవు వారికి ఆ రకమైన భావన కల్పించాలంటే నీవు చేయవలసిందేమిటి అన్నది ప్రశ్న. నీలోపల ఆరకంగా ఏముంది అన్నది ప్రశ్న.? నీలోపల ఏముంది?
రెడ్డి సామా : మనం చేస్తున్న పనిని వదలవలసిన అవసరం లేదని ఇప్పుడిప్పుడేగా అనుకున్నాము. చేతనతో, జాగరూకతతో ఆ పనిని చేయవచ్చు అనుకున్నాము. కుటుంబంతో కూడా జాగరూకతతో కొనసాగవచ్చును కదా.
ఉమి : - నీవు కుటుంబంలో కొనసాగినంత కాలం వాళ్ళు నీకు గుర్తింపు అనేదాన్ని అనునిత్యం గట్టిపరుస్తూ ఉంటారు. ఆపాదిస్తూ ఉంటారు. మెదడుకు ఇవి రెండూ చాలా అవసరం.
33. COEXISTENCE
రెడ్డి సామా : అంటే మనం రెండు రకాలా చేయచ్చా?
ఉమి : - లేదు.లేదు.. నువ్వున్నావు, దేవుడు లేడు. నీవు లేవు, దేవుడు ఉన్నాడు. నీవింతకూ చేయదలచుకున్నదేమిటంటే..టార్చిలైటు సాయంతో చీకటిని వెదకడానికి ప్రయత్నిస్తున్నావు. అదెలా కుదురుతుంది? నీవు లైటు వెలిగించగానే చీకటి లేకుండా పోతుంది. చీకటి వెలుగులు ఒకే చోట ఉండడం కుదరదు కదా!
34. EXISTENCE
రెడ్డి సామా : అదే నిజమైతే, మరి జ్ఞానోదయమైన మాస్టర్లు, వాళ్ళు ఈ బజారులో ఎలా బతకగలుగుతున్నారు? దేవుడితో ఎలా కొనసాగగల్గుతున్నారు.?
ఉమి : - జ్ఞానోదయంతో బాటు నీ ఉనికి అన్నది మాసిపోతుంది. ఇక నీవు లేవు. ఇక్కడ ఎవరూ మిగలరు. ఒక పని అంటూ మిగలదు. బంధనాలు ఉండవు. గుర్తింపు ఉండదు. అందుకే రమణ మహర్షి కూరలు తరగగలిగారు.
ATTACHMENTS:
ఒక పాత సూఫీ కథ:
ఉమి : - ఒక సూఫీ గురువుగారు.. ఆయనేమో బిచ్చగాడు. చినిగిన దుస్తులు వేసుకుంటాడు. ఎవరైనా ఏమైనా ఇస్తారేమోనని ఎదురుచూస్తాడు. రాజు గారికి ఇతనంటే గొప్ప అభిమానం ఏర్పడింది. రాజు వెళ్ళి గురువుగారితో మాట్లాడుతున్నాడు. ఒకరోజు రాజు అడిగాడు కదా.. మీరు నాతో వచ్చి నా రాజభవనంలో ఉండవచ్చు కదా అని. మాస్టర్ గారు సరే అన్నారు. రాజు గారు గురువుగారిని రాజభవనానికి తీసుకెళ్ళారు. మంచి దుస్తులిచ్చారు. ఆ చిరుగు బట్టలు పోయి మంచి దుస్తులు వచ్చాయి. గురువుగారు రాజభవనంలో ఉంటూ వచ్చారు. రాజ సభకు కూడా వెళ్తారు. రాజును చూడడానికి వచ్చిన వాళ్ళందరూ ఈయన్ని కూడా చూస్తారు. ఒక్కొక్కసారి ఈ గురువుగారు రాజ సింహాసనం మీద కూర్చుంటాడు. రాజు గారు వేసుకున్నట్టే ఈయన కూడా దుస్త్రులు వేసుకోవడం మొదలు పెట్టాడు. అతను రాజు గారు తిరిగినట్టే తానూ చుట్టూ తిరగడం ;మొదలుపెట్టాడు. అన్ని రకాలగా రాజులాగే ప్రవర్తించడం మొదలుపెట్టాడు. ఒకరోజున రాజు ఈయన్ని చూసి అన్నాడు కదా! ఏమిటిక్కడ తేడా అని? మీరు జ్ఞానోదయం కలిగిన మహానుభావులు, గురువులు అనుకున్నాను నేను. మీరేమో ఇక్కడ నాలాగా దుస్తులు వేసుకున్నారు. అప్పుడప్పుడు నాలాగా సింహాసనం మీద కూర్చుంటున్నారు. నాలాగే మీరు ప్రజలతో మాట్లాడుతున్నారు. ఇప్పుడు మరి మీకూ నాకూ తేడా ఏమిటీ?
గురువుగారన్నారు. సరే.. చూపిస్తాను. మనిద్దరం కాసేపు అలా నడుద్దాం పదా అన్నారు. వాళ్ళు నెమ్మదిగా నడక ప్రారంభించారు. బయటకు వెళ్ళారు. రాజ్యంలో నడుస్తూ ఉన్నారు. అక్కడొక కాలువ వచ్చింది. దానిమీద ఒక వంతెన ఉంది. అప్పుడు గురువుగారు తాను వేసుకున్న దుస్తులు వదిలేసారు. లోపలేమో చిరిగిన పాత దుస్తులు ఉన్నాయి. అప్పుడు గురువుగారు రాజును తనతో రమ్మన్నారు. రాజన్నాడు..ఏమిటంటున్నారు మీరు? మీరుకూడా మీ దుస్తులు వదిలేయండి. మనమిద్దరం కలిసి ఈ వంతెన దాటుదాం. అవతలికి వెళదాం నాతో రండి అన్నారు.
రాజంటాడు.. చూసుకోవడానికి నా దేశమంతా ఉందక్కడ. ఈ ప్రజలంతా ఉన్నారు. నాకెన్నో బాధ్యతలున్నాయి. నేను చేయాల్సిన పనులు చాలా ఉన్నాయి అని. గురువుగారు అప్పుడు చెప్పారు..“ అదే మరి తేడా అంటే ” బంధనాలు లేవు. జరిగే పనులతో సంబంధం లేదు.
1. MINDLESSNESS
(రెడ్డి సామా) :
మెదడు లేని పరిస్థితిలో మనం చాలా తీవ్రంగా ప్రవర్తిస్తాము.దుర్మార్గ ధోరణిలకు లోనవుతాము.
జవాబు (ఉమీజీ ) :----- ఉమీజీ గారంటారు..“ మెదడు లేదంటే మనకు చేతన లేదు అని అర్ధం. ఏ మెదడూ పూర్తిగా చేతన లేనిదిగా ఉండదు. మెదడు అన్నది కేవలం ఒక పరికరం. కానీ బాధ మాత్రం ఆ నిర్మాణంతో బ్రతుకుతూ దానితో కలిసిపోయినందుకు తెలుస్తుంది. మెదడులో రకరకాల స్థాయిలు ఉంటాయి కనక ఈ పరిస్థితి వస్తుంది. అచేతనలో ముఖ్యమైన భాగం అక్కడ ఒకటి ఉంటుంది. అక్కడే ప్రోగ్రామింగ్ అంతా జరుగుతుంది. కండిషనింగ్ అంటే పరిస్థితులకు అనుకూలంగా మెదడును మార్చడం అన్నది ఆ వివరాలు అక్కడె ఉంటాయి. మైండ్ లెస్ నెస్ అన్నది అంటే మెదడు లేకుండా ప్రవర్తించడం అన్నది అక్కడే దాగి ఉంటుంది. కానీ ఏ మెదడూ అక్కడ ఉండడం లేదు. మనము కోపంగా ఉంటున్నాము. కారణం లేకుండానే మీరొక పనిని చేస్తున్నారు. ఒక పని చేయాలన్న ప్రణాళిక లేదు. మొత్తం ఉనికికి పూర్తి ఉనికికి మీరు దొరికిపోతున్నారు. ఈ చేతులూ, ఈ గొంతుక, ఈ శరీరం ఇవన్నీ అక్కడ దొరికిపోతున్నాయి.
2. MIND
ప్రశ్న : (రెడ్డి సామా) : అంటే మెదడు గురించి, ఆలోచనలు గురించి తెలిసి ఉండడం అంటే ఆ మధ్య స్థాయిలో ఉండడమా?
జవాబు (ఉమీజీ) : అది అవేర్ నెస్. అంటే తెలివిడి, జాగరూకత అని చెప్పుకోవాలి అర్ధం. మీరు పూర్తిగా ఇక్కడ ఉన్నారనంటే మీ మెదడుతో బాటు ఉన్నారని అర్ధం. మీరు అందులో ఎక్కడికో కొట్టుకు పోయారని కాదు. మెదడు ఏం చేస్తుందో చూడండి. ఒక అనుభవాన్ని గురించి ఆలోచించండి. నాకు ఈ పదార్దం తెలుస్తున్నది. నేను ఈ పదార్ధన్ని తాకుతున్నాను అన్నారనుకోండి. అప్పుడు మెదడు ముందుకొస్తుంది. అది చెప్తుంది. ఇదిగో ఇట్లాగా ముట్టుకో అని. నాకు నచ్చింది అని. నాకు నచ్చలేదు అని. మరేదో చెపుతుంది. అదంతా గతంలో అనుభవంలో ఉంది. మైండ్ ఫుల్ నెస్ అంటే జాగరూకంగా మెదడు పనిచేస్తూ ఉన్నప్పుడు దాని గురించి ఆలోచిస్తున్న భావన ఉండదు. ఉనికికి మెదడు అందుబాటులోకి వస్తుంది. మాట్లాడాలంటే మెదడు ఉండాలి. కానీ మెదడు ఒక్కటే మాట్లాడితే సరిపోదు. అందులో గతమూ, భవిష్యత్తు ఇవన్నీ కలిసి ఉండాలి. ఇది అసలైన విషయం. ఇది అంత సులభంగా అర్ధమయ్యేది కాదు. పైగా నేనీలాంటి విషయాల గురించి సాధారణంగా మాట్లాడను. ప్రజలు సాధారణంగా వాడే మెదడు ఒక జస్టిఫికేషన్ టు స్టే ఇన్ ది మైండ్ అంటే అ భావనలు ఉండడానికి గల సంభావ్యత అంత సులభంగా అందేవి కాదు.
3. CONSICIOUSNESS
ప్రశ్న : (రెడ్డి సామా) : నేను మెదడు లేని స్థితిలో ఉన్నానంటే ఇక మరెవరినో బాధపెడుతున్నానంటే దాన్ని నేను యదాతథంగా అంగీకరిస్తున్నట్లు. అక్కడ నేను ఏం చేస్తున్నట్లు అర్ధం.?
జవాబు (ఉమీజీ) : మీరు అచేతనలో ఉన్నట్లయితే అప్పుడు మరెవరికైనా బాధ కలిగిస్తున్నట్లయితే కేవలం జాగరూకతలోకి, చేతన లోకి వచ్చినప్పుడు మాత్రమే వాటి ద్వారా అన్నిటినీ మర్చడం వీలవుతుంది.ముందు మీరు మారతారు. అప్పుడిక మరొకరికి బాధకలిగించడం అన్నది మీకు వీలు కానిదిగా మారుతుంది. మీకు జాగరూకత, చేతన రెండూ ఉంటే ఈ బాధించడమన్నది అసలు కుదరదు. మీరు పూర్తిగా ఇక్కడ ఉన్నారంటే మీరెవరినీ బాధించలేరు.
4. SUFFERING
ప్రశ్న : రెడ్డి సామా : నేను పూర్తి జాగరూకలో ఉంటే మరొకరిని బాధించలేను. ఎవరినీ నెప్పికి గురిచెయ్యలేను. కానీ నాకా విషయం తెలియకుంటే, నా చేతన స్థితి చాలా తక్కువగా ఉంటే ఏమిటి?
ఉమీ : ఔను. Being unconscious అంటే అచేతనలో ఉండి, నీవు ఎప్పటికీ బాధిస్తూనే ఉంటావు. నిన్ను నీవు బాధించుకుంటావు. ఇతరులను బాధిస్తావు. అచేతన స్థితి యొక్క తీరు, ప్రకృతి అంతే. దాని నిర్మాణమూ, దాని ఉద్దేశమూ కూడా అంతే. ఆ నిర్మాణంతో అచేతన స్థితిలో ఉండి నీవు బాధను సృష్టిస్తున్నావు. చేతనలోకి రావాలంటే నిన్ని హెచ్చరిస్తున్నది ఏమిటి? ఆ బాధ! నీవు బాధకు గురి కావడము. బాధకు గురి కావడమన్నది నీవు తిరిగి చేతనలోకి రావడానికి ఒక హెచ్చరిక.
రెడ్డి సామా : బావుంది. బాధ వల్ల నేను పడుతున్న నొప్పి నన్ను చేతన స్థితి ఒకటి ఉందీ అని జాగరూకతలోకి మరుస్తుందన్నమాట.
ఉమీ : అది నీవు మళ్ళీ జాగరూకతలోకి రావడానికి ఒక అవకాశాన్ని ఇస్తుంది. కానీ అది నిన్ను జాగరూకుడిగా మార్చదు. ఈ పరిస్థితి పనిచేయదు అని అర్ధం చేసుకోవడానికి అది నీకు ఒక అవకాశం ఇస్తుంది. నేనేం చేయాలి? నేను జాగరూకుడుగా ఎలా మారాలి? అదీ బాధ యొక్క ఉద్దేశం. అది మనకొక వరం లాంటిది.అంటే నీవు బాధకు గురవుతున్న ప్ర్తతీసారి నువ్వు ధన్యవాదాలు చెప్పవలసిన ఒక సందర్భం, ఒక అవకాశం కలుగుతున్నదని అర్ధం.
రెడ్డి సామా : అయితే అదే సమయంలో మెదడు ముందుకు వస్తుంది. నేను ఆ బాధపడడం లోంచి ఏదో నేర్చుకుంటున్నాను అంటుంది.
ఉమీ : ఇప్పుడిక నువ్వు బాధ పడతావు. మెదడు ముందుకు వచ్చిందంటె నీవు బాధకు గురవుతావు.
7. MIND
రెడ్డి సామా : నేను బాధకు మళ్ళీ గురవుతాను. నేను బాధ ఇక భరించలేనంత స్థితికి చేరుకుంటే అప్పుడు చేతన అన్నది పైకి లేస్తుంది.
ఉమీ : కాదు! కాదు! అప్పుడు నీకు చేతన స్థితి పైకి రావడానికి అనుమతించడానికి అవకాశం దొరుకుతుంది. నీవు నీ మెదడులోనే మిగిలిఉన్నంతకాలం ఏదీ మారదు. నీవు అక్కడే సుడులు తిరుగుతూ ఉంటావు. జీవిత చక్రంలో తిరుగుతూ ఉంటావు.
9. WORK
రెడ్డి సామా : అయితే పరిస్థితి అదయితే మెదదును వాడుతూ పనిచేస్తున్న ఒక మనిషి రోజుకు 10 గంటలు పనిచేస్తే ఒక గంట మాత్రం ధ్యానంలో ఉంటే దానివల్ల ఏమీ జరగదంటారు.
ఉమీజీ : ఏమీ జరగదు!! జరగదు!! నిజంగా ఉండవలసిన ఆదర్శప్రాయమైన పరిస్థితి ఏమిటంటే భౌతికక్షేత్రంలో ఇదంతా జరగాలి. భౌతిక క్షేత్రంలో అది గనక జరిగినట్టయితే పునాదులను కోల్పోతుంది. అక్కడ పనిచేయడమనే పరిస్థితి ఎదురుకాదు. భౌతిక క్షేత్రం యొక్క పునాది చాలా వేరైన తరంగాలతో ఉంటుంది. అది నీవు చేసే చర్యలకు సంబంధించినది కాదు. అది అక్కడికి నీవు ఏమి తీసుకువస్తున్నావనే దానిపై ఆధారపడి ఉంది.
Journey:
37. రెడ్డి సామా : నేను ఒకరకమైన ఆధ్యాత్మిక ప్రయాణంలో ఉన్నాను. చదువుతాను, ధ్యానం చేస్తాను. 30 సంవత్సరాలుగా ఇలాగే కొనసాగుతోంది. నేను ఈ ప్రయాణంలోనే కొనసాగి ఇంకా పైకి, ఇంకా పైకి, ఆ పైకి ఎక్కి ఈ అధ్యాత్మిక ప్రయాణం అని నేను నిర్మించుకుంటున్న దాంట్లోంచి ఒక్కసారిగా పడిపోతానా?Reading:
38. రెడ్డి సామా : నేను చేస్తున్నది అసలు ప్రయాణమా? మనసులోని ఆలోచనా? అది నాకు అర్ధం కావడం లేదుPast:
39. రెడ్డి సామా : 30 సంవత్సరాల ఆధ్యాత్మిక ప్రయాణంలో ఒక సత్సంగంలో జ్ఞానోదయం కలిగిన గురువుగారి ముందర కూర్చోవడం ఇది నాకు మొదటిసారి. ఇది దుఃఖకరమైన విషయం.
Transformation:
40. రెడ్డి సామా : అంటే మీరు నమ్మకాలన్నింటిని వదులుకోమంటున్నారు. అభిప్రాయాలను, పథకాలను, సిద్ధాంతాలను, చదువుకున్న ఈమెయిల్స్ ని అన్నింటినీ వదులుకోమంటున్నారు. కనీసం నాకలాగే అర్ధమవుతున్నది. కానీ నేను ఉన్న నా పరిస్థితికి నాకు ఆ భావాలు, ఆ సిద్ధాంతాలు ముందు అర్ధమైతే తప్ప కుదరదు. అవి అర్ధమైన తర్వాత నేను దాన్ని వదులుకోగలుగుతానేమో! జరగవలసింది మరి ఈ పద్ధతేనా!
Experience:
42. రెడ్డి సామా : అంటే నాకు అర్ధం కావడం లేదు. కానీ అనుభవంలోకి వస్తున్నది.
Receptiveness:
43. రెడ్డి సామా : ఒక సంఘటన జరిగింది. అది ఎలాగా జరిగిందో నాకు తెలీదు. అది మొత్తం మాస్టర్ ప్లాన్ లో ఒక భాగం అయ్యి ఉండచ్చో లేదో నాకు తెలీదు. నేను ఇంటర్నెట్ లో బ్రౌజింగ్ చేస్తుంటాను. రకరకాల పుస్తకాలు చదువుతున్నాను. ఈమధ్యనే ‘ధమ్మపద’ అనే ఒక పుస్తకం చదివాను. ఆ పుస్తకం కవర్ పేజీ మీద కొన్ని మాటలు చదివాను. వాటిలో ఒకవాక్యం చదివాను. అది నన్ను ముఖంమీద గుద్దినట్లు అనిపించింది. అది ఏమిటంటే జీవితాన్ని ఆర్గ్యుమెంట్ ధోరణిలో కాక అంగీకరించే దృష్టితో చూడు. చర్చా దృష్టితో కాక, అంగీకరించే దృష్టితో చూడు. అది చదవగానే అనిపించింది. ఓరి దేవుడా! 60 సంవత్సరాల పాటు ఈ జీవితాన్ని కేవలం కేవలం వాదించడం, ప్రశ్నించడం, జవాబులు పొందడం మళ్ళీ వాదించడం ఈ పద్ధతిలోనే బ్రతికానని అనిపిస్తోంది .
ఉత్తేజిత జెన్ గురువు ‘ ఉమి ’ గారితో సత్సంగం యు.ఎస్.ఏ, కాలిఫోర్నియాలోని సాంటాకౄజ్ లో 2005 మే 29 న జరిగింది. రామిరెడ్డి సామా ఆ వివరాలను కంపైల్ చేశారు.
2004 లో షికాగో లో జరిగిన ఆటా మహా సభలలో ఆధ్యాత్మిక ప్రసంగం చేసిన ఉమీజీ.
రచయిత నోటు:----- నాపేరు సామా రామి రెడ్డి. ఇండియాలో 25 సంవత్సరాలు గడిపాను. ఉస్మానియా యూనివర్సిటీ నుండి బి.టెక్ కెమికల్ ఇంజనీరింగ్ చేసాను. బి.టెక్ తర్వాత ఉద్యోగరీత్యా అమెరికా వెళ్ళాను. నాకు చిన్నప్పటి నుండి ఆధ్యాత్మిక విషయాలపై కొంచెం అవగాహన ఉంది. అమెరికా వెళ్ళిన తర్వాత అది మరింత బలపడింది. అమెరికాలో భారతీయ తత్త్వజ్ఞానాన్ని మరింత లోతుగా అధ్యయనం చేయడానికి అవకాశం దొరికింది. నా అదృష్టం కొద్ది మంచి పుస్తకాలు, గురువులు దొరికారు. భారతీయ ఆధ్యాత్మిక చింతనతో పాటు అటు అమెరికా దేశస్థుల జీవనశైలిని, ఆలోచనా పద్ధతులను, వ్యక్తిత్వ వికాస విధానాలను అర్ధం చేసుకున్నాను. ఈ రెంటిని సమన్వయ పరుచుకుంటూ నా పరిశోధనలు కొనసాగిస్తున్నాను. ఇది ఇలా జరుగుతుండగా 2004 లో ఆటా (అమెరికన్ తెలుగు అసోసియేషన్) జాతీయ సమావేశం షికాగోలో జరిగింది. నన్ను స్పిరిట్యుయల్ కమిటీ ఛైర్ పర్సన్ గా బాధ్యత అప్పజెప్పారు. ప్రపంచ వ్యాప్తంగా ఉన్న ప్రముఖ స్పిరిట్యుయల్ లీడర్స్ అందరితోనూ ఒక సమావేశం నిర్వహించాము. ఇందులో భాగంగా నాకు ఎంతోమంది మహాజ్ఞానులతో గడిపి వారితో సంభాషించే అవకాశం దొరికింది. ఈ సందర్భంగా సద్గురు ఉమీజీ తో నేను జరిపిన సత్సంగం నా ఆధ్యాత్మిక జీవనమార్గంలో ఒక విప్లవాత్మకమైన మార్పును తీసుకువచ్చింది. నేను ప్రశ్నలడుగుతున్నాను. ఆయన సమాధానాలు చెపుతున్నారు. ఉమీజీ గారి సమాధానాల్లో ఎన్నో అద్భుతమైన, విలువైన ఆధ్యాత్మిక విషయాలు, జీవిత సత్యాలు ఎంతో సులభంగా అవగాహన లోనికి వచ్చాయి. ఇవి జీవితంపట్ల నాకు అంతవరకు ఉన్న దృక్పథాన్ని విప్లవాత్మకంగా మార్చేసింది. ఎంతో సులభంగా, ఆనందంగా హాయిగా గడపాల్సిన మన జీవితాలని అవగాహన లేకుండా సమస్యల సుడిగుండంలో చిక్కుకుపోయేలా చేసుకుంటున్నాం అని అర్ధమయింది. వీటినుండి బయటపడడానికి ఒక అద్భుతమైన మార్గం ఉమీజీ గారి ఉపదేశంలో దొరికింది. వ్యక్తిగత సమస్యలతో బాధపడుతున్న వ్యక్తి వాటినుంచి బయటపడటమే కాకుండా సమాజంతో సామరస్యంగా జీవిస్తూ తద్వారా ప్రపంచ శాంతికి దోహదపడే వ్యక్తిగా ఎదగడానికి మార్గాలు దొరికాయి. ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే, ఇవి అన్ని తరగతుల వారు అన్ని వయసుల వారు, అన్ని వృత్తుల వారు చాలా సులభంగా ఆచరించదగ్గవి. ఎంతో అదృష్టం కొద్దీ ఉమీజీతో సత్సంగ్ భాగ్యం లభించింది. సత్సంగం లోని మొత్తం సంభాషణలను మీతో పంచుకుంటున్నాను. వినండి.
సత్సంగంలో ప్రశ్నలు:-----
(రెడ్డి సామా) :
మెదడు లేని పరిస్థితిలో మనం చాలా తీవ్రంగా ప్రవర్తిస్తాము.దుర్మార్గ ధోరణిలకు లోనవుతాము. అని దీనిగురించి ప్రశ్నఅడిగారు.
జవాబు (ఉమీజీ ) :----- ఉమీజీ గారంటారు..“ మెదడు లేదంటే మనకు చేతన లేదు అని అర్ధం. ఏ మెదడూ పూర్తిగా చేతన లేనిదిగా ఉండదు. మెదడు అన్నది కేవలం ఒక పరికరం. కానీ బాధ మాత్రం ఆ నిర్మాణంతో బ్రతుకుతూ దానితో కలిసిపోయినందుకు తెలుస్తుంది. మెదడులో రకరకాల స్థాయిలు ఉంటాయి కనక ఈ పరిస్థితి వస్తుంది. అచేతనలో ముఖ్యమైన భాగం అక్కడ ఒకటి ఉంటుంది. అక్కడే ప్రోగ్రామింగ్ అంతా జరుగుతుంది. కండిషనింగ్ అంటే పరిస్థితులకు అనుకూలంగా మెదడును మార్చడం అన్నది ఆ వివరాలు అక్కడె ఉంటాయి. మైండ్ లెస్ నెస్ అన్నది అంటే మెదడు లేకుండా ప్రవర్తించడం అన్నది అక్కడే దాగి ఉంటుంది. కానీ ఏ మెదడూ అక్కడ ఉండడం లేదు. మనము కోపంగా ఉంటున్నాము. కారణం లేకుండానే మీరొక పనిని చేస్తున్నారు. ఒక పని చేయాలన్న ప్రణాళిక లేదు. మొత్తం ఉనికికి పూర్తి ఉనికికి మీరు దొరికిపోతున్నారు. ఈ చేతులూ, ఈ గొంతుక, ఈ శరీరం ఇవన్నీ అక్కడ దొరికిపోతున్నాయి.
ప్రశ్న : (రెడ్డి సామా) : అంటే మెదడు గురించి, ఆలోచనలు గురించి తెలిసి ఉండడం అంటే ఆ మధ్య స్థాయిలో ఉండడమా? అని అడుగుతున్నారు. జవాబు (ఉమీజీ) : అది అవేర్ నెస్. అంటే తెలివిడి, జాగరూకత అని చెప్పుకోవాలి అర్ధం. మీరు పూర్తిగా ఇక్కడ ఉన్నారనంటే మీ మెదడుతో బాటు ఉన్నారని అర్ధం. మీరు అందులో ఎక్కడికో కొట్టుకు పోయారని కాదు. మెదడు ఏం చేస్తుందో చూడండి. ఒక అనుభవాన్ని గురించి ఆలోచించండి. నాకు ఈ పదార్దం తెలుస్తున్నది. నేను ఈ పదార్ధన్ని తాకుతున్నాను అన్నారనుకోండి. అప్పుడు మెదడు ముందుకొస్తుంది. అది చెప్తుంది. ఇదిగో ఇట్లాగా ముట్టుకో అని. నాకు నచ్చింది అని. నాకు నచ్చలేదు అని. మరేదో చెపుతుంది. అదంతా గతంలో అనుభవంలో ఉంది. మైండ్ ఫుల్ నెస్ అంటే జాగరూకంగా మెదడు పనిచేస్తూ ఉన్నప్పుడు దాని గురించి ఆలోచిస్తున్న భావన ఉండదు. ఉనికికి మెదడు అందుబాటులోకి వస్తుంది. మాట్లాడాలంటే మెదడు ఉండాలి. కానీ మెదడు ఒక్కటే మాట్లాడితే సరిపోదు. అందులో గతమూ, భవిష్యత్తు ఇవన్నీ కలిసి ఉండాలి. ఇది అసలైన విషయం. ఇది అంత సులభంగా అర్ధమయ్యేది కాదు. పైగా నేనీలాంటి విషయాల గురించి సాధారణంగా మాట్లాడను. ప్రజలు సాధారణంగా వాడే మెదడు ఒక జస్టిఫికేషన్ టు స్టే ఇన్ ది మైండ్ అంటే అ భావనలు ఉండడానికి గల సంభావ్యత అంత సులభంగా అందేవి కాదు.
ప్రశ్న : (రెడ్డి సామా) : నేను మెదడు లేని స్థితిలో ఉన్నానంటే ఇక మరెవరినో బాధపెడుతున్నానంటే దాన్ని నేను యదాతథంగా అంగీకరిస్తున్నట్లు. అక్కడ నేను ఏం చేస్తున్నట్లు అర్ధం.?
జవాబు (ఉమీజీ) : మీరు అచేతనలో ఉన్నట్లయితే అప్పుడు మరెవరికైనా బాధ కలిగిస్తున్నట్లయితే కేవలం జాగరూకతలోకి, చేతన లోకి వచ్చినప్పుడు మాత్రమే వాటి ద్వారా మాత్రమే అన్నిటినీ మర్చడం వీలవుతుంది.ముందు మీరు మారతారు. అప్పుడిక మరొకరికి బాధకలిగించడం అన్నది మీకు వీలు కానిదిగా మారుతుంది. మీకు జాగరూకత, చేతన రెండూ ఉంటే ఈ బాధించడమన్నది అసలు కుదరదు. మీరు పూర్తిగా ఇక్కడ ఉన్నారంటే మీరెవరినీ బాధించలేరు.
ప్రశ్న : రెడ్డి సామా : నేను పూర్తి జాగరూకలోఉంటే మరొకరిని బాధించలేను. ఎవరినీ నెప్పికి గురిచెయ్యలేను. కానీ నాకా విషయం తెలియకుంటే నా చేతన స్థితి చాలా తక్కువగా ఉంటే ఏమిటి?
ఉమీ : ఔను. Being unconscious అంటే అచేతనలో ఉండి, నీవు ఎప్పటికీ బాధిస్తూనే ఉంటావు. నిన్ను నీవు బాధించుకుంటావు. ఇతరులను బాధిస్తావు. అచేతన స్థితి యొక్క తీరు, ప్రకృతి అంతే. దాని నిర్మాణమూ, దాని ఉద్దేశమూ కూడా అంతే. ఆ నిర్మాణంతో అచేతన స్థితిలో ఉండి నీవు బాధను సృష్టిస్తున్నావు. చేతనలోకి రావాలంటే నిన్ని హెచ్చరిస్తున్నది ఏమిటి? ఆ బాధ! నీవు బాధకు గురి కావడము. బాధకు గురి కావడమన్నది నీవు తిరిగి చేతనలోకి రావడానికి ఒక హెచ్చరిక.
రెడ్డి సామా : ఓహో బావుంది. బాధ వల్ల నేను పడుతున్న నొప్పి నన్ను చేతన స్థితి ఒకటి ఉందీ అని జాగరూకతలోకి మారుస్తుందన్నమాట.
ఉమీ : అది నీవు మళ్ళీ జాగరూకతలోకి రావడానికి ఒక అవకాశాన్ని ఇస్తుంది. కానీ అది నిన్ను జాగరూకుడిగా మార్చదు. ఈ పరిస్థితి పనిచేయదు అని అర్ధం చేసుకోవడానికి అది నీకు ఒక అవకాశం ఇస్తుంది. నేనేం చేయాలి? నేను జాగరూకుడుగా ఎలా మారాలి? అదీ బాధ యొక్క ఉద్దేశం. అది మనకొక వరం లాంటిది.అంటే నీవు బాధకు గురవుతున్న ప్ర్తతీసారి నువ్వు ధన్యవాదాలు చెప్పవలసిన ఒక సందర్భం, ఒక అవకాశం కలుగుతున్నదని అర్ధం.
రెడ్డి సామా : అయితే అదే సమయంలో మెదడు ముందుకు వస్తుంది. నేను ఈ బాధపడడం లోంచి ఏదో నేర్చుకుంటున్నాను అంటుంది.
ఉమీ : ఇప్పుడిక నువ్వు బాధ పడతావు. మెదడు ముందుకు వచ్చిందంటె నీవు బాధకు గురవుతావు.
రెడ్డి సామా : నేను బాధకు మళ్ళీ గురవుతాను. నేను బాధ ఇక భరించలేనంత స్థితికి చేరుకుంటే అప్పుడు చేతన అన్నది పైకి లేస్తుంది.
ఉమీ : కాదు! కాదు! అప్పుడు నీకు చేతన స్థితి పైకి రావడానికి అనుమతించడానికి అవకాశం దొరుకుతుంది. నీవు నీ మెదడులోనే మిగిలిఉన్నంతకాలం ఏదీ మారదు. నీవు అక్కడే సుడులు తిరుగుతూ ఉంటావు. జీవిత చక్రంలో తిరుగుతూ ఉంటావు.
రెడ్డి సామా : నా సమస్య అదే! మెదడు కేవలం మెదడు!
ఉమీ : ఔను! నువ్వేం చేస్తావంటే చూస్తూ ఉండిపోతావు. కేవలం చూస్తూ ఉండిపోతావు. నిన్ను నీవు చూస్తావు. నీ శరీరాన్ని చూస్తావు. శరీరానికి కలిగే భౌతిక ప్రేరణలన్నింటిని చూస్తావు. శరీరానికి చుట్టూ ఏం జరుగుతూ ఉంటే నీవు లోపల జరుగుతున్నట్టు చూస్తావు. ఐతే అక్కడ ఒక న్యాయ నిర్ణయం ఉండదు. అక్కడొక అభిప్రాయం ఉండదు. ఇది మంచి సందర్భం అన్న భావం గానీ, ఇది కాదు అన్న భావం కానీ, ఉండదు. లోపల జరుగుతున్న దాన్నంతా కేవలం అంగీకరించడం మాత్రమే జరుగుతుంది. ఇక ఏం జరుగుతుందంటే, లోపల జరుగుతున్న అన్నింటినీ గమనించడం ద్వారా అది పనిచేసే తీరును ప్రారంభించే పద్ధతిలోకి వెళ్తాం. నీవు మెదడులోకి వెళ్ళిన మరుక్షణం concepts అంటే కొన్ని సూత్రాలు... conditioning కు సంబంధించిన కాన్సెప్ట్స్. అంటె ఒక పద్దతికి మలచడానికి అవసరమైన సూత్రాలలోకి నీవు కదిలిపోతావు. అక్కడ culture of the structure..నిర్మాణానికి సంబంధించిన ఒక థియరీ బయటకొస్తుంది. కానీ అదిపనిచేయదు. వేలాది వేలాది సంవత్సరాలుగా అది పనిచేయలేదు. ఇక ముందు కూడా పనిచేయదు. కానీ నీవు జాగరూకతలోకి కదిలినప్పుడు అది ఏదైతే పనిచేస్తుందో అందులోనికి కదలడం మొదలుపెడుతుంది. ఈ పనిచేసే పద్ధతిలోకి మారడం, కదలడం అన్నది నీరంతా సముద్రంలోకి వెళ్ళడం లాగా ఉంటుంది. ఇక్కడే కాసేపు ఉండి, ఏం జరుగుతున్నది వేగంగా ఎట్లా జరుగుతుందో చూడాలి. ఏం జరుగుతున్నది అన్నదానికి నదికి ఒక అవగాహన లేదు. ఏం జరగదు అన్నసంగతి కూడా నదికి తెలియదు. దానికి అవగాహన లేదు కాబట్టి అది ప్రయత్నించదు కాబట్టి వెళ్ళి సముద్రంలో కలుస్తుంది.
రెడ్డి సామా : అయితే పరిస్థితి అదయితే మెదదును వాడుతూ పనిచేస్తున్న ఒక మనిషి రోజుకు 10 గంటలు పనిచేస్తే ఒక గంట మాత్రం ధ్యానంలో ఉంటే దానివల్ల ఏమీ జరగదంటారు.
ఉమీజీ : ఏమీ జరగదు!! జరగదు!! నిజంగా ఉండవలసిన ఆదర్శప్రాయమైన పరిస్థితి ఏమిటంటే భౌతికక్షేత్రంలో ఇదంతా జరగాలి. భౌతిక క్షేత్రంలో అది గనక జరిగినట్టయితే పునాదులను కోల్పోతుంది. అక్కడ పనిచేయడమనే పరిస్థితి ఎదురుకాదు. భౌతిక క్షేత్రం యొక్క పునాది చాలా వేరైన తరంగాలతో ఉంటుంది. అది నీవు చేసే చర్యలకు సంబంధించినది కాదు. అది అక్కడికి నీవు ఏమి తీసుకువస్తున్నావనే దానిపై ఆధారపడి ఉంది.
రెడ్డి సామా : అంటే నీవు చేతనలో ఉంటూ నీ వ్యవహారంలో కూడా ఉంటె నీవు అక్కడ అపజయాల పాలవుతావు అని అర్ధమా?
ఉమీ : అది కూడా చెప్పడానికి లేదు. అక్కడా వేరు వేరు పరిస్థితులున్నాయి. నిజనికివి రెండూ కలిసి పనిచేయడం కుదరదు. కానీ కొన్ని సార్లు జరుగుతుంది. అరుదుగా కొన్ని కొన్ని సందర్భాలలో అది జరిగింది. అక్కడ ఒక కార్యప్రణాళిక దానితోపాటు లేనప్పుడు. అంటే అది నీవు చేస్తున్న ఏదో ఒక పని. ఇక అక్కడ నేను అన్న ఇగో వచ్చిందంటే నీవు చాలా విజయాలనైనా సాధించగలుగుతావు వ్యాపారంలో లేదా అక్కడ బాధలకు గురౌతావు. లేదా నేను అన్న ఇగో ను గమనించి అవసరమైనంత జాగరూకత లేక ఆ ఇగోను తొలగించుకోవాలని విపరీతమైన ప్రయత్నాలు చేసి అప్పుడు నీవు అపజయాల పాలవుతావు. అక్కడ ఆధ్యాత్మికమైన ఇగో రావడంతో ఒక పెద్ద బంధనం లేదా బోను ఏర్పాటవుతుంది. అక్కడ ప్ర్రైడ్ ఇగో కన్నా ఇన్ గ్రెయిన్డ్ ..లోపల పాతుకుపోయిన నేను అన్న భావం ఎక్కువ బలంగా పనిచేస్తుంది.
ఉమీ : చూడు! నేను ఎంత గొప్ప విషయాలు చేస్తున్నాను. బీదవాళ్ళకు ఎంత సాయం చేస్తున్నాను. ఎన్ని రకాల మంచిపనులు చేస్తున్నాను. అని చెప్పే స్థితిలోకి అది నిన్ను కదిలిస్తుంది. అది ఆధ్యాత్మిక ఈగోలోకి నీవు కదిలి సరియైన ప్రవర్తన, ఆధ్యాత్మిక ప్రవర్తన అని నీకు తెలిసిఉండె పరిస్థితిలోకి వెళ్ళడం లాంటిది. కనుకనే యు.జి.కృష్ణమూర్తి గారు రమణ మహర్షిని చూడడానికి వెళ్ళినప్పుడు అక్కడ ఆయన కూరగాయలు తరుగుతూ కనిపించాడట. ఆహా! ఈయన ఏమి ఉత్ప్రేరణ కలిగినవాడు, ఉత్తేజితుడు? ఇతను ఆధ్యాత్మిక మనిషి కానేకాడు అనిపించింది. అతను కూరగాయలు తరుగుతున్నాడు. అది చూసి కృష్ణమూర్తి పూర్తిగా నిరాశకు గురయ్యాడు. ఆయన మళ్ళీ మరొకసారి వెళ్ళాడు. అప్పుడు రమణ మహర్షి తోటలో పనిచేస్తున్నాడు. ఓహో ఇదా సంగతి, ఇతనేమి, నిజంగా తెలివిడిలోకి అంటే ఆత్మజ్ఞానం కలిగిన బుద్ధుడైన వాడు కాదు అని అనిపించిదతనికి. జ్ఞానోదయం కలిగిన మనిషి కాదు అనిపించింది. ఆ రాత్రి ఆయనకి రమణ మహర్షి గురించి పూర్తిగా నమ్మకం పోయింది.
అయితే ఆధ్యాత్మికత అన్నద చేస్తున్న పనితో ఏమాత్రం సంబంధం లేనిది. ఆధ్యాత్మిక ఇగో అన్నదానికి ఆధ్యాత్మిక కార్యక్రమాల మీద ఒక ప్రత్యేక దృష్టి ఉంటుంది.
జెన్ కథ
ఉమి : - నేను సంఘానికి ఆమధ్య అందించిన చిన్న కథ ఇది. ఇక్కడ కూడా పరిస్థితిని వివరించడానికి అది పనికొస్తుందని నేను అనుకుంటున్నాను. నేను మీకు దాన్ని చదివి వినిపిస్తాను.
జెన్ మాస్టర్ : - “నా దగ్గర ఒక కర్ర ఉన్నది. అయినా సరే నా దగ్గర కర్ర లేదు. దీనిని నీవు ఎలా వివరించగలుగుతావు?”
నోవిస్ (కొత్తగా చేరిన మనిషి) : అది నా వల్ల కాదు.
మాస్టర్ : - మరీ అంత పట్టనట్టు ఉండకు. జ్ఞానోదయం కలగాలంటే అన్ని రకాల ప్రయత్నాలు చేసి ప్రశ్నకు జవాబు వెతకడం నీకు తప్పనిసరి అంటారు.
నోవిస్ :- సరే! ఒక రకంగా ఆలోచించి చూస్తాను. నీ దగ్గర ఒక కర్ర ఉన్నది. దాన్ని ఇంకొకరకంగా చూస్తే కర్ర లేదు అంటారు..
మాస్టర్ : - ఆ క్షణంలో మాస్టర్ కాదు. నేను చెప్తున్న్దది అది కాదు. ఒకే దృష్టి నుంచి చూస్తూనే నా దగ్గర కర్ర ఉన్నది. నా దగ్గర కర్ర లేదు. దాన్ని ఎట్లాగ వివరిస్తావు అని అడుగుతారు.?
నోవిస్ :- నా వల్లకాదు.
మాస్టర్ : - నువ్వు అంత సులభంగా ఒదిలిపెట్టకూడదు. నీ అస్తిత్వంలోని అణువణువునూ ఉపయోగించి ఈ ప్రశ్నకు జవాబు వెతకాలి.
నోవిస్ :- నేను మీతో చర్చించను. ఈ సమస్యను వదలా లేదా అనే విషయం గురించి నేను మీతో చర్చించను. ఐతే ఇక్కడ ముఖ్యమైన విషయం ఏమిటంటె నేను మాత్రం ఈ సమస్యను ఒదిలేస్తాను.
మాస్టర్ : - ఐతే నీకు జ్ఞానోదయం సాధించాలన్న కోరిక లేదా?
నోవిస్ :- జ్ఞానోదయం సాధించడమంటే ఇట్లాంటి అర్ధం లేని ప్రశ్నలకు జవాబు చెప్పడమే అయితే అది నాకు అవసరం లేదు. నేను మిమ్మల్ని నిరాశకు గురి చేసినందుకు క్షమించాలి. కానీ నన్ను వదిలేసెయ్యండి. గుడ్ బై.
12 సంవత్సరాల తర్వాత:--
మొదట్లో కొత్త సాధకుడిగా వచ్చిన మనిషి (నోవిస్) మళ్ళీ వచ్చాడు.
నోవిస్ :- మాస్టర్ నేను తిరిగి మీదగ్గరకు వచ్చాను. 12 సంవత్సరాల తర్వాత సంపూర్తిగా కుంచించుకుపోయి వచ్చాను. ఇన్ని ఏళ్ళుగా నా పిరికితనం గురించి భయంకరమైన భావనలకు నేనులోనవుతూ తిరగాడాను. ఇంక దారి తప్పించుకుని పారిపోయే పరిస్థితి లేదని, జీవితం నుంచి పారిపోయే పద్ధతి లేదని ఇప్పుడో, మరొకప్పుడో నేను విశ్వంలోని తుది ప్రశ్నను తప్పకుండా ఎదుర్కోవాలని నాకు అర్ధమైంది. కనుక నేనిపుడు నన్ను నేను దొంగిలించుకుని అంటే నన్ను నేను దారి మలుపుకుని ఇంతకు మీరిచ్చిన సమస్య గురించి కృషి చేయాలనే భావనలోకి వచ్చాను.
మాస్టర్ : - ఏమిటా సమస్య?
నోవిస్ :- అప్పుడు మీరొక మాట చెప్పారు. నీదగ్గరొక కర్ర ఉంది. ఐనా నీ దగ్గర కర్ర లేదు. దాన్ని ఎలా వివరిస్తావో చెప్పమన్నారు.
మాస్టర్ : - నిజంగా అలా చెప్పమన్నానా? ఎందుకు? ఏదో పిచ్చిగా ఉంది కదూ?
రెడ్డి సామా : ఆ ప్రశ్నకు జవాబు చెప్పడమంటే నిశ్శబ్దంగా ఉండాలి. ఏ జవాబు చెప్పకూడదనా మీ భావం?
ఉమి : - ఆయనో నిమిషం పాటు నిజానికి నిశ్శబ్దంగా ఉన్నారు.
సభలో సత్సంగంలో అందరూ నవ్వేశారు. సుమారు ఒక నిమిషం తర్వాత ఉమిగారు చెప్పారు.
ఉమి : - సరియైన మార్గం అంటూ ఏదీ లేదు. తప్పుడు మార్గం అంటూ కూడా ఏదీ లేదు. నీవు ఇప్పటికే ఉన్నావు గనుక ఇక ఇది అది అనే ఛాయిస్ లేదు. నీకు ఇక వేరే మార్గమంటూ లేదు. చూస్తూ ఉంటే చాలు.
రెడ్డి సామా : అయ్యా! నా సమస్య ఏమిటంటె నేను ఉన్నాను అని నా తెలివ చెబుతుంది.కానీ నేను ఉన్నానా? అప్పుడది గొప్ప సమస్యగా మారుతుంది.
ఉమి : - ఓహో! అది నిజంగా గొప్ప సమస్య. అనగానే అందరూ గట్టిగా నవ్వేశారు. మెదడు పరిస్థితే అంత! అది సమస్యలను సృష్టించడానికే ఉంది. అప్పుడు ఆ సమస్యలకు సమాధానాలు చెపుతుంది. చెప్పి ఏమంటుందో తెలుసా! చూడు ఎంతబాగా చేశానో! భలే అంటుంది. సమస్యలంటూ ఏమీ లేవు. అన్నది సత్యం. ఒక్క సమస్య కూడా లేదు. ఉండేవి కేవలం వాస్తవాలు. సమస్యలు కావు. ఈ క్షణంలో అవి సమస్య కేవలం ఊహ మాత్రమే. ఇది జరగవచ్చు. అది జరగవచ్చు. నేను ఇలా చేస్తే అలా జరగవచ్చు. అన్నీ ఆలోచనలు మాత్రమే. అది ఇప్పుడు జరగక పోతే సమస్య కాదు.
కానీ నువ్వు ఇప్పుడే ఇక్కడే ఒక రాతి మీద కూర్చుని ఉన్నావు అనుకుందాం. అది సమస్య కాదు. అది వాస్తవం. రాయిని నీ కింద నుంచి తొలగించు. అప్పుడు ఆ బాధను నువ్వు అనుభవించు. నీకేం కావాలనుకుంటున్నావో దాన్ని గురించి ఒక సారి ఆలోచించు. కానీ అది కాదు సమస్య.
రెడ్డి సామా : ఎవరైనా తుపాకి తెచ్చి నా తలకి పెడితే అది కూడా సమస్య కాదా?
ఉమి : - అది కూడా సమస్య కాదు. అది కూడా ఒక వాస్తవం.
రెడ్డి సామా : ఓ అందరూ నవ్వుతారు. అంటే చావడం సమస్య కాదా!
ఉమి : - లేదు! లేదు! చావు అన్నది ఒక వాస్తవం.
రెడ్డి సామా : చావు అన్నది వాస్తవమా! ఓరి దేవుడా! అందరూ నవ్వుతారు.
ఉమి : - అది ఎప్పటికీ జరుగుతూనే ఉన్నది. బుద్ధుడు తన శిష్యులను ఆ శవాలను తగులబెట్టే ఘాట్ దగ్గరికి ఎప్పటికీ పంపించేవాడు. అక్కడికి ఎప్పుడూ ఆ శవాలు వస్తుంటాయి కదా! అక్కడే కూర్చుని ఆ వచ్చే శవాలని చూస్తుండాలి. శవాలు వస్తాయి. వాటిని తగులబెడతారు. బూడిదని నదిలో కలుపుతారు. ఇవన్నీ వాస్తవాలు. ఈ ప్రపంచంలో చాలా వస్తువులు పుడతాయి. చనిపోతాయి.
రెడ్డి సామా : నాకొక సమస్య ఉంది.
ఉమి : - అదంతా గుర్తింపు అన్న దాని మీద ఆధారపడి ఉంటుంది. గుర్తింపు అనే దానికి బహుపార్శ్వాలుంటాయి. ఒక ముఖం కాదు. ఒక పార్శ్వం లో భర్త, మరో వైపు మంచి ఇంజనీరు. మూడో వైపు మనిషి.. తర్వాత ఇంకోటి..ఇంకోటి..వయసు..గతము,..నేను చేసిన పనులు..నా సంబంధాలు...ప్రజలు నా గురించి ఏమనుకుంటున్నారు? నేను నా గురించి ఏమనుకుంటాను. ఇవన్నీ పార్శ్వాలలోకి వస్తాయి. ఇవన్నీ గుర్తింపుకు సంబంధించిన పార్శ్వాలు.
కానీ ఇవన్నీ కేవలం మెదడు పుట్టించినవి మాత్రమే. అవి వాస్తవానికి అక్కడ లేవు. అది మెదడు సృష్టించిన విషయం కనుక. ఏ క్షణానైనా నాశనం కావచ్చు. కనుక దాన్ని ఎప్పటికీ కాపాడుతూ ఉండాలి. ఎప్పటికీ దాన్ని ఎత్తుకుని ఉండాలి. ఎప్పటికీ తిరిగి దాని గురించే ఆలోచిస్తూ ప్రతి క్షణం దాన్ని గురించే పట్టించుకుంటూ ఉండాలి. ఈ పార్శ్వాలన్నింటి గురించి ఎవరెమన్నా? ఏరకమైన దాడి చేసినా వాటి నుంచి నువ్వు దాన్ని కాపాడాలి. ఇదంతా కలిసి విపరీతమైన ఒత్తిడి మొదలవుతుంది. జీవితమంతా ఈ గుర్తింపును కాపాడుకోవడానికి మాత్రమే నీవు గడుపుతావు. ఇక నీవు మరణించిన తర్వాత ఏమౌతుంది.? అంతా పోతుంది. అది ఎప్పుడూ లేనే లేదు గతంలో. అదంతా మెదడు సృష్టించిన విషయం మాత్రమే. నీవు వాటిల్లో ఏమీ కావు. అవన్నీ కేవలం ఆలోచనలు మాత్రమే.
రెడ్డి సామా : అప్పుడు మరి జీవితం యొక్క లక్ష్యం, ఉద్దేశ్యం ఏమిటంటారు?
ఉమి : - జీవితానికి ఒక ఉద్దేశ్యమంటూ లేనేలేదు. అది జరుగుతుంది. ఉద్దేశ్యం కావలసింది మెదడుకు. మెదడుకు ఇది అలా ఉండాలి, అది అలా ఉండాలి ఒక గమ్యం ఉండాలి, ఉద్దేశ్యం ఉండాలన్న భావం ఉంది. నేను ఎక్కడికో వెళుతున్నాను. అంటే మనసు అక్కడ ఏదో చేయడానికి ప్రయత్నిస్తోంది. అంతే. కానీ చివరికి ఒక ఉద్దేశ్యం అంటూ ఏమీ లేదు.
రెడ్డి సామా : అంటే ఏమి చేయకుండా నిష్క్రియగా ఏ ఉద్దేశమూ లేకుండా పడి ఉండే మనిషిగా ఉండాలంటారా? నాకది ఇష్టం లేదు. నాకదిష్టం లేదని నా మెదడు అంటున్నది.
ఉమి : - నిజమే! మెదడుకు ఈ పద్ధతి అసలు నచ్చదు. మెదడుకు ఉద్దేశ్యాలు కావాలి. మెదడుకు గుర్తింపు కావాలి. మెదడుకు అందరూ ఔననడం కావాలి. అందరూ పొగడాలి. అది కూడా అందరూ ఒప్పుకున్న ఒక పద్ధతిలో తనకు నమ్మకం కలిగిన ఒక పద్ధతిలోనే జరగాలి. మెదడుకు కావలసింది ఈ రకమైనదే.
రెడ్డి సామా : అయితే ఈ రకరకాల పాత్రలు నిర్వహించే జీవితం అనే ఆటను నేను ఆనందంగా స్వీకరిస్తున్నాననుకోండి. భర్తగా, ఇంజనీర్ గా, రకరకాలుగా నాటకమాడడం నాకు బాగుందనుకోండి అందులో తప్పేముంది.
ఉమి : - ఇక్కడ ఒచ్చిన బాధంతా నువ్వు అందులో ఒకడివైపోవడమే. అది నువ్వేం చేస్తున్నావని కాదు. నువ్వు ఏం చేయకూడదో అని కాదు. నువ్వు అందులో నేను కూడా ఒక భాగము అనుకున్న మరుక్షణం నీకు బాధ మొదలవుతుంది.ఒక జెన్ గురువును నీకు జ్ఞానోదయం కాకముందు నీవు ఏం చేసేవాడివి అని ఎవరో అడిగారటా. నేను నీళ్ళు మోసేవాడిని, నేను కట్టేలు కొట్టేవాడిని అని ఆయన జవాబిచ్చాడు. మరి జ్ఞానోదయం కలిగిన తర్వాత నీవేం చేస్తున్నావని అడిగారు. నీళ్ళు పోస్తున్నారు. కట్టెలు కొడుతున్నాను. అయితే ఇప్పుడాయనకు చేస్తున్న పనితో అందులోనుంచి వచ్చే ఫలితం తో బంధనాలు లేవు. అక్కడ తాను అన్న గుర్తింపు లేదు. ఇక దానితో పాటు మరేదైనా వచ్చి పరిస్థితిని పూర్తిగా మారుస్తున్నదంటే సరే అంగీకారమే.
రెడ్డి సామా : అంటే! నాకు ఏం తోస్తున్నదంటే, పనులు చేయడానికి ఒక సరిఐన దారి ఉంది. వాటికి ఒక తప్పుడు దారి కూడా ఉంది. అంటే బంధనాలు ఉండి పనిచేయడం, బంధనాలు లేకుండా పనిచేయడం అన్నదంతా కలిపి జీవితమనే ఆట.
ఉమి : - నీవు బంధనాలు లేకుండా ఒక పని చేస్తున్నావంటే ఇంకా బంధనాలు ఉన్నట్లే లెక్క. నాకు బంధనాలు లేవు. అని నువ్వు చెప్పగలుగుతున్నావంటే బంధనం ఉంటే తప్ప ఎలా చెప్పగలుగుతావు? మెదడు పని తీరు ఈ రకంగా ఉంటుంది. అందులో ఎప్పుడూ రెండు ప్రతికూల వాదాలు ఉంటాయి. అవి రెండూ కలిసి ఉంటాయి. కొన్ని విషయాలను నీవు మెచ్చుకోలేవు. అదే సమయంలో మరికొన్ని విషయాలను ఇష్టం లేవు అని కూడా అనలేవు. ఇష్టం ఉండడం, ఇష్టం లేకపోవడం ఒకే చోట ఉంటాయి. అది మెదడు నిర్మాణానికి సంబంధించిన విషయం కాదు. మెదడు నిర్మాణమే ఆ రకమైనది.
రెడ్డి సామా : ఇక 5 నిమిషాల క్రితం ఏమీ సమస్యలు లేవని చాలా ప్రశాంతంగా నా మనసు. కానీ ఇప్పుడది చాలా గజిబిబి ఐపోయింది. నేనేదో ఎక్కడో తప్పిపోయిన భావన నాకు కలుగుతుంది.
ఉమి : - నీకు సమస్యలంటూ లేవు. అసలు సమస్యలే లేవు. కేవలం మెదడులో మాత్రమే అవినిండుకున్నాయి. 5 నిమిషాల క్రితానికి ఇప్పటికీ జరిగిన తేడా ఏమిటంటే మెదడు ప్రవేశించింది. ఈ పరిస్థితిని సమస్యగా మార్చడం ఎట్లా? అన్న విషయాన్ని తేల్చేసుకుంది.
రెడ్డి సామా : నేనిక్కడ నుంచి వెళ్ళేలోగా నా మెదడుని ఇక్కడ వదిలేసి వెళ్ళడం ఎలాగో చెప్పగలరా? అందులో నాకు సాయం చేయగలరా?
ఉమి : - విషయమేమిటంటె మీరు ఇక్కడ నుండి గేటు దాటి బయటకి వెళ్ళిన మరుక్షణం...
రెడ్డి సామా : అదే కావలసింది.
ఉమి : - రామకృష్ణ ఒక విషయం చెప్పేవారు. ఆయన గంగానది పక్క ప్రాంతంలో జీవించేవారు. చాలామంది ప్రజలు గంగానది దగ్గరకి వస్తారు. స్నానాలు చేస్తారు. తమ మెదడును అక్కడ మెదడును క్షాళనం చేసుకుని, వదిలేసుకుని పోతున్నాం అనుకుంటారు. మేము ఈ నదిలో స్నానం చేసి మమ్మల్ని మేము క్షాళనం చేసుకున్నాం. గంగ మమ్మల్ని క్షాళనం చేసింది అంటూ ఉంటే ఈయన పడీ పడీ నవ్వేవాడట. ఆ పక్కన చేట్లున్నాయి చూశారా? మీరు స్నానానికి వెళ్ళేముందు మెదడులు ఎగిరి చెట్లమీదికెగురుతాయి. అప్పుడు మీకు మెదడు లేని భావం కలుగుతుంది. వెళ్ళి స్నానం చేస్తారు. మీరు గంగలోనుంచి బయటకి వచ్చిన మరుక్షణం మీ మెదడులు దూకి మీ శరీకంలోకి దూకుతాయి.
రెడ్డి సామా : మరైతే ఏం చెయ్యాలి?
ఉమి : - మీరు చేస్తున్నదేమిటంటే, జీవితానికొక మార్గం వెతుక్కుంటున్నారు. కానీ జీవితానికి ఒక మార్గం అన్నది లేదు. చేసే దాన్ని చేస్తూ ఉండు. కానీ దాని గురించి జాగరూకత కలిగి ఉండు. ఈ సమాజంతో వచ్చిన పెద్ద కష్టం ఏమిటంటే అది నిన్ను ప్రతిక్షణం, నీ చేతననూ, నీ జాగరూకతనూ మరిపించే ప్రయత్నం చేస్తోంది. నీలో కోరికలను రేపుతుంది. ఈ వచ్చే వ్యాపార ప్రకటనలన్నీ ఈ కోరికలను రేపడమే. భయాన్ని కలిగించడమే. అడ్వర్టయిజింగ్ లో ఉండే విషయాలేమిటంటే ఒకటి భయం, రెండవది లైంగికత, మూడవది కోరికలు. ఈ మూడు విధానాలు కలిసి ప్రచారం, అడ్వర్టయిజింగ్ గా సాగుతున్నాయి. ఇదంతా కలిసి నీకు జాగరూకత లేకుండా అచేతనుడిగా మారుస్తుంది. న్యూస్ పేపర్ వాళ్ళకు ఫోన్ చేసి, వాళ్ళను అడుగుతాం. మీరు మంచి వార్తలు ఎందుకు అచ్చు వేయరు. అని.! వాళ్ళేమంటారో తెలుసా? మంచి వార్తలు వేస్తే పత్రిక అమ్ముడు పోదు. కేవలం అమ్ముడుపోవడం ఒకటే సమస్య కాదు. ప్రకటనలు అసలే రావు. అని చెప్తారు. అదేమరి, ఒక చెడ్డ వార్తను వేస్తే ఒక ప్రకటన వేస్తే జీవితం ఇంత అందంగా ఉండవచ్చు కదా! అన్న ఒక ఆలోచన పుడుతుందక్కడ. నేను బాగోలేనని, భయంకరంగా ఉన్నానని ఒక భావం. అది అక్కడా అందే జవాబు. సమాజం అన్నది ఈ రకంగానే పనిచేస్తుంది. అందుకే మార్మికత.. మిస్టిక్స్ అనేవాళ్ళు సంఘం అని తమకోసం ఒకదాన్ని నిర్మించుకున్నారు. అక్కడ నీకు ఈ అచేతన అన్న బాధ, ఈ కోరికలు, భయం లాంటి వాటి తాకిడి లేదు. అక్కడ నీ లోలోపల ఉన్న విషయాలను గురించి మీరు వెతుకుతూ, దానిని అందు కుంటూ, దానిని వెలికితీసుకు రాగలుగుతారు. అక్కడ అపరిచితమైన విషయాలను అనువర్తించే అవకాశం ఉంది. తెలిసిన విషయాలనే నీవు వరసపెట్టి చేసుకుంటూ పోతుంటె నీవు అచేతనలోకి పోతావు. ఆ సంఘంలో నీవు జరిగేవి, జరగలేనివి, నమ్మకంలేని కొన్ని విషయాలను చేపట్టుకోవచ్చు. సంఘం యొక్క ఉద్దేశం అదే. అందుకే మాస్టర్లు వాటిని సృష్టిస్తారు. అక్కడ నీవు మెదడులోకి మళ్ళీ తిరిగి వెళతావు. అక్కడ నీ సమస్యలను వెతుకుతావు.
నువ్విక్కడ ఉన్నావు. ఊపిరి వస్తుంది. ఊపిరి బయటకు పోతుంది. లోనికి వస్తుంది. అంతా సులభంగా సాగుతుంది. గుండె కొట్టుకుంటుంది. దానికి నువ్వు చేయాల్సిన దేమీ లేదు. అది జరుగుతూ ఉంటుంది. చూస్తూ ఉండటమే.
రెడ్డి సామా : ఒకసారి మనిషికి జ్ఞానోదయం కలిగిన తర్వాత అతను ఎక్కడికైనా వెళ్ళవచ్చు. ఏ మార్కెట్ లోకైనా తిరిగవచ్చు. అయినా సరే, చేతనతో, జాగురూకతతో ఉండవచ్చును. అంతేనా?
ఉమి : - జ్ఞానోదయం కలిగిన చాలామంది మనుషులు ఉన్నారు వాళ్ళు ఏమీ అనరు. వాళ్ళు ఊరికే మాట్లాడరు. చేతనుడు కావడం జాగరూకుడు అవుతున్నావంటే నువ్వు మాట్లాడతావని భావం. జ్ఞానోదయం కలిగిన చాలామంది అంతకు ముందు తాము చేస్తున్న పనులనే ఆ తరువాత బంధనాలు లేకుండా చేస్తు న్నారు. అంటే ఇక్కడ బంధనాలు లేవు. చేయవలసింది ఇది అని ఒక కార్య ప్రణాళిక లేదు. వాళ్ళకు అంతకు ముందు వ్యాపారం ఉంటే తరువాత కూడా అందులోనే పనిచేస్తారు. ఐతే ఈసారి మాత్రం గొప్ప ప్రశాంతత ఉంటుంది. కొంతమంది మాత్రం ఆ అనుభవం గురించి మాట్లాడతారు. అంతకుముందు జరుగుతున్నదే ఆ తర్వాత కూడా తప్పకుండా కొనసాగుతుంది. మాట్లాడే వాళ్ళు మాత్రం ఆ కార్యక్రమాన్ని ముందుకు సాగిస్తారు. ఉదా:- అంతకుముందు ఒక సంగీతకారుడవనుకో! నీ జ్ఞానోదయం గురించి మిగతా వాళ్ళకు చెప్పడానికి నువ్వు ఆ సంగీతాన్ని వాడుకుంటావు.
రెడ్డి సామా : అంటే అదే ఆటిట్యూడ్ తో నేను ఇంజనీర్ గా కొనసాగవచ్చునన్నమాట.
ఉమి : - తప్పకుండా ఇక్కడ విషయమేమిటంటే! ఇంజనీర్ ను అన్న గుర్తింపు పోతుంది. మాయమయిపోతుంది. సూఫీ సెయింట్ లు మధ్య యుగం కాలంలో యూరప్ వెళ్ళారు. వాళ్ళంతా ఇంజనీర్లు. వాళ్ళకు భవన నిర్మాణం గురించి గొప్ప అవగాహన ఉంది. వాళ్ళు అక్కడ స్థానికులు, సంస్థలతో కలిసి అద్భుతమైన కేతడ్రల్స్ కట్టించారు. ఇదంతా చేసిందెవరు? సూఫీ ఇంజనీర్లు.అయితే వాళ్ళు తమ పేర్లను ఆ నిర్మాణాల మీద వదల్లేదు. వీటిని కట్టిన ఇంజనీర్లు ఎవరు అంటే మనకు తెలియదు. అయితే ఆశ్చర్యకరమైన నిర్మాణాలు అక్కడ ఉన్నాయి. అయితే అవేమిటి? అప్పటి యూరోపియన్లకు తెలిసిన భవన నిర్మాణ కళకు పూర్తి విభిన్నంగా ఉన్నాయవి.
ఒక చిన్న కథ:
ఒక దొంగ ఉన్నాడు. అతనికి జ్ఞానోదయం కావాలనిపించింది. అతను ఒక క్రిస్టియన్ మొనాస్ట్రీ కి వెళ్ళాడు. నేనీ మొనాస్టీ లో చేరతాను. నేను సన్యాసినవుతాను. కానీ నేను ఇప్పటివరకు దొంగను అన్నాడు.
మొనాస్ట్రీ లో ఉన్న బిషప్ గారన్నారు “ ఇక్కడ చేరాలంటె నీవు నీ దొంగతనాల్ని వదిలిపెట్టవలసి ఉంటుంది”. దొంగ అది కుదరదన్నాడు. అప్పుడు నువ్వు చేరడానికి వీల్లేదన్నారు బిషప్. అప్పుడితను ముస్లిం సంస్థకు వెళ్ళాడు. వాళ్ళూ అదే చెప్పారు. అతను ఒక మతం తర్వాత ఒక మతం చుట్టూ తిరుగుతూ ఉన్నాడు. అందరూ నీవు దొంగతనం వృత్తిని వదిలేయాలి అని చెప్పారు. చివరికి అతను ఒక జెన్ మాస్టర్ దగ్గరికి వచ్చాడు.
దొంగ ఇలా చెప్తున్నాడు“ అయ్యా! నేను దొంగను. కానీ నేను మీరు ఏం చేస్తున్నారో అది చేయాలనుకుంటున్నాను. ” నేను సంఘంలో చేరాలనుకుంటున్నాను. కానీ నేను దొంగను.మాస్టారన్నాడు నాకు దొంగతనం గురించి ఒక ముక్క కూడా ఏమీ తెలియదు అని చెప్పి నువ్వు ఇక్కడ చేరాలనుకుంటే సుస్వాగతం. నీకు నేను ఇవ్వగలిగిన ఒకేఒక విషయం ఏమిటంటే “జాగరూకత”.
ఉండు, మాతో కలిసి ఉండిక్కడ. నువ్వు చేసే పనులన్నీ ఆ జాగరూకతతో చేస్తుండు. అంటే ఇతనన్నాడు. “ నేను దొంగతనాలు చేస్తాను”
జెన్ మాస్టర్ అన్నారు “జాగరూకతతో దొంగతనం చెయ్యి.” నీవు చేసే పనిలోకి జాగరూకతని కలుపు. నీవు జాగరూకతతో నీ పని చేయడమెట్లాగో నేను చెప్తాను అన్నారు.
రెండు వారాల తర్వాత :
దొంగ మాస్టర్ గారి దగ్గరకు వెళ్ళాడు. అయ్యా! దొంగతనం నేను ఏ మాత్రం చెయ్యలేకపోతున్నాను. ఈ జాగరూకత అన్నది ఉన్నదే అది నా దారిలో వస్తున్నది. గురువుగారన్నారు. నీ దొంగతనం గురించి నాకు ఒక ముక్క తెలీదు. నాకు తెలిసిందల్లా ప్రతీ పనిని జాగరూకతతో తెలిసి చెయ్యడం ఒక్కటే.
రెడ్డి సామా : చూశారా! మీరు నన్ను అవేర్ నెస్ కల్గిన ఇంజనీరుగా ఉండమని చెపుతున్నారు. అంతే!
ఉమి : - మీకు కనక ఇంజనీరైతే అది తెలిసి చెయ్యండి. అది మీ ఇంజనీరింగ్ ని సర్వ నాశనం చెయ్యచ్చు. లేదా దానిని మార్చవచ్చు. ఎవరికి తెలుసు? నేను ఇంజనీర్ ని కాదు కదా! అందులో ఏం జరుగుతుందో నాకు తెలీదు! ఆ లెక్కలవీ నేను నేర్చుకోలేదు. అయినాసరే బాధ లేదు. కానీ, ఏ క్షణానైనా నీ జీవితం అంతం కావచ్చు. అది 70 ఏళ్ళు, 80 ఏళ్ళు, 90 ఏళ్ళే కానవసరం లేదు. ఇవాళే అంతం కావచ్చు. నీ జీవితం అంతటితో ముగుస్తుంది. మనమందరం మృత్యువుతో ఇప్పుడు కూడా కలిసి జీవిస్తున్నాము. నీ జీవితంలో ముఖ్యమైన విషయాలు అనుకుంటున్నవన్నీ నీవు మరణించగానే ఏమయిపోతాయి? ఇదంతా ఏమిటి అని అడుగుతావేమో! అవును! నేను నా జీవితంలో శక్తినంతా ధారపోసి ఇది చేయాలనీ, అది చేయాలనీ ఎన్నో కష్టాలు పడ్డా. చూడు ఇప్పుడేమో నేనిక వెళ్ళిపోతున్నాను. శరీరం వెళ్ళిపోతోంది. ఇందులో మరిక ఏం మిగిలింది? ఇందులో ఒక గమ్యం,ఉద్దేశ్యం లేకపోతే ఈ జీవితానికి అర్ధం లేదు. ఒక్కొక్క క్షణము పూర్తిగా దానికదిగా బతకడమంటె అర్ధం లేదు. అంటాను.
రెడ్డి సామా : కుటుంబంలోని సభ్యుల బాధ్యత గురించి ఆలోచించడమూ, సంఘంలోని మనుషుల గురించి ఆలోచించడము అర్ధం లేని పనులు అంటున్నారు.అంటే మెదడు దృష్టితో నన్నమాట.
ఉమి : - నీ మనుగడలో అది భాగం అని నీవు నమ్మినంతకాలం అది అవసరం.చూడు నువ్వొక చిన్న పిల్లవాడిగా ఉన్నప్పుడు మనుగడ, బతకడం అంటే ఏమిటోనీకు తెలీదు. కానీ త్వరలోనే ఆ మనుగడకు కావలసినవన్నీ సిద్ధం చేసుకోవడం నేర్చుకుంటావు.
సూఫీలు తొమ్మిది మార్గాలుంటాయి అంటారు. పెద్దవాళ్ళని అనుకరించి నేర్చుకుంటావో, పెద్దవాళ్ళను వ్యతిరేకిస్తావో, పెద్దవాళ్ళను అనుసరిస్తావో... అదిచేస్తావో.. ఇది చేస్తావో వగైరా.. వగైరా..
ఈ రకంగా నీవు ఒక పద్ధతిని తయారు చేసుకుంటావు. ఇలా జరుగుతున్నప్పుడు నీ మనుగడకు నీకుటుంబం చాలా అవసరం అన్న గట్టినమ్మకం ఏర్పడుతుంది. కనుక అది చాలా ముఖ్యమైనదిగా మారుతుంది.
అయితే మార్మికవాదులు మాత్రం ఏమన్నారు? రామ్కృష్ణ కుటుంబాన్ని వదిలేసెయ్ అన్నారు. ఏసుక్రీస్తు కూడా కుటుంబాన్ని వదిలేసెయ్ అన్నారు. కుటుంబం ఏం చేస్తుంది? నీ నమ్మకాలలోని పద్ధతులను మళ్ళీ మళ్ళీ అది గట్టిపరుస్తూ ఉంటుంది. ముందుకు సాగుతుంది. ఆ తరువాత నీవు ఎవరు అన్న నమ్మకాన్ని అది నీకు కలిగిస్తుంది. నీవిక అదే నీ గుర్తింపు అనుకుంటావు. ఇక జ్ఞానోదయం అన్నది నీ చుట్టు ఒక నిర్మాణం, నీకొక గుర్తింపు ఉన్నంతకాలం వీలుకాదు. నీ చుట్టూ ప్రజలు ఉండి ఆ నిర్మాణాన్ని ఎప్పటికప్పుడు గట్టి పరుస్తూ ఉంటే వాళ్ళు నీ జ్ఞానోదయాన్ని అడ్డుకుంటారు అని అర్ధం.
ఇతరులు అడిన ప్రశ్నలు:
డెల్ఫీ : - కనుకనే భారత దేశంలో ఆడవాళ్ళూ, మగవాళ్ళూ ఒక వయసు వచ్చిన తర్వాత ఇంటినుంచి వెళ్ళి గుహలలోకి పోయి తమ గుర్తింపు గురించి పట్టించుకోకుండా మరేదో వెతుకుతూంటారు.
ఉమి : - ఆ పని చేయడానికి ఒక వయసంటూ లేదు. కావాలంటే ఇప్పుడే చెయ్యొచ్చు.
డెల్ఫీ : - కానీ వాళ్ళు దీనికి కొన్ని స్థాయిలను ఏర్పాటు చేశారు. ముందు విద్యార్ధిగా ఉండాలి, తర్వాత గృహస్థు గా ఉండాలి అని ఈ రకంగా వాటిని ఆశ్రమ ధర్మాలుగా చేస్తూ వెళ్తున్నారు.
ఉమి : - ఇది సమాజాన్ని నిలబెట్టడానికి చేసిన ఒక విధానం. నీకు ఒక వయసు వచ్చిన తర్వాత, నీ అవసరం సమాజానికి ఉండదు. అప్పుడు నువ్వు వెళ్ళిపోవచ్చు. కానీ బుద్ధుడి సంగతి చూశావా! ఆయన ఒక వయసు వచ్చే దాకా ఆగలేదు. ఆయన తన కుటుంబాన్ని వదిలేసినప్పుడు చాలా చిన్న వయసువాడు.
రామకృష్ణుడు, రమణ మహర్షి కూడా ఒక వయసు వచ్చేదాకా ఆగలేదు.
రెడ్డి సామా : అంటే కుటుంబ సభ్యుల పట్లా, సమాజం ఫట్లా బాధ్యతాయుతమైన భావన అర్ధరహితమంటారా? అంటే మెదడు పరంగా.
ఉమి : - నీవు వారికి ఆ రకమైన భావన కల్పించాలంటే నీవు చేయవలసిందేమిటి అన్నది ప్రశ్న. నీలోపల ఆరకంగా ఏముంది అన్నది ప్రశ్న.? నీలోపల ఏముంది?
రెడ్డి సామా : మనం చేస్తున్న పనిని వదలవలసిన అవసరం లేదని ఇప్పుడిప్పుడేగా అనుకున్నాము. చేతనతో, జాగరూకతతో ఆ పనిని చేయవచ్చు అనుకున్నాము. కుటుంబంతో కూడా జాగరూకతతో కొనసాగవచ్చును కదా.
ఉమి : - నీవు కుటుంబంలో కొనసాగినంత కాలం వాళ్ళు నీకు గుర్తింపు అనేదాన్ని అనునిత్యం గట్టిపరుస్తూ ఉంటారు. ఆపాదిస్తూ ఉంటారు. మెదడుకు ఇవి రెండూ చాలా అవసరం.
రెడ్డి సామా : అంటే మనం రెండు రకాలా చేయవచ్చా?
ఉమి : - లేదు.లేదు.. నువ్వున్నావు, దేవుడు లేడు. నీవు లేవు, దేవుడు ఉన్నాడు. నీవింతకూ చేయదలచుకున్నదేమిటంటే..టార్చిలైటు సాయంతో చీకటిని వెదకడానికి ప్రయత్నిస్తున్నావు. అదెలా కుదురుతుంది? నీవు లైటు వెలిగించగానే చీకటి లేకుండా పోతుంది. చీకటి వెలుగులు ఒకే చోట ఉండడం కుదరదు కదా!
రెడ్డి సామా : అదే నిజమైతే, మరి జ్ఞానోదయమైన మాస్టర్లు, వాళ్ళు ఈ బజారులో ఎలా బతకగలుగుతున్నారు? దేవుడితో ఎలా కొనసాగగల్గుతున్నారు.?
ఉమి : - జ్ఞానోదయంతో బాటు నీ ఉనికి అన్నది మాసిపోతుంది. ఇక నీవు లేవు. ఇక్కడ ఎవరూ మిగలరు. ఒక పని అంటూ మిగలదు. బంధనాలు ఉండవు. గుర్తింపు ఉండదు. అందుకే రమణ మహర్షి కూరలు తరగగలిగారు.
ఒక పాత సూఫీ కథ:
ఉమి : - ఒక సూఫీ గురువుగారు.. ఆయనేమో బిచ్చగాడు. చినిగిన దుస్తులు వేసుకుంటాడు. ఎవరైనా ఏమైనా ఇస్తారేమోనని ఎదురుచూస్తాడు. రాజు గారికి ఇతనంటే గొప్ప అభిమానం ఏర్పడింది. రాజు వెళ్ళి గురువుగారితో మాట్లాడుతున్నాడు. ఒకరోజు రాజు అడిగాడు కదా.. మీరు నాతో వచ్చి నా రాజభవనంలో ఉండవచ్చు కదా అని. మాస్టర్ గారు సరే అన్నారు. రాజు గారు గురువుగారిని రాజభవనానికి తీసుకెళ్ళారు. మంచి దుస్తులిచ్చారు. ఆ చిరుగు బట్టలు పోయి మంచి దుస్తులు వచ్చాయి. గురువుగారు రాజభవనంలో ఉంటూ వచ్చారు. రాజ సభకు కూడా వెళ్తారు. రాజును చూడడానికి వచ్చిన వాళ్ళందరూ ఈయన్ని కూడా చూస్తారు. ఒక్కొక్కసారి ఈ గురువుగారు రాజ సింహాసనం మీద కూర్చుంటాడు. రాజు గారు వేసుకున్నట్టే ఈయన కూడా దుస్త్రులు వేసుకోవడం మొదలు పెట్టాడు. అతను రాజు గారు తిరిగినట్టే తానూ చుట్టూ తిరగడం ;మొదలుపెట్టాడు. అన్ని రకాల రాజులాగే ప్రవర్తించడం మొదలుపెట్టాడు. ఒకరోజున రాజు ఈయన్ని చూసి అన్నాడు కదా! ఏమిటిక్కడ తేడా అని? మీరు జ్ఞానోదయం కలిగిన మహానుభావులు, గురువులు అనుకున్నాను నేను. మీరేమో ఇక్కడ నాలాగా దుస్తులు వేసుకున్నారు. అప్పుడప్పుడు నాలాగా సింహాసనం మీద కూర్చుంటున్నారు. నాలాగే మీరు ప్రజలతో మాట్లాడుతున్నారు. ఇప్పుడు మరి మీకూ నాకూ తేడా ఏమిటీ?
గురువుగారన్నారు. సరే.. చూపిస్తాను. మనిద్దరం కాసేపు అలా నడుద్దాం పదా అన్నారు. వాళ్ళు నెమ్మదిగా నడక ప్రారంభించారు. బయటకు వెళ్ళారు. రాజ్యంలో నడుస్తూ ఉన్నారు. అక్కడొక కాలువ వచ్చింది. దానిమీద ఒక వంతెన ఉంది. అప్పుడు గురువుగారు తాను వేసుకున్న దుస్తులు వదిలేసారు. లోపలేమో చిరిగిన పాత దుస్తులు ఉన్నాయి. అప్పుడు గురువుగారు రాజును తనతో రమ్మన్నారు. రాజన్నాడు..ఏమిటంటున్నారు మీరు? మీరుకూడా మీ దుస్తులు వదిలేయండి. మనమిద్దరం కలిసి ఈ వంతెన దాటుదాం. అవతలికి వెళదాం నాతో రండి అన్నారు.
రాజంటాడు.. చూసుకోవడానికి నా దేశమంతా ఉందక్కడ. ఈ ప్రజలంతా ఉన్నారు. నాకెన్నో బాధ్యతలున్నాయి. నేను చేయాల్సిన పనులు చాలా ఉన్నాయి అని. గురువుగారు అప్పుడు చెప్పారు..“ అదే మరి తేడా అంటే ” బంధనాలు లేవు. జరిగే పనులతో సంబంధం లేదు.
రెడ్డి సామా : చూస్తే, ఇది చాలా సులభంగా కనిపిస్తున్నది. కానీ చాలా కష్టం గా కూడా ఉంది.
ఉమి : - ఏమీ లేదు.. ఇదంతా చాలా తేలిక. కానీ సులభం మాత్రం కాదు.
గమ్యాలు, డెడ్ లైన్స్, గురించి కొంత మంది సాధకుల ప్రశ్నోత్తరాల అనంతరం..
రెడ్డి సామా : నేను ఈ మెదడుతో ఇన్ని రకాల ఆటలు ఆడడం అన్నది చూస్తూంటే మీకు నవ్వు వస్తోందని అర్ధమవుతోంది. అంతేనంటారా?
ఉమి : - నేను కాదు మీరు నవ్వుతున్నారు.
రెడ్డి సామా : మళ్ళీ మళ్ళీ ఇవే అర్ధం లేని ఆటలు.. వాటి నుంచి నేర్చుకున్నదేమీ లేదు.
ఉమి : - నాకు అందులో బాధలు కనిపిస్తున్నాయి. బాధలు కనిపించినప్పుడు గురువు చేయగలిగిందల్లా ఒక మాట చెపుతాను. అదిగో విందు. నీకు ఆకలిగా ఉంది. వెళ్ళి తిందాం పద! చాలామంది ఏమంటారు..లేదు..లేదు..నా రాలేను. నాకిప్పుడు టైం లెదు. నేను తర్వాత వస్తాను. ఇప్పుడు కాదు అంటారు. విందేమో ఇప్పుడు. గురువు యొక్క సహభావన, ప్రేమ అన్నది ఇలా ఉంటుంది. ఆయన దేన్నయినా చేయకుండా ఉండగలరు. అతను వేచి ఉండగలడు. నీకేదైనా ఇవ్వగలడు. చాలా తక్కువ మందికి మాత్రమే ఇది అర్ధమవుతుంది. ఈ బాధలన్నీ అనవసరం. గుర్తుంచుకో! అవసరం అన్నది ఒక్క వస్తువు కూడా లేదు. ప్రశాంతంగా బ్రతకడం అన్నది నీ జన్మ హక్కు.
నార్టన్ ఒక మిత్రుడు.. అతను బాగా చదువుకున్నవాడు. పధకాలు వేయడం గురించి అతను బాగా నేర్చుకున్నాడు. పధకాలు వేయకుంటే ఏం జరుగుతుందీ అన్న భయాన్ని కూడా ఆయనకి బాగా నేర్పించారు. ఇక మెదడు తన పాత్రను నిర్వహిస్తూ అన్ని విషయాలను ఇలా జరుగుతాయి అని ముందు చూపిస్తుంది. మెదడుకు ఉండే ఆనందాలలో ఒకటి.. ఇదిగో ఇలా జరుగుతుందని ముందు చెప్పడం. ఈ గొప్ప ఆనందం గురించి ప్రణాళికలు వేయడంలో గొప్ప ఆనందాన్ని పొందేవాడతను. కానీ అనుకున్నది జరగకపోతే ఓహో అదెట్లా అది మెదడు థియరీ! అతడు ప్రణాళిక అనే ఒక మత్తు మందును తీసుకున్నాడు. దానితో కుప్పకూలాడు. మెదడు అంటే అది. అలా జరుగుతుంది. ఇదే కథ మళ్ళీ మళ్ళీ ప్రతినిత్యం జరుగుతుంది. కొన్ని సార్లు చిన్నవిగా! మరికొన్ని సార్లు ఎక్కువకాలం పాటు సాగుతుంది. కొన్నిసార్లు అది జీవితకాలమంతా కొనసాగి అంతులేని ఎత్తులకు సాగి అంతులేని అగాధంలోకి పడిపోతుంది. మెదడు అంటే అది.
రెడ్డి సామా : నేను ఒకరకమైన ఆధ్యాత్మిక ప్రయాణంలో ఉన్నాను. చదువుతాను, ధ్యానం చేస్తాను. 30 సంవత్సరాలుగా ఇలాగే కొనసాగుతోంది. నేను ఈ ప్రయాణంలోనే కొనసాగి ఇంకా పైకి, ఇంకా పైకి, ఆ పైకి ఎక్కి ఈ అధ్యాత్మిక ప్రయాణం అని నేను నిర్మించుకుంటున్న దాంట్లోంచి ఒక్కసారిగా పడిపోతానా?
ఉమి : - మీరు ఆధ్యాత్మిక ప్రయాణం అన్నదాంట్లో ఉంటే అక్కడ నుంచి పడిపోవడమన్నది. లేదు. కానీ మెదడు యొక్క ప్రయాణంలో ఆ ప్రమాదం ఉంది. ఔను.
రెడ్డి సామా : నేను చేస్తున్నది అసలు ప్రయాణమా? మనసులోని ఆలోచనా? నాకు తెలియదు.
ఉమి : - చదవడం అన్నది మెదడుకు సంబంధించిన ఆధ్యాత్మిక ప్రయాణం. మీరు ఒక గురువుతో ఉన్నప్పుడు ఏం జరుగుతుందో తెలియదు. ముంచు చెప్పలేం. కొన్ని విషయాలు జరుగుతాయి. నీ నమ్మకాలను అవి మరింత గట్టిపరుస్తాయి. చదువుతూ ఉంటే మాత్రం అది నీ చేతుల్లో ఉంది. దీన్ని తీసుకుంటావో, మరోటి తీసుకుంటావో కదా! చూడండీ.! ఇదా బాగుంది! అదా బాగుంది! ఏం జరుగుతోందక్కడ. ఆధ్యాత్మిక ప్రయాణాన్ని మీ ఇష్ట ప్రకారం మీరు తయారుచేస్తున్నారు. అది కేవలం ఒక భ్రమ. సత్యం కాదు. ఔను! అది తప్పకుండా కుప్పకూలుతుంది.చాలా వయసు పెరిగిన వాళ్ళు కూడా ఈ అనుభవాన్ని కొనసాగించి, చివరకు ఆ భ్రమలన్నీ పోయి ఒక నిరాశకు గురయ్యారు.
రెడ్డి సామా : 30 సంవత్సరాల ఆధ్యాత్మిక ప్రయాణంలో ఒక సత్సంగంలో జ్ఞానోదయం కలిగిన గురువుగారి ముందర కూర్చునుండడం ఇది నాకు మొదటిసారి. ఇది దుఃఖకరమైన విషయం.
ఉమి : - లేదు! అది జరిగిందంతే! అందులో దుఃఖమేమీలేదు. అది అలాగే జరుగుతుంది. ఇప్పుడు మీరు 30 సంవత్సరాలుగా చదివి స్టడీ చేసిన విషయాలన్నింటిని వదులుకోవచ్చు. అదంతా కలిసి మిమ్మల్ని ఇక్కడిదాకా తీసుకువచ్చింది. ఈ క్షణం దాకా తీసుకువచ్చింది.
రెడ్డి సామా : అదంతా తయారీ కింద లెక్క అన్నమాట!
ఉమి : - ఔను! ఇప్పుడు మీరు దాన్నంతా పడేసేయవచ్చు. అది ఎట్లాగంటే, నది దాటడానికి ఒక బోటును తీసుకుని వెళ్తాం. కానీ దాటిన తర్వాత ఒడ్డున బోటును వదిలేస్తాం. దాన్ని మోసుకుని మనతో తీసుకునిపోము. బోటు నది దాటడానికి మాత్రమే అవసరమౌతుంది. దాటిన తర్వాత చాలు. ఇంక దాని అవసరం లేదు. దానితో పని అయిపోయింది. థాంక్యూ బోట్.. ఇంక మనం ముందుకు పోతాం. కానీ చాలా మంది ఆ బోటును తమతో ముందుకు మోసుకుని పోతారు. ఇక్కడ సమస్య ఏమిటంటే 30 సంవత్సరాల పాటుగా మీకొక స్వార్ధపూరితమైన ఇంట్రెస్ట్ ఉంది. మెదడు ఏమంటుంది? ఇలాగే, ఈ స్వార్ధపూరిత ఉద్దేశ్యంతో ముందుకు సాగకపోతే చేసిందంతా వ్యర్ధ మవుతుంది. అది స్వార్ధపూరితమైన ఆసక్తి. ఆధ్యాత్మిక కార్యక్రమంలో ఇలాంటివి ఉండవు. ఈ స్వార్ధపూరితమైన ఆసక్తి అంతా పోవాలి. పూవు..గులాబీ గురించి ఆలోచన వదులుకోకుండా మీరు గులాబీ పరిమళంగా మారలేరు. దూరంగా పోవాలి.
రెడ్డి సామా : అంటే మీరు నమ్మకాలన్నింటిని వదులుకోమంటున్నారు. అభిప్రాయాలను, పథకాలను, సిద్ధాంతాలను, చదువుకున్న ఈమెయిల్స్ ని అన్నింటినీ వదులుకోమంటున్నారు. కనీసం నాకలాగే అర్ధమవుతున్నది. కానీ నేను ఉన్న నా పరిస్థితికి నాకు ఆ భావాలు, ఆ సిద్ధాంతాలు ముందు అర్ధమైతే తప్ప కుదరదు. అవి అర్ధమైన తర్వాత నేను దాన్ని వదులుకోగలుగుతానేమో! జరగవలసింది మరి ఈ పద్ధతేనా!
ఉమి : - సంఘంలో ఉన్నప్పుడు మాత్రం అది పద్ధతి కాదు. ఇక్కడ ఈమెయిల్స్ తో జరిగేది ఏమీ...లేదు.!
రెడ్డి సామా : కానీ, మీరు చాలా ఈమెయిల్స్ ద్వారా చాలా పనిచేస్తున్నారు.
ఉమి : - చాలామంది ప్రశ్నలడుగుతారు. కానీ అసలైన మార్పు జరగాలంటే ఈమెయిల్స్ ద్వారా జరగదు. అది లోపల పరివర్తన ద్వారా జరగవలసి ఉంటుంది.
రెడ్డి సామా : అంటే అర్ధమవడం, అవగాహన అన్నది నాలో అంతర్గత మార్పును తీసుకువస్తుందా?
ఉమి : - అవగాహన కలగడం ఎట్లాంటిదంటే.. “నీవు ఒక స్థాయికి వచ్చిన తర్వాత నాకేమీ అర్ధం కావడం లేదని అంటావు” అర్ధం కావడమన్నది అట్లాంటిది.
అందరూ గట్టిగా నవ్వుతారు. ఆ మాట విని.
రెడ్డి సామా : అంటే నాకు అర్ధం కావడం లేదు. కానీ అనుభవంలోకి వస్తున్నది.
ఉమి : - నీకు అనుభవంలోకి వచ్చిందని కూడా నీవు చెప్పలేవు.
రెడ్డి సామా : అంతే!
ఉమి : - ఆ అనుభవం గురించి చెప్పడం అనే దానినుంచి నిన్ను నువ్వు ఆపుకోలేకపోతున్నావు.
బుద్ధుడు మహాకాశ్యప లా (అది చివరి పరిణామం) మారేటప్పటికి ఎలా జరిగింది.? అది మౌనంలోంచి జరిగింది. ఆయన దాన్ని మౌనంతో సాధించారు. ఆయననెవరో అడిగారు. బుద్ధుడు మీకేమిచ్చారు అని. ఆయనన్నాడు వెళ్ళి గురువుగారినడగాలి అని. బుద్ధుడి దగ్గరకు వెళ్ళి అడిగారు. మహాకాశ్యపుడికి మీరు ఏమిచ్చారు అని. ఆయనన్నారు... మాటలతో నేను ఇవ్వగలిగినదంతా ఇచ్చేసాను. అతనికి మాటలతో ఇవ్వజాలనిది కూడా నేను ఇచ్చాను.
అర్ధం చేసుకోవలసింది కాదు ఇక్కడ విషయం. సిద్ధాంతాలను ఒక చోటికి చేర్చి పెట్టుకోవడం కాదు విషయం ఇక్కడ. “అందుబాటులో ఉండడం ఎలా? అందరికీ కనబడేలా ఉండడం ఎలా?” అప్పుడు అంతరంగ పరివర్తన కుదురుతుంది.
రెడ్డి సామా : ఒక సంఘటన జరిగింది. అది ఎలాగా జరిగిందో నాకు తెలీదు. అది మొత్తం మాస్టర్ ప్లాన్ లో ఒక భాగం అయ్యి ఉండచ్చో లేదో నాకు తెలీదు. నేను ఇంటర్నెట్ లో బ్రౌజింగ్ చేస్తుంటాను. రకరకాల పుస్తకాలు చదువుతున్నాను. ఈమధ్యనే ‘ధమ్మపద’ అనే ఒక పుస్తకం చదివాను. ఆ పుస్తకం కవర్ పేజీ మీద కొన్ని మాటలు చదివాను. వాటిలో ఒకవాక్యం చదివాను. అది నన్ను ముఖంమీద గుద్దినట్లు అనిపించింది. అది ఏమిటంటే జీవితాన్ని ఆర్గ్యుమెంట్ ధోరణిలో కాక అంగీకరించే దృష్టితో చూడు. చర్చా దృష్టితో కాక, అంగీకరించే దృష్టితో చూడు. అది చదవగానే అనిపించింది. ఓరి దేవుడా! 60 సంవత్సరాల పాటు ఈ జీవితాన్ని కేవలం వాదించడం, ప్రశ్నించడం, జవాబులు పొందడం మళ్ళీ వాదించడం ఈ పద్ధతిలోనే బ్రతికానని అనిపిస్తోంది .
ఉమి : - అది నిన్ను ఎక్కడికీ తీసుకుపోజాలదు. ఔను, వాదన అంటే నీకు ఒక సిద్ధాంతం ఉండాలి. దాన్ని నీవు ఎదుటివాళ్ళ మీద రుద్దాలని చూస్తావు. వాళ్ళు దాన్ని చూడాలి అనుకుంటావు.అంటే వాదం మొదలయ్యేటప్పటికే నీలోపల ఒక సిద్ధాంతము, ఒక వాదము ఉందని అర్ధం.కానీ ఇక్కడేమో ఈ సిద్దాంతాలను, వాదాలను వదులుకోవడం. ఇప్పుడు నీవు విషయాలను స్వీకరించే స్థాయిలో ఉన్నావు. ఈ మనిషి ఇది చెప్తున్నాడు. ఆ మనిషి అది చెప్తున్నాడు. ఇక్కడేమో వ్యతిరేకంగా ఉంది. ఒకడు ఒప్పుకుంటున్నాడు. ఇంకొకడు ఒప్పుకోవడం లేదు. ఇదంతా ఒక రకంగా జరుగుతూ పోతుంది. గాలి కొన్ని సార్లు వీస్తుంది. కొన్ని సార్లు ఎండకాస్తుంది. కొన్నిసార్లు మేఘాలు కమ్ముకుంటాయి. కొన్నిసార్లు వర్షం కురుస్తుంది. అంతటా ఒకే రకంగా ఉండదు. ఇక్కడ నువ్వు ఎంత తక్కువ చేస్తే అంత ఎక్కువ జరుగుతుంది. ఎక్కువ ఫలితం ఉంటుంది.
నీకు తెలిసిన విషయాన్ని మాత్రమే నీవు అనువర్తిస్తే నీవు ముందు ఊహించిందేదో జరుగుతుంది. కానీ అది చాలా తక్కువగా ఉంటుంది.
కనుక నీవు చేయవలసిందేమిటంటే నీ భావలలోంచి వరుసబెట్టి కొత్త ఆలోచనలను బయటకి తీయండి.ఇదేమిటి ఒక చక్రంలాగా మళ్ళీ మళ్ళీ అదే జరుగుతుంది. ఇది జీవన్మరణాల చక్రం లాంటిది.తిరుగుతూ ఉంటుంది. నీకు ఏ ఆలోచనా లేదంటే అప్పుడు నువ్వు విచ్చుకున్నవాడవవుతావు. అప్పుడు నీవు విషయాలను అంగీకరించగలుగుతావు. స్వీకరించగలుగుతావు.
రెడ్డి సామా : నేను చాలా ప్రశ్నలడుగుతున్నానని నాకు తెలుసు. ఇది తెలుసుకోవాలన్న కుతూహలమా? లేదా నా తెలివిని ప్రదర్శించుకోవాలనే ఇగోనా? ఇదంతా కలగలసి పోయి ఏదో భావాల తుఫాను చెలరేగుతున్నది. కానీ సత్సంగంలో అందరికంటే నేనే ఎక్కువ సమయం తీసుకుంటున్నానని అనుకుంటున్నాను. బహుశా ఇది నా డాంబిక ప్రవర్తన, నాటకం అని నాకనిపిస్తున్నది. ఏం జరుగుతోందో నాకర్ధం కావడం లేదు.
ఉమి : - బావుంది. ఇది సమస్య కాదు.
రెడ్డి సామా : ఇతరులకు అది సమస్యగా కనిపించకపోతే ఏ సమస్యా లేదు.
ఉమి : - వాళ్ళకు సమస్యగా ఉందని మీరు ఆలోచన సృష్టించుకుంటున్నారా?
రెడ్డి సామా : ఎవరూ ఏమీ అనట్లేదు. అంటే సమస్యలేదని అనుకుంటున్నాను.
ఉమి : - సమస్య లేని పరిస్థితి కావాలని మీరు అవసరమనుకుంటున్నారా?
రెడ్డి సామా : ఆహా! ఈ ప్రశ్న బావుంది. అంటే! నేను కేవలం సమస్యలతోనే బతుకుతున్నానన్నమాట.
ఉమి : - ఇంజనీరింగ్ అంటే అంతేకదా మరి.
రెడ్డి సామా : సరిగా చెప్పారు.! ఇంజనీరింగ్ అంటే సమస్యలను పరిష్కరించడమే. ఓరి దేవుడా!
ఉమి : - అతనికి కావలసినన్ని సమస్యలని తీసుకొచ్చి ఇవ్వండి. మనమేమో ఇక్కడ సమస్యలనే స్థంభాలని తప్పించుకోవాలనుకుంటున్నాము.
రెడ్డి సామా : ఈ సమస్యకు జవాబు అందేటట్టు ఉంది. కానీ ఇంకొక సమస్య ఉంది. దానికి మాత్రం అసాధ్యమనిపిస్తున్నది.
ఉమి : - అన్ని సమస్యలకు సమాధానం దొరుకుతుంది. సమాధానం లేని సమస్య ఏదుంది చెప్పండి?
రెడ్డి సామా : జ్ఞానోదయం!! జ్ఞానోదయాన్ని పొందడం. అదీ నాకు మాత్రమే!
ఉమి : - అది అసలు సమస్యే కాదు! దాన్ని సమస్యగా మార్చడమన్నది అసలు సమస్య.
రెడ్డి సామా : సమస్యలుగా మార్చడం నాకు బాగావచ్చు.
ఉమి : - కానీ, సమస్య లేదు. అంగీకరించే పరిస్థితిలోకి ఉండు. చూడు “అవును” అనేది అహాన్ని తగ్గిస్తుంది. అహం అన్నది “లేదు” అనే దాని మీద ఆధారపడి పెరుగుతుంది. తాత్త్వికమైన చర్చల్లో అన్నీ లేదు అనే. అవన్నీ నర్మగర్భంగా జరుగుతాయి. ప్రతీదాన్ని కాదనడమే.
కానీ ఔను, ఔను అని విస్తృతమైన మనసుతో ఉంటే అక్కడ నీ ఇగో చనిపోతుంది.
-------
ఉమి : - మీ కళ్ళు మూసుకోండి. మీకొక చిన్న సంగీతం వినిపిస్తాను. ఆ సంగీతాన్ని మీ శరీరం లోని కణకణంలోనూ ప్రవహించనివ్వండి. ప్రతి క్షణం సంగీతం ఐపోయేదాక దాన్ని అలా ప్రవహించనివ్వండి. ఆ తర్వాత కొంత సేపు నిశ్శబ్దం ఉంటుంది. ఆ నిశ్శబ్దంలో మీ శ్వాసను అనుభవించండి. దాన్ని బాగా గమనించండి. అప్పటివరకు కళ్ళు మూసుకునే ఉండండి. చివరలో గంట మోగే దాకా అలాగే ఉండండి.
హాకిన్స్ ప్రకారం మనం గత జీవితాన్ని ఎక్కడైతే విడిచి పెట్టామో అదే స్థాయికి నిర్ధారింపబడిన ఎరుకతో జీవితంలోకి ప్రవేశిస్తం. చాలామంది తమ జీవితంలో కేవలం ఐదు పాయింట్లను మాత్రమే అధిగమించ గలుగుతరు. ఇదే గనుక నిజమైతే మనం జీవితంలో చాలావరకు ఒక నిర్దిష్ట స్థాయిలోనే అట్లనే ఉండిపోతం. నా జీవితంలో నాకు సన్నిహితంగా తెలిసిన వ్యక్తుల అనుభవాల ప్రకారం బహుశా ఇది ఒక ఖచ్చితత్వం కలిగిన ప్రకటన అయితది. స్వీయ చైతన్య లక్ష్యంగా లేని వాళ్ళలో అతి తక్కువ మంది వ్యక్తులు మాత్రమే చైతన్యానికి సంబంధించిన ఉన్నత స్థానాలకు వేగంగా పోగలిగిన్రు. ఈ కొలమానంలో మనం ముఖ్యంగా గమనించాల్సిన విషయాల్లో ఒకటి 200 మరియు రెండవది 500 యొక్క సరిహద్దులు స్థాయిలు. 200 కన్నా తక్కువ ఎరుక స్థాయి ప్రాతినిధ్యం వహించేది ‘‘ఒత్తిడి’’ ఈ రేంజిలో ఉండెటోల్లు ఖాలి బతకడం కోసమే బతకడమన్నట్టు బతుకుతుంటరు. ఎట్లోఅట్ల బతుకీడుస్తరు తప్ప జీవించాలన్న ఆకాంక్ష మనసులోతుల్ల ఉండదీల్లకు. కనీస నైతిక నిబద్ధత లేకుండ గడిపేస్తరట్ల. నిత్యం తమ సొంత సమస్యల్లో కొట్టుమిట్టాడుతూ బయటకు తామెట్ల కనిపిస్తన్నమో, ఎట్ల ప్రవర్తిస్తున్నమో అన్న సోయి కూడ లేకుండ ఉంటరు. వాల్ల అంతర్గత ఆలోచనలు భ్రమలు, భ్రాంతులతో నిండి ఉంటయి. వాల్లెప్పుడూ భావోద్వేగాలు, అవమానాలు, అపరాథభావన, స్వీయ సానుభూతి, ఉదాసీనత, విచారం, భయం, కోరికలు, కోపం మరియు గర్వంతో కూడిన ఆలోచనల మీదే దృష్టి పెడుతూంటరు. వాల్లు తమ చైతన్య స్థాయి నుండి బయటపడి వాల్ల ఉద్వేగాలకు అతీతమైన అవగాహనా స్థాయికి చేరుకోలేరు. 200 స్థాయి కన్నా తక్కువ చైతన్యం ఉండోటోల్లు జీవితంలో అన్నీ పొందుతరు తప్ప అదే స్థాయిలో తిరిగి ఇవ్వలేరు. వాల్లెప్పుడూ బాధిత మనస్తత్వంలోనే ఉంటరు. తమ బలహీనతల నుండి బయటకొచ్చి తమ జీవిత సమస్యలకు మూల కారణమేంటో తెలుసుకోలేరు. వీల్లు తమకూ అలాగే సమాజానికీ కూడా హానికరంగా ఉంటరు. ఐతే 200 స్థాయికి చైతన్యం పెరిగే కొద్దీ నిర్మాణాత్మక పద్ధతిలో శక్తిని ప్రదర్శించగల్గుతరు. సరిగ్గా 200 స్థాయి ఇటు విధ్వంసక ప్రవృత్తి నుంచి ఒక జీవితాన్ని తీర్చిదిద్దే సకారాత్మక నిర్మాణ శక్తిగా ఎదగనీకి మలుపైతది. బాధిత మనస్తత్వం తక్కువ స్థాయిల్లో కనిపిస్తూ 125, కోరిక స్థాయి దాటే కొద్దీ మరింతగా నిందించే స్థాయికి చేరుకుంటరు. ఈల్లు జీవితంలో ఎప్పుడూ తప్పులు తాము చేస్తరు బయటోల్లను నిందిస్తరు. తమ బాధ్యతలు గానీ పరిస్థితులు గానీ గుర్తించనే గుర్తించరు. వాల్లెప్పుడూ బాధితులుగా ఉండటం కోసం తమ శక్తిని ఒదిలేసుకుంటరు ఎందుకంటే సమస్యకు మూలకారణం ఆడే ఉంటది కాబట్టి. నిజమైన శక్తి మనిషిని తీర్చిదిద్దుతది. బాధిత మనస్తత్వం ఉన్నోల్లు బాధితులుగానే ఉండిపోతరు. ఆల్లెప్పుడు ఎదుటోల్ల సానుభూతి కోసం, బాధిత మనస్తత్వానికి ఎదుటోల్లు మద్దతు ఇవ్వాలని కోరుకుంటరు. ఉదాహరణకు మంచుపై నడుస్తూ కాలుజారిపడితే ఎవరిపై కోర్టు కేసు వెయ్యాలాని ఆలోచిస్తరు తప్ప తాము సరిగ్గా నడవలేనందుకు పడ్డమనుకోరు. ఆల్లు ఆ మంచు ఉన్నచోట ఇంటోల్లదే తప్పు అనుకుంటరు. ఆల్లు పడనీకి కారణం వేరేవాల్లనుకుంటరు తప్ప తాము కల్లు మూసుకుని నడిచామన్నది ఎప్పటికి గుర్తించరు. ఇంకొక ఉదాహరణ తీసుకుంటే వైఫల్యం చెందిన వైవాహిక జీవితాల్లో తప్పంతా నీదే అంటే నీదే అనుకుంటరు తప్ప తమ తప్పులకు బాధ్యతే వహించరు. వాల్లలో వాల్లు సమస్యలకు ఏవిధమైన పరిష్కారమూ పొందలేరు. వాల్ల సమస్యలు తీరకుండా అట్లే ఉంటయి. 200 దిగువన ఉండే అన్ని స్థాయిలు ఒక దానికి మరొకటి మద్దతిచ్చుకుంటయి. ఒకదానిపై మరొకటి ఆధారపడి ఉంటది. ఎవరైనా మానసికంగా దిగులైనప్పుడు కింది స్థాయిల కలయికగా ఉంటది. అదే 200 స్థాయి ఎక్కువ ఉంటే శక్తిని కలిగి ఉంటయి. 200 కన్నా ఎక్కువ ఉండే చైతన్య స్థాయిలు ప్రాతినిధ్యం వహించేది ‘శక్తి’ బాధ్యతల గురించి మాట్లాడే స్థాయిని దాటి దైర్యం వైపు చేరుకుంటరు ఈ స్థాయిలో ఉండెటోల్లు. సమస్యలను ఎదుర్కొని వాటిని తమకు తామే పరిష్కరించుకొనే స్వయం సాధికారిక స్థితికి చేరుకుంటరు. ఈ స్థాయిని దాటేకొద్దీ అవకాశాలను గురిస్తూ తమ లక్ష్యాలను నెరువేర్చుకోనికి ఇతరుల సహకారం పొందుతరు. ఇటువంటి స్థాయిలు బాహ్య ప్రపంచ అవగాహనను పెంచి ఆల్లను ఎంతో శక్తివంతులను చేస్తవి. ఇందుకు ఒక ఉదాహరణ చెప్పాలంటే మహాత్మాగాంధీ తన ప్రేమ, అహింసల అపార శక్తి ద్వారా బ్రిటీషోల్లను ఓడగొట్టిండు తప్ప బలవంతం చేసికాదు. ఈ ప్రక్రియ ద్వారా ఆయన దేశానికి స్వాతంత్య్రం తెచ్చిండు. శక్తి మరియు ఒత్తిడిల మధ్య సాధారణ వ్యత్యాసం ఒత్తిడి ఉపయోగిస్తే అందుకు తగ్గట్టు వ్యతిరేక దిశ నుండి మల్ల ఒత్తిడి ఎదురైతది కాబట్టి దీని ప్రభావం పరిమితంగ ఉంటది. ఎందుకంటె అటు ఇటు కదలనీకి దీనికి చలనం అవసరం. అదే సమయంలో శక్తి స్థిరంగా ఉంటూ తనంతట తాను దేన్నైనా ఎదుర్కోగల్గుతది. ఒత్తిడి ఫలితాలివ్వాలంటె దానిచేత మనం పనిచేయించాలె. అదే శక్తైతె గురుత్వాకర్షణ శక్తి లెక్క స్థిరంగ ఉంటూ తనంతట తాను ఎదుటివాటిపై ప్రభావం చూపుతది. శక్తికి ఓ అర్ధం ఉంటది. ఓ సిద్ధాంతముంటది. ఇది జీవితానికి సానుకూలంగా ఉపయోగపడే విధంగా తనను తాను మార్చుకుంటది. శక్తి అనేది స్వాభావికంగా ఎంతో గొప్పగుంటది. సహకార స్వభావం కలిగి ఉంటది. ఇది జీవితాన్ని పరిపూర్ణం చేస్తూ వ్యక్తి యొక్క గౌరవాన్ని పెంచుతది. ఒత్తిడి ఎప్పుడూ అపరిపూర్ణంగా ఉంటూ అస్థిరత కలిగుంటది. కాబట్టి దానికి బయటనుంచి శక్తి అందిస్తె తప్ప తనంతటా తానుగా పనిచేయదు. శక్తి తనంతట తాను స్వయం సిద్ధంగా ప్రకాశిస్తూ బయటనుండి వేరే శక్తి అందించాల్సిన పనిలేకుండా సంపూర్ణంగా ఉంటది. శక్తి కరుణపూరిత స్వభావం కలిగి ఉండి మనపట్లా, ప్రపంచం పట్లా సానుకూల వైఖరి అందిస్తూ ఉంటది. ఇది జీవితానికి శక్తి ఇస్తూంది. ఒత్తిడి జీవితాన్నుంచి శక్తిని లాక్కుంటది. ఒత్తిడి అన్నది వెంట వెంటనే తీర్పులిచ్చె మనస్తత్వం కలిగి ఉండడమె కాక ఇది మనపట్ల ప్రపంచంపట్ల వ్యతిరేక వైఖరి కలిగి ఉంటది. ఒత్తిడి ఉపయోగించడం మనుషుల్ని విడదీస్తూ గెలుపోటములకు కారణం ఐతది కాబట్టి ఇది శతృవులను సృష్టిస్తది. ఆల్ల నుండి తప్పించుకోనికి ఎల్లప్పుడు మనల్ని మనం రక్షించుకుంటూ ఉండాల్సిన అవసరముంటది. స్థిరత్వం లేని లక్ష్యాల వెంట పరిగెత్తనీకి ఒత్తిడి ఉపయోగించబడ్తది కాబట్టి విజయం సాధించినప్పటికి ఏదో తెలీని వెలితి కనిపిస్త ఉంటది. శక్తి అనేది జీవితం యొక్క సూత్రాలకు అనుగుణంగా పనిచేస్తూ జీవితంలోని అన్ని పార్శ్వాల్లోనూ మద్దతుగా నిలుస్తది. కాబట్టి ఇది లోతైన అంతరార్ధాలు కలిగి ఉంటూ మనిషులకి అంతులేని నిరంతర ప్రేరణ అందిస్తూ ఉంటది. శక్తి అనేది మనిషిలోని సామర్ధ్యాలను నింపితే ఒత్తిడి అనేది బలహీనుణ్ణి చేస్తుంది అనే విషయాన్ని గుర్తుపెట్టుకోవలసి ఉంటది. ప్రేమ, కరుణ, కృతజ్ఞతాభావం మరియు శాంతి వంటి లక్షణాలు పైకి లొంగుబాటుగా లేదా బలహీనతగా కనిపించినప్పటికీ ఇవి అసాధారణ శక్తి వంతునిగా మనిషిని తీర్చిదిద్దుతయి. ద్వేషం, పగ, తొందరపాటు తీర్పు, ఖండిరచి మాట్లాడడం లాంటివి తప్పనిసరిగా మనిషిని బలహీనుడి లెక్క మార్చేస్తయి. బలహీనులు చిట్టచివరకు తమ బలహీనతల ద్వారా పతనం చెందుతరు. శక్తి చివరివరకు బలీయంగా అట్లనే ఉంటది. సత్యవంతమైన సూత్రాలకు నిలబడిన చరిత్రలో గొప్పవారిగా పేరొందిన వాల్లంతా తమకు శక్తి బయటనుంచి అందిందని చెప్పుకొస్తరు. చరిత్రలో అత్యంత నీచమైన వ్యక్తులు వారియొక్క వ్యక్తిగత బలహీనతల కారణంగా ఊహించనలవి గాని బాధలు వడ్డరు. 500 మరియు అంతకు మించిన చైతన్యము యొక్క స్థాయిలు 500 స్థాయి చైతన్యము దాటితే ఆల్లు ఇతరుల బాగుకోసమే ఆలోచిస్తరు, పనిచేస్తరు. ఆల్లకు అహంకారం అనేటిది ఉండదు. లేదా అహంకార స్థితిని అధిగమించినోల్లయి ఉంటరు. ఒకవ్యక్తి ఈ స్థాయికి చేరుకున్నడంటె అంతకన్న చిన్న స్థాయికి ఎప్పుడు ఒప్పుకోడు. కాబట్టి ఆల్లెప్పుడు ఉన్నతమైన స్థానాల్లో ఉంటరు. ఈ స్థాయిలో చైతన్యంలో ఒక గొప్ప మార్పు మొదలైతది. ఈ స్థితిలో తమతో ప్రతి ఒక్కరిని సమిష్టిగా చూడడం మొదలుపెడ్తరు. ఆల్లకు జీవితమంటె సొంత కోర్కెలు సాధించుకోవడం కాదు. జీవిత పరమార్ధం ఇతరులకు సాయం చేయడం మానవాళి అభ్యున్నతికి పాటుపడ్డంగా భావిస్తరు. 540 ఎరుక స్థాయికి మించినోల్లు జ్ఞానోదయం గురించి పరితపిస్తూ ఆధ్యాత్మిక అన్వేషణ కొనసాగిస్తరు. అది సాధించే దిశగా వాల్లు చేసే కృషి సమస్త మానవాళి యొక్క చైతన్యాన్ని పెంచుతుంది. 400 స్థాయి (కారణం) మేథస్సు ఉపయోగిస్తూ వాస్తవాల అధారంగా తర్కంతో 500 మరియు అంతకంటే ఎక్కువ ఆధ్యాత్మిక స్థాయిని చేరుకోనీకి అడ్డుపడ్త ఉంటది. 540 కి మించిన స్థాయి ఆధ్యాత్మిక మార్గంలో ప్రయాణిస్తూ జ్ఞానోదయాన్ని పొందుతది. జ్ఞానోదయం పొందిన వ్యక్తికి మానవత్వానికి సంబంధించిన అపారమైన అవగాహన కలుగుతది. మేథావులు తమ హేతుబద్ధత, తర్కాల కారణంగా 500 స్థాయి మించి ఆధ్యాత్మిక స్థితికి ఎప్పటికీ చేరుకోలేరు. ఎరుక స్థాయి 540 మించినపుడు విశ్వాస ఆధారిత ఆధ్యాత్మిక సాధన అవసరం పడుతుంది. అందుకే జ్ఞానోదయాన్ని సర్వసాధారణంగా ఆధ్యాత్మిక జ్ఞానోదయంగా పిలుస్తరు. మేథావులు వైజ్ఞానిక దృష్టి నుండి బయటపడలేక 500 కంటే తక్కువ స్థాయిలోనే ఎల్లప్పుడూ ఉంటరు. చైతన్యం యొక్క స్థాయిలు -- కొలమానం మరో ముఖ్యమైన విషయం ఏమిటంటే ఇది 1 నుండి 1000 వరకు ఉండే పట్టికల ఆధారిత కొలమానం. అంటే 300 స్థాయి అంటే 150 స్థాయికి సరిగ్గా రెట్టింపు అనుకోకూడదు. పదోశక్తికి 300 గా ఉంటుంది. అందువల్ల కొన్ని పాయింట్లు పెరిగినప్పుడు శక్తిలో గణనీయమైన పెరుగుదల కనిపిస్తది. సగటు వ్యక్తి తన జీవితకాలంలో 5 పాయింట్లకు మాత్రమే ఎదుగుతారని కొన్ని సార్లు వెనక్కి తగ్గుతరని డా.హాకిన్స్ చెప్తడు. కొలమాని పైకి కదులుతున్నప్పుడు శక్తి యొక్క పెరుగుదల అసాధారణ రీతిలో ఉంటది. వివిధ స్థాయిల్లోని వ్యక్తులకు, వ్యక్తి స్థాయిలకు విలోమ సంబంధాన్ని గమనిస్తే ఆసక్తికరంగా ఉంటది. ఈ కొలమానం పైభాగంలో చాలా తక్కువమంది ఉన్నారు. ఈ కొలమానం క్రిందకి దిగే కొద్దీ జనాల సంఖ్య పెరుగుతూ ఉంటది. ప్రపంచ జనాభాలో అత్యధికులు దిగువ స్థాయిలో బతుకుతున్నరు. కొలమానం పైకి పోయే వరకు మనుషుల సంఖ్య తగ్గిపోతూ ఉంటది. ఈ విషయాన్ని గమనిస్తే ఎంతో ఆసక్తికరంగా ఉంటది. చైతన్య స్థాయిల యొక్క శక్తివంతమైన మరియు అయస్కాంత లక్షణాలు ఈ స్థాయిలో ఇనుము అయస్కాంతాన్ని చేరుకునే విధమైన ‘‘శక్తి క్షేత్రాలు’’ లేదా ‘‘ఆకర్షక క్షేత్రాలు’’గా భావించవచ్చు. మనం కొన్ని చైతన్య స్థాయిలకు చేరుకున్నప్పుడు లేదా ఆకర్షించబడినప్పుడు మనలోని శక్తి ఆ స్థాయికి అనుగుణంగా తమను తాను సవరించుకుంటది. ఈ స్థాయిలు దేనికవి స్వీయ శక్తిపూరితమై ఉంటాయి. మన ఆలోచనలో కొత్త తరహా మార్పు లేదా విధానాల్లో సవరింపులు చేసుకున్నప్పుడు వేరే చైతన్య స్థాయి శక్తి క్షేత్రాల వైపు ఆకర్షింపబడతాము. మన ఆలోచనా విధానంలోని మార్పు తక్కువ స్థాయిలో ఉన్నప్పుడు మరొక రకం చైతన్య స్థాయికి అనుగుణంగా నమ్మకాల వ్యవస్థను పెంపొందించుకుంటము. స్థాయిలు పెరిగేకొద్దీ అవి మరింత శక్తిని కలిగి ఉంటయి. ఒక ఉదాహరణకు అవమానం (20) మరియు అపరాధభావం(30)తో వ్యక్తులు తమను తాము ద్వేషించుకుంటూ ఉంటరు. వారు తమను తామే నాశనం చేసుకుంటారు. వాల్లు తదుపరి స్థాయి అయిన ఉదాసీనత(50)కు చేరుకున్నట్లయితే దాదాపుగా జీవితం పట్ల ప్రతిస్పందన లేనివారైనప్పటికీ స్వీయ విధ్వంసం వైపు పోరు. వాల్లు ఏడ్వడం మొదలువెడ్తె దుఃఖం (75) స్థాయికి చేరుకుంటరు. ఈ స్థితి ఉదాసీనతకు పై మెట్టుగా ఉంటది. అదేవిధంగా భయం(100) స్థాయికి చేరుకున్న వ్యక్తులు భయకంపితులై ఉంటరు. వారి భయం భవిష్యత్తును కాపాడుకునే ఆకాంక్షను వ్యక్తపరుస్తది. అదేవిధంగా కోరిక (125) స్థాయికి చేరుకున్నట్లయితే తమను తాము కాపాడుకునే విషయంలో రిస్కు తీసుకోడానికి ప్రయత్నిస్తరు. భయాన్ని కోరిక ద్వారా అధిగమిస్తరు. తమకు కావల్సింది పొందాలన్న తపన మొదలైతది. కాబట్టి ప్రతిస్థాయి వారు ఎటువైపు వెళ్తున్నారు అనే మార్గాన్ని బట్టి మెరుగ్గా లేదా అధ్వానంగా కనిపిస్తది. మీరు వివిధ స్థాయిల శక్తికి ఏవిధంగా ఆకర్షింపబడతారు లేదా ఆ స్థాయి యొక్క లక్షణాలతో ఏ విధంగా ఎలైన్ అయితరో తెలుసుకునేందుకు ఈ ఉదాహరణలను గమనించండి. మీరు ప్రతికూల మరియు బాధిత మనస్తత్వం వ్యక్తి సమక్షంలో ఉన్నప్పుడు మీరు పుకార్లు, తీర్పు, ద్వేషం, ధిక్కారం, విమర్శలు, కోపం మొదలైన వాటి వైపు ‘‘లాగబడవచ్చు’’ లేదా ‘‘ఆకర్షింపబడవచ్చు.’’ అదేవిధంగా ఉన్నత స్థాయిలో ఉండే వ్యక్తి సమక్షంలో మీరు ఉన్నప్పుడు కరుణ, ప్రోత్సాహం, ఉత్సాహం, విశ్వాసం, అంగీకారం, క్షమాపణ, ప్రేమ మొదలైన ఉన్నత శక్తులలోకి ఆకర్షితులౌతరు. మీరు బాగా గుర్తించుకోవాల్సిన విషయమేమంటె మీరు విభిన్న శక్తి క్షేత్రాల ద్వారా ప్రభావితమైతరు. మిమ్మల్ని చుట్టుముట్టేవి, మీరు ఆలోచించేవి, లేదా మీరు మనసు లోపలకి స్వీకరించి అనుమతించేవి మీ చైతన్య స్పృహపై ప్రభావం చూపుతయి. క్లుప్తంగా చెప్పాలంటే ‘‘ఒకే జాతికి చెందిన పక్షులు ఒకే గూటికి చేరతయి’’, ‘‘మీరెలాంటి వాల్లో మీ స్నేహితులను చూసి చెప్పచ్చన్నట్టు’’. అందువల్ల ప్రేమ, కరుణ, ప్రోత్సాహం, సహకారాలతో నిండిన ఉన్నతస్థాయి బృందాలతో ఉన్నప్పుడు అపారమైన శక్తి కలిగిఉంటరు. ‘‘AA’’ ఆధ్యాత్మిక బృందాలు ఉన్నతస్థాయి సమగ్రతతో కూడి ఉంటయి. ఈ విషయంపై అవగాహన పెరిగేకొద్ది ఆకర్షక క్షేత్రాలు మనపై వేసే ప్రభావాన్ని తెలుసుకోగల్గుతము. ఉన్నత స్థాయి చైతన్యం కల్గిన వ్యక్తులతో కేవలం కొద్దిసేపు మాట్లాడినప్పటికి అది జీవితంపై అపారమైన ప్రభావం చూపిస్తది. కృష్ణుడు, జీసస్ మరియు బుద్ధుడు లాంటి గొప్పవారు మరియు జ్ఞానోదయం పొందిన వ్యక్తుల బోధనలు అధ్యయనం చేయడం ద్వారా గొప్ప శక్తిని పొందగలము. హాకిన్స్ ప్రకారం జీసస్, బుద్ధుడు, కృష్ణుడుల చైతన్య స్థాయి 1000 ఉంటుందని లెక్కగట్టిన్రు. ఈ మహావతారాలు మానవ చైతన్యంపై కలిగిఉన్న అపారమైన శక్తి గురించి ఆలోచించండి. ఆ ప్రభావాలు నేటికీ అనుభవంలో ఉన్నయి. 1000 స్థాయి వద్ద ఉన్న అవతారులు వ్యక్తులుగా అంతగా కనిపించరు కానీ ఒక చైతన్యానికి సంబంధించిన నమూనాల్లా మారిన్రు. కృష్ణ తత్త్వం, క్రీస్తు స్పృహ, బుద్ధ స్వభావం ఇటువంటి నమూనాలకు ఉదాహరణలుగా నిలుస్తయి. ఎవరైనా ఈ స్థాయిని పెంచుకోవాలంటే ఉన్నతస్థాయి ఆలోచనా రీతులను అలవరచుకోవలసి ఉంటది. ప్రేమ, కరుణ, కృతజ్ఞత, శాంతి లాంటి లక్షణాలు చైతన్యం యొక్క ఉన్నత సూత్రాలు. ఎవరైన ఈ సూత్రానికి వ్యతిరేకంగా నడుచుకున్నట్లైతే చైతన్య స్థాయిల్లో తక్కువ స్థానానికి చేరుకుంటరు. కోపం, గాలివార్తలు, ద్వేషం, తీర్పరితనం వంటి భావోద్వేగాలు కలిగిన వాళ్ళు తక్కువ ఎరుక స్థాయివైపు ఆకర్షింపబడతరు. అలాగే మనకు మనం ఉన్నత లక్షణాలను అలవర్చుకున్నప్పుడు పై స్థాయిలకు చేరుకుంటము. మనం వ్యక్తులను చైతన్య స్థాయిలను క్షుణ్ణంగా పరిశీలించినట్లయితే ఆయా వ్యక్తులు తమ జీవితాల్లోని వివిధ అంశాల్లో వివిధ స్థాయిల్లో ఉండవచ్చని గమనించండి. ఇది ఆయా వ్యక్తుల యొక్క మొత్తం చైతన్యం యొక్క సగటు వారి మొత్తంగా ఏ స్థాయిలో ఉన్నారో నిర్ణయిస్తుంది. ఉదాహరణకు ఎవరైనా కోరిక, కోపం మరియు గర్వాల మధ్య ఉండవచ్చు. దీని కారణంగా వారి సగటు స్థాయి కోపం కావచ్చు. ఎవరైనా తమ జీవితంలో వివిధ సమయాల్లో, వివిధ పరిస్థితులతో సంబంధం కలిగి ఉండడం అసాధారణమైతె కాదు. కానీ వాటిలో ఒకటి మన ఎరుకపై ఆధిపత్యం చెలాయిస్తూ ఉంటుంది. స్థాయి వివరణలు: చైతన్య స్థాయి 20: అవమానం అవమానం ఆత్మహత్యకు దారితీస్తుంది లేదా జీవితాన్ని కొనసాగించాలన్న కోరిక లేకుండా చేస్తది. అవమానానికి గురైన వాళ్లు పరువు పోగొట్టుకుని మొహం చెల్లని వారుగా తమను తాము భావిస్తరు. వాల్లు పదిమంది ఎదుట రాలేక దాక్కుందమనుకుంటరు. సిగ్గుతో తనలో తాను కుచించుకుపోతు ఉంటరు. సమాజంలో తల తీసేసినట్టు బావిస్తరు. ఒక విధమైన బహిష్కృతుడైన భావన మరణాన్ని ఒక పరిష్కారం ఎంచుకునే విధంగా దారితీస్తది. సాధారణంగా అవమానం అనేది భావోద్వేగ మరియు మానసిక ఆరోగ్యానికి వినాశకరంగా మారుతది మరియు తరచు శారీరక అనారోగ్యంగా లేక మరణంగా వ్యక్తమవుతది. ఇది తనపట్ల లేదా ఇతరుల పట్ల కూడా వ్యక్తమైతది. చైతన్య స్థాయి 30: అపరాధభావన అపరాధభావం అనేది క్షమార్హం కాని భావోద్వేగంగా రూపుదిద్దుకుంటది. ఇది అంతర్ముఖంగా ఉంటది, లేకుంటే బహిరంగంగా కనిపిస్తది. వీల్లు శిక్షకు గురైతమని చూస్తుంటరు, లేదా ఎవరినైనా శిక్షించాలని బలీయమైన భావం కల్గి ఉంటరు. తమ స్వీయ అపరాధ మనఃసాక్షిని సంతృప్తి పరుచుకోనికి సమాజాలు తరచుగా బహిరంగ శిక్షను ఉపయోగించుకుంటయి. అపరాధ భావం ఆవేశాన్ని రేకెత్తిస్తుంది. చంపడంలో ఇది వ్యక్తమయితది. ఇది తరచుగా స్వీయ తిరస్కరణ, పశ్చాత్తాపం, చెడు అనుభూతి మరియు స్వయం విధ్వంసానికి దారితీస్తది. పైకి తెలియకుండా అంతర్గతంగా దాగిఉన్న అపరాధ భావన సైకోసొమాటిక్ వంటి తీవ్ర మానసిక వ్యాధులకు కారణమయితది. చాలామంది వ్యక్తులు ఏదో ఒకవిధమైన స్థాయి కల్గిన అపరాధ భావనలను జీవితాంతం కలిగి ఉంటరు. అపరాధ భావన కలిగిన వారిని వేరొకరు అలుసుగా తీసుకొని దోచుకుంటరు, కంట్రోల్ చేయనికి ప్రయత్నిస్తరు. చైతన్య స్థాయి 50: ఉదాసీనత ఉదాసీనత అన్నది పేదరికం, నిరాశ మరియు నిస్సాహయతలతో కూడుకున్నది అయి ఉంటది. ఇది ఇతరుల వద్ద జాలి పొందే స్థాయి. వీరిలో చైతన్య శక్తి స్థాయి ఎంత తక్కువగా ఉంటుందంటే సహాయం అందుబాటులో ఉన్నప్పటికి దాన్ని అందుకోలేకపోతరు. వీరిలో ఆశ్రయంలేని వాల్లు, ఒంటరిగా నివసించేవాల్లు, దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడుతున్న వృద్ధులు ఉంటరు. ఆశ అన్నది ఒదిలేసిన స్థితిగా ఉదాసీనతను అభివర్ణించవచ్చు. హాకిన్స్ అంచనా ప్రకారం ప్రపంచ జనాభాలో దాదాపు మూడిరట ఒక వంతు మంది ఈ స్థాయిలో లేదా అంతకన్న తక్కువ స్థాయిలో జీవిస్తున్నరు. చైతన్య స్థాయి 75: దుఃఖం ఈ స్థాయి గతం యొక్క విచారం, నష్టం, వియోగం మరియు పశ్చాత్తాపం లాంటి లక్షణాలు కలిగి ఉంటది. జీవితం మొదట్లో కలిగిన ఒక పెద్ద నష్టం వల్ల దుఃఖం మరియు విచారం జీవిత పర్యవసానాలుగా భావించే లెక్క మారుతయి. ఈ దశలో ఉన్నవారు తమ దుఃఖాన్ని ప్రపంచానికి వ్యక్తపరుస్తు అన్ని విషయాలను విచార కోణంలోనే చూస్తరు. ఇది అలవాటుగా నష్టపోయేవాల్లు మరియు జూదబలహీనత బాగా ముదిరినోల్ల స్థాయి. వారు తమ వైఫల్యాలను అలాగే ఉద్యోగాలు, డబ్బు, స్నేహితులు, ఆరోగ్యం, కుటుంబం, అవకాశాలను కోల్పోవడం తమ జీవనశైలిలో ఓ భాగంగా అంగీకరించే స్థాయికి వచ్చేస్త్తరు. తమకు ఎంతో విలువైన, అపురూపమైనయి కోల్పోయినప్పుడు వాటికి మరో ప్రత్యామ్నాయం ఉండనే ఉండదని భావించడం దుఃఖం తాలూక లక్షణాల్లో ఒకటైతది. అటువంటి నష్టాలు ఎదుర్కొన్నప్పుడు అవి వారిని తీవ్రమైన కృంగుబాటుకి గురిచేస్తవి, మరణానికి సైతం దారితీసేలా చేస్తవి. అయితే దుఃఖం అనేది ఉదాసీనతకు మించిన శక్తి స్థాయి కాబట్టి ఉదాసీనత స్థితి దాటి దుఃఖాన్ని అనుభవించడం ప్రారంభించినాక వారు అదే స్థాయిలో కొనసాగుతున్నరు. చైతన్య స్థాయి 100 : భయం భయం అనేది దాదాపుగా అందరి బాహ్య అంతర్గత చైతన్యాల్లో ఉండేటిదే. దుఃఖం అనేది గతం పై కేంద్రీకృతమై ఉన్నప్పుడు భవిష్యత్తు గురించి భయం ఉంటది. మరణం లేదా ఆత్మహత్యకు దారితీసే దిగువ స్థాయి నుంచి ఈ స్థాయి ఎంతో దూరంగా ఉంటుంది. భయం మన యొక్క శ్రేయస్సు, భద్రతలకు సంబంధించిన ఆందోళనలను వ్యక్తపరుస్తది. కాబట్టి ఇది తమ జీవితాన్ని కాపాడుకోవాలనుకునే భావనగా వ్యక్తమైతది. భయమనే భావన అడ్వర్టైజింగ్, మీడియా, రాజకీయాల్లో ఇతరులను దోచుకోవడానికి విరివిగా వాడబడ్తవి. ఒక వ్యక్తి స్వభావంలో భయమన్నది ప్రధానంగా ఉంటే వారు అస్థిర మనస్తత్వం, అసూయ వంటి న్యూరోసిస్ పరిస్థితిలో ఉంటరు. భయంతో ఉన్నప్పుడు ఎదగడం కష్టమై అది వారి అంతర్గత నిరోధాలకు దారితీస్తది. భయంతో ఉన్నవాళ్ళు తమ స్థితిని అధిగమించడం ద్వారా మరింత ఎగువ స్థాయికి చేరుకుంటరు. చాలా మంది వ్యక్తులు భయాన్ని ఆధారంగా తమ జీవితాలను నిర్మించుకోవడం వల్ల భయం కూడా ఎదగడానికి ఒక శక్తివంతమైన ప్రేరణ అందించడం ఓ ఆసక్తికరమైన విషయం. మరణభయం లేదా వ్యాధిగ్రస్త జీవితం తాలూకు భయం జనాలను ఆరోగ్యకరమైన జీవన విధానాలకు ప్రేరేపిస్తది. అవసరమైన డబ్బు ఉంటదో లేదో అన్న భయం మనుషులను డబ్బు పట్ల బాధ్యతగా ఉంటూ వారి రిటైర్మెంట్ ఖర్చులకోసం పైసలు దాచుకునేటట్టు చేస్తది. అలాగే భయం విధ్వంసకరం కూడా. రిలేషన్షిప్లో కోల్పోతాము అన్న భయం తీవ్రమైన అసూయకు దారితీస్తది. మనం భయాలను ఎదుర్కోడానికి ఇష్టంగా లేనప్పుడు భయం మన జీవితానుభవాన్ని పరిమితం చేసేస్తది. మన భయాల గురించి ఆత్మపరిశీలన చేసుకోవడం వల్ల అది మన గురించి అట్లే అది మనను ఎట్లా ప్రేరేపిస్తున్నదో తెలుస్తది. చైతన్య స్థాయి 125 : కోరిక ఈ స్థాయి భౌతికవాదం మరియు మొత్తం ఆర్ధిక వ్యవస్థలకు మూలాధారంగా నిలుస్తది. గుర్తింపు కోసం బలమైన భావన, శక్తి, భౌతిక వస్తువులు సమకూర్చుకోవడం లాంటి బలీయమైన కోర్కెలను సాధించే దిశలో మనుషులు భయాన్ని అధిగమిస్తరు. కోర్కెలను తీర్చుకోడానికి మనం పెద్దమొత్తంలో శక్తిని ఖర్చు చేయగల్గుతున్నము. కాస్మొటిక్ మరియు ఫ్యాషన్ రంగాల్లో ప్రజలు లైంగిక ఆమోదాన్ని కోరుకునేవారుగా చూపించబడతరు. కోరిక అనేది దురాశతో పోగేసుకోవాల్సిన అవసరంగా లేదా వ్యసనాలు వ్యామోహాలు మరియు తప్పనిసరి పరిస్థితులుగా రూపాంతరం చెందుతయి. ఇది ఒక బలమైన ఆకర్షణీయ క్షేత్రం అలాగే చాలామందికి చైతన్యం యొక్క ఆధిపత్య స్థాయి అవుతుంది. కోరిక వ్యసనాలతో ముడిపడి ఉండే స్థాయి. ఎందుకంటే కోరిక జీవితం కంటే చాలా ముఖ్యమైనది. కోరికలంటే వ్యసనాలు, మాదకద్రవ్యాలు, మధ్యపానాల వద్దే ఆగిపోకుండా గుర్తింపు కోసం ఆరాటం అపార సంపదలను పోగేసుకోవడం మరియు లైంగిక వెంపర్లాటలుగా కూడా రూపాంతరం చెందవచ్చు. ఒక కోరిక తీరనప్పుడు ఆ స్థానంలో మరో కోరిక వచ్చి చేరడం అనే తనకు తానుగా ఏర్పరుచుకునే ఉచ్చుల్లో ఒక భాగమైతది. ఇది ఎప్పటికీ సంతృప్తి చెందదు. ఎల్లప్పుడూ మరిన్ని వాటిపై ఆరాటం చెందుతూనే ఉంటదట్ల. ఏది ఏమైనప్పటికీ కోరిక అనేది లక్ష్యాలను సాధించే దిశగా స్పూరినిచ్చే ఒక పరికరంగా అయితే ఉపయోగపడతది. ఇది మనిషి యొక్క అంతర్గత ఎదుగుదలపై దృష్టి సారించినపుడు అది వ్యక్తి తాలుకు చైతన్యపు స్థాయిని ఉన్నతంగా పెంచనీకి దారితీస్తది. చైతన్య స్థాయి 150 : కోపం కోరిక యొక్క శక్తి క్షేత్రం తాను కోరుకున్నది పొందనందువలన నిరాశకి దారితీస్తది. ఆ నిరాశ కోపంగా మారతది. కోపాన్ని నిర్మాణాత్మకంగా వాడవచ్చు. లేదా విధ్వంసకరంగా ఉపయోగించవచ్చు. ఇది చాలాసార్లు ఆగ్రహం మరియు ప్రతీకార రూపాల్లో వ్యక్తీకరించబడతది. ఇది అస్థిరమైనది. అలాగే ప్రమాదమైనది కూడా. ఈ స్థాయిలో ఉన్న వ్యక్తులతో మాట్లాడేటప్పుడు భయమేస్తది. ఎందుకంటే ఆల్ల కోపంల ఎట్ల చెలరేగిపోతరో ఎవరికీ తెలియదు. కోపాన్ని నిర్మాణాత్మకంగా వినియోగించినప్పుడు అది సమాజ లేదా వ్యక్తిగత మార్పులకు ప్రేరణగా నిలుస్తది. కోపాన్ని ఉత్ప్రేరకంగా ఉపయోగించినపుడు అది పరిష్కారాలను అన్వేషించే సంకల్పం మరియు శక్తిలను అందిస్తది. అదే కోపాన్ని విధ్వంసకారిగా ఉపయోగిస్తే అది యుద్ధాలు మరియు హత్యలకు దారితీస్తది. కోపంలోనే జీవిస్తున్నప్పుడు ఆ కోపం పగ, కక్ష, కార్పణ్యం మరియు విద్వేషాలను రగిలిస్తది. ఈ పరిస్థితి ప్రమాదకరమైనది అలాగే విధ్వంసకరమైనది కూడా. ఇది మనిషి యొక్క జీవితాన్ని చాలా తీవ్రంగా నాశనం చేస్తది. ఈ స్థాయిలో ఉండేటోల్లు సంక్లిష్టంగా, తంపులమారిగా చికాకు కలిగించే వాల్లుగా మరియు విధ్వంసకర సన్నివేశాలకు దారితీసేవాల్లలా ఉంటరు. వీరు కోపాన్ని సంబాళించు కోవడంలో సమస్యలు కలిగిఉంటరు. వీరు చాలా సులభంగా మనస్తాపం చెందుతా ఉంటరు. తమకు అన్యాయం జరిగిన ప్రతీ విషయాన్ని తమ మనసులో డైరీలెక్క పదిలంగా ఉంచుకుంటరు. కోపం అనేది గర్వం కలిగి ఉన్నవారికి ఇతరులపై ఆగ్రహం, ద్వేషం మరియు పగలను ప్రదర్శించడం ద్వారా తమ స్వీయ విలువ భావాన్ని కాపాడుకోడానికి ప్రేరణగా ఉండే శక్తి యొక్క మూలక్షేత్రం. చైతన్య స్థాయి 175 : అహంకారం సంకుచిత మనస్తత్వ్తం కలిగి ఉన్నోల్లు, మాకెవ్వరూ ఏమీ నేర్పించక్కర్లేదు అన్న భావనతో ఉన్నోల్లు, ఎప్పుడూ తామే రైట్ అనిపించుకోవడానికి తమను సమర్ధించుకునేవాళ్ళు, కేవలం తమ గురించి మాత్రమే ఆలోచించే గర్విష్టులు, ఎవరు చెప్పినా వినిపించుకోని వాల్లు, తమకు తామే గొప్పని భావించేవాల్లు ఈ అహంకార స్థాయిలో ఉంటరు. వీళ్ళు తమ గురించి తాము ఈ దశలో ఎంతో పాజిటివ్‌గా భావిస్తరు. బాధ తాలూకు తక్కువ స్థాయిల్లోంచి అహంకార స్థాయికి చేరుకున్న ఫలితంగా ఆత్మగౌరవం అహంకారపు భావనలో మొదలైతది. తమ దర్పాన్ని, నైపుణ్యాలను ప్రదర్శించడం ద్వారా ఎదుటివాళ్ళను ఆకట్టుకునే ప్రయత్నం చేసేవాల్ల ప్రయత్నాల్లో అహంకారం ఉంటది. వారి మొహాలపై గర్వం తొణికిసలాడతది. తళుకు బెళుకుల వేషధారణలో వాల్ల అహంకార ప్రదర్శన ఉంటది. తమ తమ వస్తువుల ప్రదర్శన ద్వారా, తాము సాధించిన విజయాలను ఎంతో గొప్పవిగా అభివర్ణించడం ద్వారా, విజయోత్సాహాన్ని ప్రదర్శించడం ద్వారా, గతంలో వారు చేసిన యాత్రలను గొప్పలుగా చెప్పుకోటం ద్వారా, తమ పిల్లలు లేదా జీవిత భాగస్వామి సాధించిన విజయాలను చిలువలు పలువలుగా చేసి చెప్పుకోటం తమ అహంకారాన్ని బయటవెడ్తరు. ఈ స్థాయిలో ఉన్న వ్యక్తులు అభద్రత మరియు విచారాలు కలిగి ఉన్నప్పటికీ అహంకారం వాటిని బయటకి కనిపించనీకుండా చేస్తది. అహంకారం తమ జీవితం ఎంతో బాగుందన్న భావాన్ని బాహ్యంగా వ్యక్తపరచినప్పటికీ దాని వెనకాల అంతర్గతంగా దాచివెట్టినయి వాల్ల వ్యక్తిగత జీవితాన్ని గందరగోళంగా మారుస్తయి. అమెరికాలో ఉన్న మెరైన్ కార్ప్ సంస్థ తమ గొప్పలను చెప్పుకోవడం ద్వారా ఉద్యోగులను ఆకర్షించి వారిలో స్థైర్యాన్ని నింపే ప్రయత్నం చేస్తూ ఉంటది. సాధారణంగా సమాజంలో అహంకారం సానుకూలంగానే అంగీకరించబడ్తది.తమను తాము తరచి చూసుకునేంత వరకు ప్రోత్సహించబడ్తది. అహంకార స్థాయికన్నా దిగువన ఉండే స్థాయిలతో పోలిస్తే ఇది ఎంతో గొప్పగానే ఉంటది. అయితే అహంకార స్థాయి 200 కంటే తక్కువ ఉండటం వల్ల అవగాహనా స్థాయి బలహీనంగా ఉంటది. ఇక్కడ అహం పెరిగిపోయి సులభంగా దాడికి గురయ్యే దుర్బల పరిస్థితిలా ఉంటది. కావున ఒక్కోసారి ఇది అవమానం పొందే దిశగా నడుస్తది. అహంకారం ప్రదర్శించేవోల్లు చేసే తప్పులు వాల్లని ఒక్కోసారి తీవ్రప్రమాదంలోకి నెట్టేస్తవి. ఈ పతనాన్ని నిరోధించే ప్రయత్నంలో అహంకారం పొగరుగా, విభజించేదిలా, స్వీయరక్షణ మరియు దుర్బలత్వాలకు దారితీస్తది. ఇవన్నీ తిరస్కరణకు దారితీస్తయి. ఈ లక్షణాలు వ్యక్తిగత ఎదుగుదలకు ఏమాత్రం ఉపయోగపడవు సరికదా దానికి ప్రధానమైన అడ్డంకిగా నిలుస్తయి. ఈ స్థాయిలో మధ్యపానం లేదా ఇతర బలహీనతలు ఉంటే వాటి నుండి బయటపడటం ఎంతో కష్టసాధ్యం. ఎందుకంటే వారి భావోద్వేగపరమైన సమస్యలు మరియు వ్యక్తిత్వ లోపాలను అహం అంగీకరించదు. ఈ స్వభావం వారి పురోగతికి దోహదపడదు. గర్వం అనేటిది ఎప్పుడూ కాపాడుకోవాల్సి రావడంతో దానికి వాస్తవ శక్తిగాని, స్థాయిగాని, గౌరవం గాని ఉండదు. అహంకారమనేది అంతర్గత భయాలకు సంబంధించి ఉంటది. మనిషి ఒకసారి అహంకారాన్ని అనుభవించాక దాని నుండి బయటపడవచ్చు. అప్పుడు అతనిలోని భయం తదుపరి ఆకర్షక క్షేత్రమైన ధైర్యం వైపు ప్రయాణిస్తది. ఎప్పుడైతే మనిషి ‘‘శక్తి’’ తాలూకు స్థాయిల్లోకి ప్రవేశించిండో అతడి ఎదుగుదల క్రమేపీ వేగంగా పుంజుకుంటది. ఈ స్థితి తర్వాత నిజమైన హోదా, ప్రతిష్ట మరియు ఔన్నత్యాలను సాధించే అవకాశం ఉంటది. ఇది జరిగేవరకు మనిషి తన అహం తాలూకు బాధితుడిగా ఉండిపోతడు. తమ వైఫల్యాలకు బయట ఉన్న వాటిని నిందిస్తూనే ఉంటడు. ఈ స్థాయి తనకుతాను జవాబుదారీగా మారనీకి నిజమైన స్వీయబలోపేత, వ్యక్తిగత అభివృద్ధిని సాధించనీకి చిట్టచివరిగా ఉండే అవరోధంగా నిలుస్తది. అహంకారం ఆత్మగౌరవానికి ప్రతీకగా అప్పుడప్పుడు భావించినప్పటికి నిజమైన ఆత్మగౌరవం అహంకారాన్ని ఇడిచేసినంకనే వస్తది. అహంకారం అంతర్గత బలాన్ని పెంచదు సరి కదా భయాన్ని దుర్బలత్వాన్ని కలిగిస్తది. జీవనశైలి, దుస్తులు, తాము నడిపే కారు యొక్క బ్రాండు, పూర్వీకులు, తమ మతపరమైన అనుబంధాల వంటిని పరిరక్షించుకోనీకి అహంకారం తన శక్తిని ఉయోగిస్తది. ఇది ఎప్పుడూ తామెట్లా కనిపిస్తున్నమో ఇతరులు తమ గురించి ఎట్ల అనుకుంటన్నరో అన్న సోయిలోనే ఉంటది. ఇతరుల అభిప్రాయలపై ఎక్కువగా అధారపడే దుర్బల మనస్తత్త్వాన్ని కలిగి ఉంటది. ఒకసారి అహంకారం మనల్ని విడిచిపెట్టి పోయాక ఆ స్థానంలో నిజమైన అంతర్గత శక్తి చేరినప్పుడు మన ఇమేజిని కాపాడుకోవాల్సిన అవసరం పోతది. అప్పటివరకూ అహంకారం యొక్క ఆత్మరక్షణ దాడులకు అహ్వానించె లెక్కనే ఉంటది. తమ గురించి తాము సొంతంగా మంచిగ అనుకోలేని అభద్రతా భావంలో ఎప్పుడూ ఉండేటోల్లను అహంకారం కాపాడ్తనే ఉంటది. చైతన్య స్థాయి 200 : ధైర్యం జీవితం యొక్క సానుకూల అంశాలు ప్రతికూల అంశాలను అధిగమించడం మొదలైనప్పుడు ఈ స్థాయిలో మొట్టమొదట శక్తి పుడతది. ఈ స్థాయి నుండి మనం ధైర్యం మరియు ఉత్సాహాలతో మన ప్రపంచాన్ని అన్వేషించడం మొదలువెడతం. అన్వేషణ, విజయం, ధైర్యం మరియు సంకల్ప దీక్షలో సాగుతది. ఈ స్థాయి కన్నా దిగువ ఉండే చైతన్య స్థాయిలు నొప్పి, బాధ, దుఃఖాలతో నిండి ఉంటే ఇకనుండి జీవితం సవాలుగా మారి మనల్ని ఉత్తేజపరిచేదిగా మారడాన్ని గమనించగలుగతం. మనం పని చేసే పనుల్లో విజయం సాధించే కొద్దీ, బాధ్యతాయుతంగా వ్యవహరిస్తూన్న కొద్దీ మనం సాధించే ప్రతి విజయం క్రమేపీ ఆత్మగౌరవాన్ని పెంపొందిస్తుంది. నిరంతర స్వీయ రక్షణ అవసరమయ్యే ఆత్మగౌరవం అహంకారంలో కాక ధైర్యంలో ప్రతిబింబిస్తది. తద్వారా మనం సాధించుకున్న గౌరవ భావం మనతోనే ఉంటది. మొట్టమొదటి తెరచాపను ఎత్తిన మరుక్షణంలో ప్రయాణం ప్రారంభించినట్లే. ఈ స్థాయిలో మనకు ఇంతవరకు తెలియని జీవితాన్ని అన్వేషించగలిగే అంశాలు ఉత్తేజాన్ని నింపుకుంటయి. ఈ స్థాయిలో భయాలు ఇంకా ఉన్నప్పటికీ వాటిని అధిగమించే ధైర్యాన్ని కూడపెట్టుకోవాల్సిన అవసరం ఉంటది. మనకు అవసరమైన విద్యలను అభ్యసించడం, కొత్త ఉద్యోగం చేయడం, వృత్తిగత లోపాలను సరిదిద్దుకోవడం, ఎప్పటికప్పుడు మనల్ని మనం సమీక్షించుకోవడం ఇందులో భాగంగ ఉంటయి. ఒకప్పుడు తక్కువ స్థాయిలో ఉంటూ మనకు అవరోధంగా నిలిచిన అంశాలను ఇప్పుడు మనం ఒక సవాలుగా తీసుకుని అధిగమిస్తున్నం. మొదటిసారి మన జీవితానికి మనం మంచిగ సాయం చేసుకుంటున్నం. ధైర్యం మనలోని శక్తి యొక్క మూలాల్లోకి పోనీకి దోహదవడతది. ఇకపై మనల్ని మనం బాధితులగా భావించడం మానేస్తం. ఇకనుండి మన జీవిత అనుభవాలకు బాధ్యత వహించడం ప్రారంభిస్తాం. ఇది మనల్ని మనం బాగుచేసుకోవడంలో మొదటి దశ. ఈ దశలో మనకు మనమే ఓ పరిమితిగా నిలుస్తం. అహంకారం అంతర్గతంగా ఉండే భయాల వల్ల వస్తది. కావున మనలో ఏర్పడే ధైర్యం ఆ భయాలను ఎదుర్కొని వాటిని అధిగమించేలా చేస్తది. మన స్వీయ భావోద్వేగాలకు భయపడే బదులు వాటిని ఎదుర్కొనే ధైర్యాన్ని సంతరించుకుంటం. వాటిని నియంత్రించగలుగుతం. చిన్నచిన్న విజయాలు సాధిస్తున్న కొద్దీ మనలో పెరిగే ఆత్మవిశ్వాసం పెద్ద విజయాలకు దోహదపడతది. ధైర్యం యొక్క ఈ స్థాయిలో మనం సాధించగలిగేవాటిపై దృష్టి నిలుపుతం. దాంతో పాటు మన అవకాశాల ప్రపంచం కూడా విస్తరిస్తది. ఈ స్థాయిలో మొదట వ్యక్తిగత లబ్ధి ప్రేరణగా నిలిచినప్పటికీ క్రమేపీ మనం ఇతరులకు ఇవ్వగలిగే సామర్ధ్యాలను మనలో అభివృద్ధి చేసుకోగలుగుతం. చైతన్య స్థాయి 250 : సమస్థితి సమస్థితి విషయాల పట్ల అనుకూలంగా లేదా వ్యతిరేకంగా నిలిచే బదులు మనల్ని సమస్థితిలో ఉంచుతది. దీని కన్నా తక్కువ స్థాయిల్లో జనం విషయాల పట్ల బలీయమైన వైఖరి కలిగి ఉన్న కారణంగా ఆయా స్థాయిలు వ్యతిరేకతను, విభజనను ఎదుర్కోవాల్సి వచ్చేది. బలీయమైన స్థితి కలిగి ఉండాలి అనుకోవడం కోపం, నిరాశ, నిస్పృహలకు దారితీస్తది. కాబట్టి విషయాలను ఒక క్రమపద్ధతిలో ఉంచాల్సిన అవసరం ఈ స్థాయిలో మొదలయితది. ఫలితాల పట్ల బంధం లేకుండా ఉండగలిగినప్పుడు మనం ఇకపై బాధితులుగా ఉండబోము. ఈ స్థాయి చైతన్యంలో మనం అనేక బాధాకరమైన ఉద్వేగాలను విడుదల చేస్తూ ఉంటం. ప్రతిఘటనను విడనాడినప్పుడు మనిషికి మరింత శక్తి చేకూరుతది. బలమైన అభిప్రాయాలు అవరోధాలు, కష్టాలను ఎదుర్కొనేలా చేస్తవి. ఈ స్థితిలో మనం వాటిని ఈ విధంగా చూడడం మానేస్తం. ఇకపై విముఖత మరియు తాపత్రయాల ఆధిపత్యం నుండి శక్తికి తగినంత స్వేచ్ఛ లభిస్తది. ఈ స్థాయికి చేరుకున్నప్పుడు చక్కగా జీవించగల భావన, జీవితాన్ని నిర్వహించగల సామర్థ్యాలు మనలో సంతరించుకుంటయి. ఒకప్పటి భయం స్థానంలో భద్రత మరియు ఆత్మస్థైర్యం చోటుచేసుకుంటయి. మనం ఎటువంటి పరిస్థితినైనా నిర్వహించగలుగుతం. చైతన్య స్థాయి 310 : సుముఖత జీవితంలో ఒక చురుకైన పాత్రను పోషించడాన్ని ఈ స్థాయి సూచిస్తది. ఈ స్థాయిలో మన ఉద్యోగం చేయడమే కాక చేసే పనిలో ఉత్తమ స్థాయి ప్రయత్నాలు కూడా చేస్తాము. దీనివల్ల ఉద్యోగంలో పదోన్నతి మరియు అభివృద్ధిలు వేగంగా ఉంటయి. జీవితంలోని అన్ని పార్శ్వాల్లనూ ప్రగతి ఉంటది. సామాజిక మరియు ఆర్థిక విషయాల్లో విజయాలు వాటంతటవే లభిస్తయి. ఈ స్థాయిలో ఉన్న వ్యక్తి తక్కువ స్థాయి నుండి పని మొదలువెట్టి పై దిశగా పని చేయడానికి ‘‘సిద్ధంగా’’ ఉంటడు. నిరుద్యోగులైన వ్యక్తులు ఏ ఉద్యోగాల్లనైనా చేరనీకి ‘‘సిద్ధంగా’’ ఉంటరు. అంతర్గత స్వీయ విలువ మరియు ఆత్మ గౌరవం యొక్క స్థాయి అధికంగా ఉండడం వల్ల చిన్న ఉద్యోగాల్లో ఉన్నప్పటికీ చిన్నచూపు చూడబడరు. వారు తమ విలువలను, సహకారం అందించే సామర్థ్యాన్ని ‘‘తెలుసుకుంటరు’’. వారికి తరచూ అవార్డులు, రివార్డులు, గుర్తింపు, ప్రశంసలు అందించెటోల్లు ఇదే విషయాన్ని పలు సార్లు రూఢీగా చెప్పడం వల్ల ఆ సామర్థ్యం మరింత బలవడతది. చైతన్య స్థాయి 350 : సమ్మతి ఈ స్థాయికి చేరిన చైతన్యంలో మన స్వంత జీవితానికి మనమే సృష్టికర్త అని పూర్తిగా అంగీకరిస్తం. మన స్వీయ ఆనందానికి మనమే సృష్టికర్తగా తెలుసుకుంటము. ఇకపై అది ఎక్కడో ఉండదు. అది అంగీకరిచడానికి ఒక అపారమైన బాధ్యతతో కూడుకున్నదై దానితో పాటు స్పృహ మరియు చైతన్యంతో సమానంగా అదే స్థాయిలో ఒక పెద్ద శక్తి తాలూకు కుదుపుతో పాటు వస్తది. జీవితాన్ని మనం ఎలా కావాలంటే అలా సృష్టించుకోవడానికి మనకు మాత్రమే శక్తి ఉందని అర్ధం చేసుకోగల్గుతం. మనం మన ‘‘జీవితశక్తులతో’’ సామరస్యంగా జీవించడం ప్రారంభిస్తం. మనం ఈ అతి పెద్ద ఆవిష్కరణను అర్ధం చేసుకోవడం మొదలుపెట్టినం. సమస్యలను పరిష్కరించడంలో మరింత అవగాహన పొందడం ప్రారంభిస్తం. ఈ ఎరుక ఆలోచనా మరియు నిర్ణయాల్లో సమతుల్యత, సరైన నిష్పత్తి మరియు సముచిత తత్త్వాలను ఉపయోగించుకుంటది. ‘‘సరిjైునది’’ లేదా ‘‘తప్పు’’ అని నిర్ణయించడంలో మనకి ఆసక్తి లేనందువల్ల మనకు అన్ని పరిష్కారాల్లో ఉమ్మడి సామాన్య పరిష్కార దృష్టిపై కేంద్రీకరించల్గుతం. మన స్వీయ ఆనందాన్ని మనలోనే కనుగొనే మన సామర్ధ్యం గురించి పూర్తి అవగాహనతో ఉంటం. మన స్వంత పరిధిల గురించి చైతన్యంలోకి వస్తం. ఈ స్థాయిలో మనం ఏ విషయాన్నైనా సులభంగా అంగీకరించవచ్చు. దీనికారణంగా మనం పూర్తిగా తిరస్కరణను అధిగమిస్తం. మనల్ని మనం మరింత నిష్పాక్షికంగా చూడటాన్ని మొదలుపెడ్తం. ఈ స్థాయి ఎటువంటి వివక్ష మరియు అసహనాలు లేనిదై ఉంటది. మనం వైవిధ్యాలను గౌరవిస్తునే సమానత్వాన్ని గుర్తిస్త్తము. మనం ఉన్న పరిస్థితులతో సంబంధం లేకుండా మనకు ఆనందాన్ని కలిగించే పరిస్థితులను ప్రభావితం చేయగలుగుతం. ఈ స్థాయిలో శక్తి సంపూర్ణంగా ఉపయోగించబడడమే కాకుండా అది నిస్వార్ధ సేవ రూపంలో ప్రపంచానికి తిరిగి చెల్లించబడతది. ఇది ఒక వ్యక్తిని కారణం యొక్క చైతన్య శక్తి స్ఠాయికి చేరుస్తది. చైతన్య స్థాయి 400 : కారణం కారణం లేదా హేతువు యొక్క స్థాయి సైన్సు, వైద్యరంగం మరియు చరిత్రలో ఉన్న గొప్ప ఆలోచనా పరుల్లో ఉంటది. ఐన్ స్టీన్, సిగ్మండ్ ఫ్రాయిడ్, సుప్రీం కోర్టు న్యాయమూర్తులంతా ఈ స్థాయిలలో కారణం మరియు హేతువును అన్వేషిస్తరు. నిర్ధారిస్తరు. తెలివితేటలు మరియు హేతుబద్దతలు కలగలిసిన ఈ స్థాయిలో ఆధిపత్యాన్ని చెలాయిస్తాయి. దిగువ స్థాయిల్లో ఉండే సాధారణమైన, అసంబద్ధమైన భావోద్వేగాలకు సంబంధించిన వక్రీకరణలను అధిగమించడానికి ఇది తోడ్పడతది. ఈ స్థాయిలో మనం త్వరితగతిన వాస్తవాల ఆధారంగ సరైన నిర్ణయం తీసుకోగల సంక్లిష్టమైన సమాచార వ్యవస్థలను నిర్వహించగలుగుతము. సంబంధాలు, క్రమానుశీలతలు మరియు సూక్ష్మ స్థాయిలో ఉన్న వ్యత్యాసాల తాలూకు చిక్కులను అర్ధం చేసుకోవడం వల్ల గ్రాహ్యశక్తి మరియు సంభావ్యతలను అంచనా కట్టగల సామర్ధ్యం ఈ స్థాయిలో ఉంటుంది. కారణం యొక్క పరిణామంగా లక్ష్యాన్ని చేరుకోడానికి దోహదపడతది. హేతుబద్ధ స్థాయిలో సత్యం పట్ల ఎటువంటి భావోద్వేగాలు లేని గౌరవం ఉంటది. జ్ఞానం, వాస్తవాలు మరియు విద్య వ్యక్తి యొక్క స్థాయిని, విలువను పెంచడానికి ఉపకరిస్త్తయి. హేతుబద్ధత సాంకేతిక వాతావరణంలో తర్కం వాడబడే చోట ఎంతో ప్రభావశీలంగా ఉంటది. ఏది ఏమైనప్పటికీ అవగాహన యొక్క అత్యున్నత స్థాయిలను చేరుకోడానికి హేతుబద్ధత అవరోధంగా నిలుస్తది. ప్రతీ విషయాన్ని మేథస్సుతో మాత్రమే చూసే విషవలయంలో చిక్కుకుపోవడమనేది భారీ స్థాయిలో సమాచారం మరియు డాక్యుమెంట్లను ఉత్పత్తి చేస్తది. కానీ ‘‘విశ్వాసం’’లోనికి దూకడానికి అనుమతించే శక్తి హేతుబద్ధతలో లేనందువల్ల కారణం డేటా మధ్యలోనే చిక్కుకుపోయి ఉంటది. కావున ఇది ఆధ్యాత్మికత సత్యాలవైపు ఆత్మాశ్రయ ప్రవేశానికి అనుమతించదు. ఈ కారణంగా ప్రపంచంలో నాలుగు శాతం మంది మాత్రమే ఈ స్థాయిని దాటి పోగలుగుతున్నరు. ఇది గొప్ప ఆలోచనాపరులు, పాశ్చాత్య ప్రపంచంలోని గొప్ప గొప్ప గొప్ప పుస్తకాల స్థాయి. హేతుబద్ధత అనేది కేవలం మెదడు యొక్క తార్కిక సంబంధమైన పనితీరు మరియు వివరణలకు మాత్రమే పరిమితమై ఉంటది. ఈ స్థాయిలో భావోద్వేగాలు అణిచివేయబడి సమాచారం మరియు వాస్తవిక సత్యాల ప్రక్రియ మాత్రమే కొనసాగుతుంది. హేతుబద్ధత తనకు తానుగా సత్యాన్ని ప్రేమించగలిగే స్థాయికి చేరుకోగలిగినప్పుడు అది ప్రేమ యొక్క చైతన్య స్థాయికి తన ధృక్కోణవైఖరిని ఆ క్షణంలోనే మార్చుకోగలుగుతది. చైతన్య స్థాయి 500 : ప్రేమ ఈ స్థాయికి చేరుకునప్పుడు మనిషిలో ధృక్కోణంలో ఉన్నట్టుండి ఒక పెనుమార్పు సంభవిస్తది. ప్రేమ అనేది ఒక విభిన్న కోణంలో ఉంటది. ఇది క్రమానుశీలత లేని ఒక ఆత్మాశ్రయ ధోరణి కలిగి ఉంటది. ఈ స్థాయిలో తార్కిక మెదడుని పూర్తిగా దాటవేస్తూ అత్మచైతన్యంలోకి ప్రవేశిస్తము. ఉన్నతస్థాయి ఆధ్యాత్మిక ప్రభావాలు మొదటగా మెదడు ద్వారా హేతుబద్ధీకరణకు గురికాకముందే హృదయశక్తి ద్వారా వ్యక్తమవుతయి. ప్రేమకు ఉన్న గొప్ప గుణమేమిటంటే ఈ స్థితిలో ప్రేమ షరతులు లేనిదై, మార్పులకు గురి కానిదై, శాశ్వతమైనదై, క్షమాగుణం కలిగి పోషణ మరియు మద్దతు తెలపడం ద్వారా మొదలైతది. దిగువ స్థాయి ఎరుకల్లో ప్రేమ నిర్దేశంపబడినదై, ప్రత్యేకమైనదై, ఎంపిక చేయబడినదై, షరతులతో కూడుకున్నదై ఉంటుంది. ఈ స్థాయిని దాటి మన చైతన్య స్థాయి ఉన్నత దిశగా పయనించే క్రమంలో ఈ ప్రేమ షరతులు లేనిదిగా రూపాంతరం చెందుతది. దిగువ స్థాయిల్లో ‘‘పొందడానికి ఇవ్వబడే’’ ప్రేరణ ఆధారితమై షరతులని కలిగి ఉంటది. ఇది నిజమైన ప్రేమకన్నా మరొకరిపై ఆధారపడే స్థాయిలో ఉంటది. ఈ రోజున సమాజంలో ప్రాచుర్యంలో ఉన్న ప్రేమ అన్నది తీవ్ర శారీరక మరియు భావోద్వేగభరితమైన ఆకర్షణ, స్వాధీనత, ఆధారపడేది, నియంత్రణకు గురయ్యేది మరియు వ్యసనంగా ఉంటది. ప్రేమ ద్వేషంగా మారుతుందన్న వాస్తవం కారణంగా ఇది ‘‘నిజమైన’’ ప్రేమ కాబోదు. ఈ స్థాయిలో ప్రేమ ఒక జీవన శైలి అవుతుంది. ఒక విధానంగా జీవితపర్యంతం ఉంటది. ఇది మన ఉనికి నుండి ఉద్భవించే స్థాయి కాబట్టి బాహ్య ప్రభాలకు లోను కానిదై ఉంటది. ఈ ఆకర్షక క్షేత్రం యొక్క శక్తి కారణంగా ఈ స్థాయి కలిగిన వ్యక్తులు ఇతరులపై బలీయమైన ప్రభావం చూపించగలుగుతరు. వారిని ఉన్నతస్థాయికి చేరుకునేలా చేయగలుగుతరు. ఈ స్థాయి ప్రేమ అందరినీ, అందరి జీవితాలను కలగలుపుకొని ఉంటది కాబట్టి ఇది మానవుడి స్వీయ పరిమితులను దాటి ఉంటూ అవగాహనాస్థాయిని జీవితమంత విస్తరించేలా చేస్తది. ప్రేమ, మంచితనంపై మాత్రమే దృష్టి పెడుతూ ప్రతికూల ధోరణులను సైతం మంచిగ మార్చేయ్యగల శక్తి కలిగి ఉంటది. ప్రజలు ఈ స్థాయికి ఎదుగేకొద్దీ ఎవరినయినా కానీ ఎందుకైనా కానీ నిందించడం మానేసి జీవితాన్ని ఎలా ప్రేమించాలి అనే విషయం యొక్క నిరంతర అభ్యాసపూరిత అనుభవంగా చూస్తరు. ప్రేమ హృదయంలోంచి పుడుతుంది కాబట్టి మెదడు తాలూక మేధస్సు ద్వారా నియంత్రించబడలేదు. ప్రేమయొక్క ఉద్దేశ్యంలో ఉండే స్వచ్ఛత కారణంగా ఇది ఇతరులను నిరాశ నుండి బయటపడేసి వారు ఘన విజయాలను సాధించే విధంగా తోడ్పడతది. వాస్తవాలు మరియు సమాచారాలతో నిమిత్తం లేకుండా సమస్యలను ఒక ప్రాపంచిక దృక్పథంలో తక్షణ సహానుభూతితో చూడగల శక్తిని ప్రేమ కలిగి ఉంటది. ఈ స్థితిలో అహం తాలూక వేర్పాటు ధోరణి, విభజించే తత్త్వం, తీర్పులిచ్చే స్వభావాలనుండి బయటపడుతది. ప్రేమ అన్ని విషయాలనూ సంపూర్ణం చేయడానికి కృషి చేస్తది. ఇది నిజమైన ఆనందాన్ని అనుభవించగలిగే స్థాయిలో ఉంటుంది. ప్రేమ మనకు వెలుపల ఒక శక్తిగా ఉందని గ్రహించే క్రమంలో అదే ప్రేమ మనలో కూడా అనుభూతి చెందడం ద్వారా ఈ ఆనందం కలుగుతుంది. చైతన్య స్థాయి 540 : సంతోషం (షరతులు లేని ప్రేమ) హాకిన్స్ అంచనా ప్రకారం ప్రపంచ జనాభాలో కేవలం 0.4 శాతం ప్రజలు మాత్రమే 540 స్థాయికి చేరుకోగలిగిన్రు. ప్రేమ అనేది షరతులు లేనిదిగా మారడంతో అది ఒక నిజమైన ఆనందంగా అనుభూతి చెందడం ఈ స్థాయిలో ప్రారంభం అయితది. ఈ ఆనందం మనం నిర్వహించే అన్ని కార్యకలాపాలకు నిరంతరం తోడై ఉంటది. ఈ స్థాయిలో శక్తి క్షేత్ర చికిత్స జరుగుతది. ఇది 12 దశల సమూహాల స్థాయి అయి ఉంటది. ఈ స్థాయిలోని వ్యక్తుల సమక్షంలో ఉండటం ఆనందాన్ని కలిగించడమే కాకుండా వీరి నుండి వెలువడే శక్తి కాకుండా మనలోని ఒక ఉన్నత స్థాయి శక్తిని అనుభవంలోకి వస్తది. ఈ స్థాయిలో సాధువులు, ఆధ్యాత్మిక చికిత్స అందించేవారు మరియు ఆధ్యాత్మిక విద్యార్ధులు ఉంటరు. ఇక్కడ అపారమైన సహనం మరియు దీర్ఘకాలిక ప్రతికూల పరిస్థితులను ఎదుర్కోగల సానుకూల దృక్పథం యొక్క సామర్ధ్యం ఇమిడి ఉంది. కరుణతో కూడిన సామర్ధ్యం ఈ స్థాయిలో ప్రారంభమయితది. మనము శాశ్వతమైన మారని మూలంతో అనుసంధానించుకోవడం మొదలువెట్టినప్పుడు అంతరంగాల్లో ఆనందం, నిశ్శబ్దాలను అంతర్గతంగా తెలుసుకోవడం సంభవిస్తది. ఈ స్థాయి ముగింపు దశలో ప్రపంచం ఒక నిర్దిష్ట ప్రకాశాన్ని పొందుతది. ప్రతీదానిలో అందం కనిపిస్తది. సంకల్పం, ఉద్దేశం ఒకటే కావడంతో జీవితం ఏమాత్రం ప్రయాస లేకుండా సాగడం మొదలైతది. ఈ స్థాయిలో ఇతరులపట్ల బాధ్యతను తన స్వీయ చైతన్యం ద్వారా కలిగి ఉండడం జీవితాన్ని మరింత ఉన్నత స్థాయికి చేర్చుతది. మన శక్తి క్షేత్రం యొక్క అద్భుత శక్తిని ప్రతిఒక్కరు గ్రహించగలుగుతరు. అనేకమందిని ఏకకాలంలో ప్రేమించగల శక్తి కలిగి ఉంటం. ఇది కొనసాగుతూండగా మూలాన్నుండి అపరిమితంగా వెలువడే అపారమైన ప్రేమకు మనం ఒక వాహకంగా మారతాము. మరణానికి చేరువైన సందర్భాలలో మనుషులను ఇది 540 మరియు 600 మధ్య శక్తి స్థాయి వరకూ తీసుకెళ్ళగలదు. ఇది తాత్కాలిక అనుభూతి అయినప్పటికి వ్యక్తి తాలూకు జీవితాన్ని సమూలంగా మార్చి వేయగల సామర్ధ్యాన్ని కలిగిఉంటది. ఈ వాస్తవం మరణానికి సమీపంలో ఉన్న వ్యక్తుల్లో స్పష్టంగా కనిపిస్తది. ఒక్కసారి ఈ స్థాయికి చేరుకున్నాక ఓ కొత్త వాస్తవాన్ని అనుభూతి చెందగలుగుతరు. చైతన్య స్థాయి 600 : శాంతి ప్రజలు ఈ స్థాయికి చేరడం ఎంతో అరుదు. ఎందుకంటే ఈ శక్తి క్షేత్రం భావాతీతం, స్వీయ సాక్షాత్కారం మరియు దైవ స్పృహ వంటి వాటితో ముడిపడి ఉంటది. కోట్లాదిమందిలో ఒక్కరు మాత్రమే ఈ స్థాయికి సాధించగలుగుతున్నరు. 500 స్థాయి దగ్గర మొదలయ్యే కరుణ ఈ ఎరుక స్థాయి యొక్క ముఖ్య లక్షణంగా ఉంటది. క్షమాపణ అనేది మన క్షమాపణ తాలూకు అవసరం అని నిర్ధారింపబడిన తర్వాత ఇంతకు మునుపటి దశ కరుణ, క్షమా గుణాలను అధిగమించింది. ఎందుకంటే ఇక్కడ ఇకపై తీర్పులివ్వడమనేదే ఉండదు. ప్రజలు మనకు వ్యతిరేకమైన పనులు చేస్తున్నట్లు ఇక భావించలేము. ఎందుకంటె వారు వారి చైతన్య స్థాయికి అనుగుణంగా మాత్రమే ఉంటరు. ‘‘వాళ్ళకి బాగా తెలిస్తే మరింత బాగా చేసి ఉండేవారు’’, ‘‘వారు ఏం చేస్తున్నారో వారికే తెలియదు.’’ అని అర్ధం చేసుకోనికి ఇది కరుణను ప్రేరేపిస్తది. ఈ స్థితికి చేరుకున్నప్పుడు అవగాహన యొక్క నిర్దిష్ట కేంద్ర బిందువు ఉండదు కాబట్టి విషయం మరియు వస్తువుల మధ్య వ్యత్యాసం అదృశ్యమవుతది. ఈ స్థితిని అందుకున్న వ్యక్తులు ప్రపంచం నుండి తమకు తాముగా విడివడి ఉండడం అసాధారణమైనది కాదు. ఎందుకంటే బ్రహ్మానందం పొందుతున్న వాల్లకు ప్రపంచం వ్యర్థంగా అనిపించడం వల్ల దైనందిన కార్యకలాపాలకు దూరంగా ఉండచ్చు. వీరిలో కొంతమంది ఆధ్యాత్మిక గురువులుగా పిలవబడతరు. కొంతమంది అనామకులై సంచరిస్తూ ప్రజల అభ్యున్నతి కోసం పనిచేస్తుంటరు. మరి కొంతమంది తమ రంగాలలో అసాధారణ మేథావులుగా పేరుతెచ్చుకుంటరు. ఈ ఉన్నత దశ మతభావనకు అతీతంగా ఉంటది. ఎందుకంటే స్వచ్ఛమైన ఆధ్యాత్మికత అన్ని మతాలకు మూలబిందువు. ఈ స్థాయిలోని గ్రాహ్యశక్తియొక్క వాస్తవ అనుభవాన్ని వివరించడం కష్టసాధ్యం. ఇది నెమ్మదైన ఒక కదలికగా లేదా కాలం మరియు స్థలాన్ని అధిగమించిన విషయంగా అభివర్ణించబడ్డది. పరిణామం మరియు పదార్థం యొక్క నిరంతర ప్రవాహంలో ప్రతి ఒక్కటీ సజీవంగా మరియు ఎంతో ప్రకాశవంతంగా ఉంటుందనే భావన ఉంటుంది. మనసు తాను గమనించే ప్రకృతి దృశ్యంలో మమేకమై అనంత నిశ్శబ్దానికి చేరుతది. ఎందుకంటే ఇక్కడ దర్శిస్తున్నది, దృశ్యం ఒకటిగా చూడబడుతున్నయ్. అనంతమైన ప్రేమపూరితమైన, శాంతియుతమైన మరియు మరింత ధృడమైన శక్తి యొక్క ఉనికి ద్వారా ప్రతీదీ మిగతా అన్నింటికి అనుసంధానం చేయబడి ఉంటున్నది. చైతన్య స్థాయి 700 నుండి 1000 వరకు: జ్ఞానోదయం ఈ స్థాయికి చేరుకున్న చైతన్యం ప్రతీ తరంలో అతి కొద్ది మందికి మాత్రమే చేరుతది. చరిత్రలో కొందరు మాత్రమే దీనిని అందుకోగలిగిన్రు. ఇది ఉనికి యొక్క స్థాయిని దాటి ఎంతో దూరంలో ఉండడం వల్ల దీనిని వివరించడం కొంచెం కష్టమైతది. దీని నియమాలను అర్ధం చేసుకుంటం కూడా అంత సులభం కాదు. ఈ స్థాయిలో అసాధారణ శక్తి పుడతది. ఈ స్థితిలో చరిత్ర మొత్తంలోని అతి కొద్దిమంది దివ్యత్వాన్ని చేరుకునే దారిలో తమ అడుగుజాడలను ఇడిచిపెట్టిన్రు. అత్యున్నత స్థాయికి చేరిన వీరు యుగయుగాలుగా అనేక మందికి శక్తి వంతమైన ప్రేరణగా నిలుస్తున్నరు. వీరు సాధారణ వ్యక్తులుగా పరిగణించబడరు. మానవుల అత్యున్నత చైతన్యాన్ని ప్రదర్శించే అవతారాలుగా లేదా ప్రభువులుగా భావించబడతరు. వారి బోధనలు ఈ జ్ఞానోదయ స్థితికి చేరుకోవడానికి సూత్రాలను అందిస్తయి. ఇది మానవ శరీరం యొక్క అనుభవాలకు మించిన స్వఛ్ఛమైన చైతన్యాన్ని సూచిస్త్తయి. మనిషి రూపంలో మనం చేరుకోవాల్సిన చైతన్యంలో ఇది అత్యున్నత స్థితి. ఈ మహానుభావుల బోధనలు యావత్ మానవజాతి యొక్క సామూహిక చైతన్యాన్ని పెంపొందించడం ద్వారా యావత్ మానవాళికి ప్రేరణ అందిస్తయి. ఈ వ్యక్తులు తమ ఎరుకలో భాగంగా ఈ భూమిపై అనుభవించిన అన్ని జీవితాల గురించి తెలుసుకుంటరు కాబట్టి వారి గుర్తింపు శరీరంతో ముడిపడి ఉండదు. వారు సహజమైన వ్యక్తి యొక్క వ్యక్తిత్వ స్వభావాన్ని కలిగిఉండరు. ఎరుక యొక్క మూలస్థానంలొకి తిరిగి విలీనమైతరు. ఈ విలీనంలో వారికి అన్ని విషయాలు సంపూర్ణంగా బోధపడ్తయి. ప్రతీదానితో ఏకత్వ భావన కలిగి ఉంటరు. శరీరాన్ని చైతన్యాన్ని పొందే సాధకంగా మాత్రమే చూస్తారు. ఈ స్థాయికి చేరుకున్నాక శారీరకంగా వారేమీ నేర్చుకోనక్కర్లేదు. వారి చైతన్యం ఒక చోట ఉండిపోదు. అది ప్రతీచోటా సమానంగా విస్తరించి ఉంటది. చైతన్య స్థాయిని పెంచుకునే అవసరం ఏమిటి? ఈ విషయంలో మీ ప్రశ్నకు సమాధానం విస్పష్టంగా ఉంటది. మన ఆనందం మరియు శాంతిల స్థాయిని పెంచడానికి ఇది అవసరమయితది. అంటిపెట్టుకుని ఉండడం, తదుపరి స్థాయికి వెళ్ళడంలో ‘‘తదుపరి విషయం’’ మనకి ఆనందం కలిగిస్తుందనుకుంటం. సంఘర్షణలను తప్పించుకునే కొద్దీ శాంతి పెరుగుతుందనుకుంటం కానీ శాంతి మరియు సంతోషాలు మనసు యొక్క స్థాయిలు, ఇది వ్యక్తి తాలూకు బాహ్య పరిస్థితుల అనుభూతికి అందవు. అందువల్ల శాశ్వతమైన శాంతి, ఆనందాలు ఉన్నత స్థాయి చైతన్య స్థితిలో మాత్రమే పొందే వీలుంటది. ఎరుకలో మనం ఉన్నత స్థాయి సాధించేకొద్దీ అధిక శక్తి స్థానాలకు అనుగుణంగా మనల్ని సవరించుకుంట ఉంటం. ఇది మనలో అంతర్గతంగ ఉన్న ఆనందం మరియు సంతోషాలను కనుకొనేలా చేస్తది.


